konathala ramakrishna
-
Anakapalli: కొణతాలతో కలిసి పనిచేస్తానన్నది ఒట్టి మాటేనా?
అనకాపల్లి: ముందు భగ్గుమన్నారు.. కొణతాల భేటీతో సర్దుకున్నారు.. కలిసి పనిచేస్తామని చెప్పారు.. కానీ చాప కింద నీరులా తన వర్గీయులతో పూజలు, నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తీరు అంతుబట్టడం లేదని టీడీపీ–జనసేన శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నారు. అనకాపల్లి అసెంబ్లీ టికెట్ జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణకు ప్రకటించడంతో టీడీపీ నేతలు.. ముఖ్యంగా పీలా వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోయారు. తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. పార్టీని వీడాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపించింది. పుండు మీద కారం జల్లినట్టు.. కొణతాల పీలా గోవిందును కలిసి మద్దతు కోరడం అటుంచి తన వద్దకు రమ్మని కబురు చేశారు. దీంతో గోవిందు వర్గీయులు కోపంతో రగిలిపోయారు. ఇంతలో కొణతాల గోవిందు వద్దకు వచ్చి కలవడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించింది. ఇంతలో పీలా అనుచరులు గోవిందకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్‌ను మళ్లీ బయటకు తీశారు. దిబ్బపాలెం రామాలయంలో కు టికెట్ రావాలని పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టారు. వేటజంగాలపాలెంలో పడమటమ్మ తల్లిని కూడా దర్శించుకొని పూజలు జరిపారు. దీని భావమేమి తిరుమలేశా.. అంటూ జనసేన శ్రేణులు జుత్తు పీక్కుంటున్నారు. ఒకవైపు కలుస్తున్నట్టు కనిపిస్తూ.. మరోవైపు ఈ బిల్డప్‌లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పీలా గోవిందుకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అని మధనపడుతున్నారు. ఎందుకీ డబుల్ గేమ్ అని నిలదీస్తున్నారు. టీడీపీ సహకారం లేకపోతే కనీసం పరువు నిలిచే స్థాయిలోనైనా ఓట్ల రాలవన్న భయం వారికి పట్టుకుంది. చివరకు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
కొణతాల అసంతృప్తి తో ఆయిన ఇంటికి వెళ్లిన పవన్
-
ఆ విషయంపై కొణతాల ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు?
ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక పేరుతో జరిగిన ఒక కార్యక్రమం భవిష్యత్తు రాజకీయ దృశ్యం ఇలా ఉండే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. పేరుకు చర్చా వేదిక కాని, పాల్గొన్నవారిలో అత్యధికులు రాజకీయ పార్టీలవారే. అది కూడా తప్పు కాదు. కాని వారంతా అమరావతి 29 గ్రామాల ప్రాంతం మాత్రమే అభివృద్ది చెందాలని కోరుకుంటున్న వారు కావడం విశేషం. రాజకీయాలకు దూరంగా ఉంటూ, అప్పుడప్పుడో, లేక ఎన్నికలప్పుడో తళుకుమంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దీనికి నాయకత్వం వహించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఆయన చాలా ఆందోళన చెందారు. మంచిదే. కాకపోతే ఎన్నికల సంవత్సరంలోనే కాకుండా, నిరంతరం దీనిపై ప్రజలలో ఆయన ఉన్నట్లయితే ఒక నమ్మకం ఏర్పడేది. అంతేకాదు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు దూరం అయిన కొంత కాలం మౌనంగా ఉండి, సడన్‌గా 2019 ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ వెనుక నిలబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉంటే గౌరవంగా ఉండేది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడుగా పేరొందిన రామకృష్ణ మంత్రిగానే కాకుండా, ఎంపీగా కూడా పనిచేశారు. అప్పట్లో ఉత్తరాంధ్రలో ఎంత మేరకు అభివృద్ది జరిగింది, అందులో ఆయన భాగస్వామ్యం ఏమిటి? ఆ తర్వాత ఎప్పటి నుంచి అభివృద్ది ఆగిపోయింది? దానికి కారణాలు ఏమిటి? అన్న కోణంలో ఆయన చెప్పినట్లు అనిపించలేదు. కేవలం ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం, వలసలు, ఉద్దానంలో కిడ్నీ సమస్యలు, ప్రాజెక్టులు తదితర అంశాలకే పరిమితం అయ్యారు. అంతే తప్ప కీలకమైన అమరావతి అంశాన్ని విస్మరించినట్లుగా ఉంది. పత్రికలలో వచ్చిన వార్తలు చూస్తే అలా అనిపించింది. ఒకవేళ ఆయన అమరావతి మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర కూడా అభివృద్ది చెందాలని చెప్పి ఉంటే మంచిదే. తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది మోడల్ అంతా అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ లాగే సాగిందన్న విమర్శ కొత్తది కాదు. దానివల్లే ఆయన పార్టీ పరాజయం చెందింది. అమరావతి రాజధాని పేరుతో హైకోర్టుతో సహా నవ నగరాలు అన్నీ అక్కడే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాని దానిని జనం వ్యతిరేకించారు. మరి ఈ విషయంలో కొణతాల ఏమి చెబుతున్నారో తెలియదు. ఇప్పుడు కూడా ఆయన తెలుగుదేశంకు మద్దతు ఇస్తున్నట్లయితే, విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవసరం లేదని అనుకుంటున్నట్లే అవుతుంది. దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. విశాఖలో రిషికొండ తదితర ప్రాంతాలలో అభివృద్ది పనులు జరుగుతుంటే అడ్డుపడుతున్న టీడీపీ, జనసేనలతో కలిసి ఆయన ఉత్తరాంధ్రపై చర్చించడం అంటేనే రాజకీయ లక్ష్యం అర్దం అవుతుంది. అన్నిటికి మించి తెలుగుదేశం మీడియా ఈ వేదికకు విస్తారంగా కవరేజీ ఇచ్చిందంటేనే చర్చలో పాల్గొన్న వారిలో అత్యధికులు ఎటువైపు ఉన్నారో తెలిసిపోతుంది. నిజానికి ఈ రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్, టీడీపీలు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయింది. మరి ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకుబాటు తనానికి ఎవరిని తప్పుపడతారు? ముందుగా తమను తాము విమర్శించుకుని, అప్పుడు ఏమైనా మాట్లాడి ఉండాలి. విద్యావేత్తలు కె.ఎస్.చలం వంటి కొద్ది మినహా మిగిలిన వారంతా రాజకీయవేత్తలే. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పక్షాన ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆయన విశాఖ రాజధాని అవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ రాజధాని అయితే, అక్కడ పలు అభివృద్ది పనులకు ఆస్కారం ఉంటుంది. ఉత్తరాంధ్ర వాసులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆయన ఏదో గిరిజన డిక్లరేషన్ అనో, మరొకటనో చెబుతున్నారు తప్ప, విశాఖ రాజధాని గురించి మాట్లాడినట్లు లేరు. పైగా విశాఖ రాజధానిగా అవసరం లేదని ప్రచారం చేస్తూ ఉత్తరాంధ్ర అభివృద్దిపై గోష్టికి హాజరవడం గడుసుదనమేనేమో! టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు యథా ప్రకారం నోటికి వచ్చిన ఆరోపణలు చేశారు. స్వయంగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేతలే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని సిట్ ముందు చెప్పారు కదా? దాని గురించి కూడా ప్రస్తావించి ఉండవచ్చు. సీపీఐ రామకృష్ణ తెలుగుదేశం ఏమి చెబితే అదే అంటుంటారని అంటారు. ఆయన కూడా అమరావతి రాజధానిలోనే అన్ని వ్యవస్థలు, సంస్థలు కోరుకునే వ్యక్తి అని భావిస్తారు. ఆయన వచ్చి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు. పైగా ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావని శాపనార్ధాలు పెడుతున్నారు. ఒకసారి అచ్యుతాపురం పారిశ్రామికవాడకు వెళ్లి ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? రావడం లేదా అని తెలుసుకుంటే మంచిది కదా. ఏదో రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు చేయడం కాకుండా అభివృద్దికి సరైన సూచనలు చేయడం వీరు మానేశారు. ఈ మధ్య కాలంలో సీపీఎం కూడా వీరితో శృతి కలుపుతున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం కాంగ్రెస్ చాలా చేసిందని చెబుతున్నారు. మరి అసలు ఏమి అభివృద్ది జరగలేదన్నట్లుగా మాట్లాడుతున్న వారితో కలిసి చేతులు ఎందుకు ఎత్తినట్లు? సీపీఐ, సీపీఎంలు కేంద్రంలోని బీజేపీని విమర్శించడానికే ఈ సదస్సును సహజంగానే వాడుకుంటాయి. సీపీఐ రామకృష్ణ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఆచరణాత్మకంగా వీరు మాట్లాడినట్లు కాకుండా, రాజకీయ లక్ష్యంతో ప్రసంగాలు చేసినట్లు అర్దం అవుతుంది. ఇక లోక్స్తతా అధినేత జయప్రకాశ్ నారాయణ ఎక్కువ భాగం జనరల్‌గా మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఆయనకు వామపక్ష కార్మిక సంఘాల నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నిరసన ఎదురైంది. అయినా ఆయన తన వైఖరికే కట్టుబడి ఉన్నట్లు ఉన్నారు. అందువల్ల వారికి సమాధానం ఇవ్వలేదు. ఇది సరైన వేదిక కాదని ఆయన చెప్పారు. జేపీ వాదనతో వామపక్షాలు ఏకీభవించడం లేదు. అది వేరే విషయం. నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ది గురించి చర్చించాలంటే బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లకు కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సింది. వారి వాదన ఏమిటో కూడా తెలుసుకోవాలి కదా ఆ పని చేయకుండా ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి కనుక, వచ్చేది ఎన్నికల సంవత్సరం కనుక ఇప్పటి నుంచే వ్యతిరేక ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ ముసుగులో ఈ వేదికను వాడుకున్నట్లు అనిపిస్తుంది. అయితే టీడీపీ, జనసేన నేతలు బీజేపీని విమర్శించలేరు. వైసీపీపైనే విమర్శలు చేస్తుంటారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ నానా పాట్లు పడుతోంది. కాని బీజేపీ ఇంత వరకు సుముఖత కనబరచలేదు. అదే ప్రకారం రాజకీయం ఉంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన( బీజేపీని వదలిపెడితే), వామపక్షాలు కలిసి పోటీచేయవచ్చు. జేపీ లోక్‌సత్తాకు ఒకటో, అరో సీట్లు ఇచ్చి కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా కొత్త రాజకీయ సమీకరణగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేదికపై కాంగ్రెస్ పార్టీ ఉన్నా వారిని కలుపుకోవడం కష్టం కావచ్చు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే వామపక్షాలు దూరం అవుతాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో తన విజయావకాశాలు పెంచుకోవడం కోసం తెలుగుదేశం అనుసరిస్తున్న వ్యూహాలలో ఇది కూడా ఒకటి కావచ్చు. నిజానికి రాష్ట్రాన్ని ఏలిందే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వైసీపీ అధికారంలోకి వచ్చిందే మూడేళ్ల క్రితం. మరి ఈ ప్రాంత వెనుకబాటుతనానికి ఎవరిని తప్పుపట్టాలి? ముందుగా ఆ సంగతి కూడా చర్చించగలిగి ఉంటే బాగుండేది. ఈ ఏడాదంతా ఇలాంటి రాజకీయ విన్యాసాలు ఇంకా చాలా చూడాల్సిందే. -హితైషి -
అపరిచితుడు కొణతాల
⇔ మార్చి 14 గురువారం సాయంత్రం.. అనకాపల్లిలోని రావుగోపాలరావు కళాక్షేత్రం..ఆత్మీయ సమావేశం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఐదేళ్ల పాలనలో బాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. బాబు లక్ష్యంగా ఇంకా చాలా చాలా మాటలన్నారు. ⇔ కట్ చేస్తే.. మార్చి 24 ఆదివారం రాత్రి.. మునగపాకలోని కోళ్లపారం సమీపంలో మీటింగ్..చంద్రబాబుకే ఈసారి నేను మద్దతిస్తున్నాను.. మీరూ నాతోనే రండి. అని తన క్యాడర్‌కు క్లాస్.. ⇔ తాజాగా మార్చి 27 బుధవారం మధ్యాహ్నం .. ఏజెన్సీలో లోకేష్‌బాబు వెనుక ఎక్కడో నిలబడి.. ఆనక ప్రసంగించే అవకాశం ఇచ్చినప్పుడు నోరారా సీఎం చంద్రబాబుపై పొగడ్తలు.. ⇔ ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి పార్టీలు మార్చే జంప్ జిలానీలను చూస్తుంటాం కానీ.. విలువలు, సీనియారిటీ.. అంటూ సుద్దులు చెప్పుకునే కొణతాల రామకృష్ణ వంటి కుçహానావాదుల అసలు స్వరూపం ఇన్నాళ్లకు బట్టబయలైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ⇔ ఐదేళ్లలో ఎన్నో దారులు మార్చి.. నమ్ముకున్న క్యాడర్‌ను ఏ మార్చి.. వివిధ పార్టీల గుమ్మాలు తొక్కి చివరికి ‘పచ్చ’ గుమ్మం ముందు నిలబడి... మీకు నేను సేవలందిస్తాను బాబో.. అని దేబిరిస్తున్న కొణతాలను ఇప్పుడందరూ ‘అపరిచితుడు’.. అని అంటున్నారు. ఎనీ డౌట్.. అయితే... పూర్తి కథనంలోకి వెళ్దాం.. రండి.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఐదేళ్లు.. ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఈ సమయం తక్కువేమీ కాదు. ఉత్థానపతనాలను నిర్దేశించే కాలమది. ఇప్పుడిదంతా ఎందుకంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అండతో జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన కొణతాల రామకృష్ణ ఐదేళ్ల క్రితం తెర వెనక్కి వెళ్లిపోయారు. మధ్యలో అడపాదడపా ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ పేరితో హడావుడి చేసి.. మళ్లీ అడ్రస్ ఉండే వారు కాదు. వైఎస్ ప్రోద్బలంతో కాంగ్రెస్‌లో ఘనచరిత్ర సొంతం చేసుకున్న కొణతాల ఈ ఐదేళ్ల ప్రస్థానాన్నే పరిశీలిద్దాం. ముందు అనుయాయులను పంపేసి.. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ గెలవడంతో దశల వారీగా తన అనుచరులను, సన్నిహితులను ఆ పార్టీలోకి పంపిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పెందుర్తికి చెందిన గండిబాబ్జీ, ఆ తర్వాత దివంగత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులను పంపించారన్న వాదనలున్నాయి. మీరు వెళ్ళండి.. నేను వెనకే వస్తాను.. అని చెప్పి.. ముందుగా వాళ్ళను తోసేసినా.. ఈయన మాత్రం తటపటాయిడంతో అక్కడ గేట్లు మూసుకుపోయాయని అంటారు. దాంతో ఈ మధ్య కాలంలో ఉత్తరాంధ్ర చర్చావేదిక పేరిట మీడియా సమావేశాలు, వివిధ పార్టీల నేతలతో భేటీలతో కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఎన్నికల సీజన్ వచ్చేసరికి ‘ఆ పార్టీ వాళ్లు రమ్మంటున్నారు.. ఈ పార్టీ ఆహ్వానిస్తున్నారు’.. అని లీకులిచ్చి పబ్పం గడిపేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక ఆలస్యం చేయకుండా ఆత్మీయులతో సమావేశాల పేరిట హల్చల్ చేసి ఈ నెల 14న అనకాపల్లిలో జరిగిన సమావేశంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మార్చి 14న బాబుపై నిప్పులు సీఎం చంద్రబాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని అనకాపల్లి ఆత్మీయ సమావేశంలో కొణతాల ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును తరతరాలుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూపుదిద్దినా ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టును వేగంగా నిర్మించడంలో వెనకడుగు వేశారని విమర్శించారు. ఆ రోజు కొణతాల ఆవేశకా‘వేషాలు’ చూసిన ఆయన క్యాడర్.. కొణతాల రూటు చంద్రబాబుకు దూరంగానే ఉందని భావించారు. నేడు లోకేష్ వెంట తోకలా.. ఇక బుధవారం హుకుంపేట, పాడేరుల్లో జరిగిన లోకేష్‌బాబు బహిరంగ సభల్లో పాల్గొని కొణతాల చేసిన ప్రసంగాలు చూసి గిరిజనం విస్తుపోయారు. నిన్నటి వరకు బాబును తెగిడిన నోటితోనే రాష్ట్రానికి టీడీపీతోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలోనే సంక్షేమం జరుగుతోందని, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి నూరుశాతం మంచి పనిచేసిందని కితాబునిచ్చారు. ఇలా కొణతాల చేసిన వ్యాఖ్యలు, ఆయన లోకేష్ వెంట నిలబడిన దృశ్యాలు చూసిన రాజకీయ విశ్లేషకులు ఎప్పటికప్పుడు రంగులు మార్చిన కొణతాల పరిస్థితేమో గానీ.. ఆయన్నే నమ్ముకున్న క్యాడర్ మాత్రం నిండా మునిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్చి 24న బాబే కావాలంటూ సుద్దులు ఐదేళ్లుగా తన ప్రయాణం ఎటువైపో స్పష్టం చేయకుండా క్యాడర్‌ను ముప్పుతిప్పలు పెట్టిన కొణతాల ఇన్నాళ్లకు సరైన దారి ఎంచుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే ఆయన యూ టర్న్ తీసుకున్నారు. పది రోజులకే.. మార్చి 24న మునగపాకలోని కోళ్లపారం సమీపంలో మీటింగ్ పెట్టి.. చంద్రబాబుకే ఈసారి నేను మద్దతిస్తున్నాను.. మీరూ నాతోనే రండి. అని తన క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఇదేమిటని తలపట్టుకున్న క్యాడర్‌కు.. నేనింతే.. అంటూ బాబుకు వ్యతిరేకమంటూ వేసుకున్న ముసుగు తీసేశారు. కొసమెరుపు.. పాడేరులో బుధవారం జరిగిన సభలో ప్రచార వాహనంపైన ముందు లోకేష్ నిలబడి మాట్లాడుతుంటే.. బండి చివరాఖరున.. ద్వితీయ, తృతీయ శ్రేణులందరి వెనకాల కొణతాల నిలబడి ఉన్న దృశ్యం చూసి.. ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగువెలిగిన కొణతాలకు టీడీపీ వాకిట్లో ఏ స్థాయి గౌరవం దక్కుతోందో అర్ధమవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ఉపరాష్ట్రపతిని కలిసిన ఉత్తరాంధ్ర చర్చావేదిక బృందం
-
27న జనఘోష రైలుయాత్ర
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రజల జనఘోషను ఢిల్లీలో వినిపించేందుకు ఈనెల 27న ‘జనఘోష రైలు యాత్ర’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి ఉదయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉత్తరాంధ్ర వేదిక బృందం బయలుదేరుతుందన్నారు. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అంతకన్నా ముందే అక్కడికి చేరుకుని రాష్ట్ర ప్రజల సమస్యలను వివిధ పక్షాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ రైలు యాత్రను తలపెట్టినట్లు రామకృష్ణ స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ యాత్రకు రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. -
బయోడేటా కాదు.. బ్యాలెన్స్ షీటు ముఖ్యం..!
సాక్షి, విశాఖపట్నం : నోట్లకు ఓటు వేయడం అంటే అవినీతికి లైసెన్స్ ఇవ్వడమేనంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని చూస్తే గుండే ఆగిపోయే పరిస్థితి నెలకొందని, ఈ ప్రభావం వచ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కూడా పడే అవకాశం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రాజకీయ పార్టీ తమ సిద్ధాంతాలు, ప్రజల పట్ల అంకితభావం గల వారిని కాకుండా కేవలం 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నాయంటూ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే బయోడేటా కాకుండా బాలన్స్ షీట్ చూపించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇలా ఓటుకు కోసం నోట్లు పంపిణీ చేసే నేతలు నిజాయితీగా పనిచేస్తారని ఆశించడం ప్రజల పొరపాటే అవుతుందని.. అందుకే ‘మార్పు అనేది ప్రజల నుంచే ప్రారంభం కావాలని, అధికార పార్టీలు మారితే ప్రయోజనం ఉండబోదు’ అన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మాటలను రామకృష్ణ ఉటంకించారు. రాజకీయ వ్యభిచారం జరుగుతోంది... తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లభించడం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్న రామకృష్ణ.. ‘వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసమే 2 వేల కోట్ల రూపాయలను ఇక్కడున్న రాజకీయ నాయకులు రహస్య స్థావరాలకు తరలించారని’ ఒక కేంద్రమంత్రి స్వయంగా చెప్పారంటే రాజకీయ వ్యభిచారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడం కోసం అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు ఎంతటి ద్రోహులో.. నోట్లు తీసుకుని ఓటు వేసే ప్రజలు సైతం అంతటి ద్రోహులేనంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతి పెరుగుతూనే ఉంది.. ఒక సర్వేలో భాగంగా.. గత నాలుగేళ్లలో అవినీతి పెరిగినట్లు 65 శాతం మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారని రామకృష్ణ తెలిపారు. ఏసీబీ అధికారులు చిన్న చిన్న ఉద్యోగులపై కేసులు నమోదు చేస్తున్నారే గానీ.. భారీ అవినీతి తిమింగళాలను ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడితే తప్ప గెలవలేని పరిస్థితులు ఉన్నంతకాలం అవినీతి లేని పాలన అందించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఈ రోజుల్లో అన్నింటా విజృంభిస్తున్న అవినీతికి సాధారణ ప్రజలే కారణమని పేర్కొన్నారు. విద్యార్థి నాయకులే రాజకీయాల్లోకి.. గతంలో విద్యార్థి నాయకులుగా ఉన్నవారే తదుపరి రాజకీయాల్లో మేటి నాయకులుగా ఎదిగేవారని రామకృష్ణ అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, సీఎం కేసీఆర్ వంటి వారు ఆవిధంగానే రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. ధన రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజలు పోరాటం చేయలేని పక్షంలో పారిశ్రామిక వేత్తలే రాజకీయ పార్టీలను సొంతం చేసుకునే ప్రమాదం ఉందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసేవకు కాకుండా అత్యంత లాభదాయకమైన వ్యాపారంగా రాజకీయాలను భావించడం దురదృష్టకరమైన విషయమని రామకృష్ణ విచారం వ్యక్తం చేశారు. -
రాష్ట్రపతికి కొణతాల లేఖ
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014 ప్రకారం ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు అందించే నిధులను వెనక్కి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికై 2017- 18 సంవత్సరానికి గానూ 350 కోట్ల రూపాయలు విడుదల చేశారని... కానీ పలు రాజకీయ కారణాల వల్ల ఆ నిధులను వెనక్కి తీసుకోవడం దారుణమని కొణతాల లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వచ్చే మూడేళ్లలో 1050 కోట్ల నిధులు ప్రత్యేక ప్యాకేజీ కింద విడుదల చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత రెండేళ్లుగా ఏపీ వినియోగించుకున్న 946.47 కోట్ల రూపాయలకు సంబంధించిన సర్టిఫికెట్లు ప్రభుత్వం సమర్పించిందని లేఖలో పేర్కొన్నారు. అదే తరహాలో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్ల రూపాయలు ఏపీకి విడుదల చేస్తున్నట్లు జైట్లీ ప్రకటించారని.. కానీ ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలపలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి ఏదో భిక్ష వేస్తున్నట్లు కేంద్రం ప్రవర్తిస్తోందని.. కానీ ఆ నిధులు పొందడం చట్టబద్ధమైన హక్కు అని.. ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలని రాష్ట్రపతికి విఙ్ఞప్తి చేశారు. కేబీకే(కోరాపూట్- బోలంగిర్- కలహంది) ప్లాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ మాదిరి అభివృద్ధికై ప్రత్యేక ప్యాకేజీ అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని కొణతాల తెలిపారు. ఏపీకి నిధులు విడుదల చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి నచ్చడం లేదోమోనని.. అందుకే ఇలా చేసి ఉంటారని పేర్కొన్నారు. నిధులు వెనక్కి తీసుకోవడంపై ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని, అందుకు సంబంధించిన ప్రతిని ఈ లేఖతో జత చేస్తున్నామని కొణతాల పేర్కొన్నారు. -
కేంద్రాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 2017-18 సంవత్సరానికి రూ.350 కోట్ల నిధులు మంజూరు చేసి తిరిగి వెనక్కి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ శనివారం ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి,కొణతాల రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ రిట్ పిటషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల కోరుతూ రామకృష్ట పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అలాంటి ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన భాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉందని పిటిషన్లో తెలిపారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక సదుపాయాల కింద 2-9-18న జిల్లాకి రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు 350 కోట్లు కేటాయించి వెనక్కు తీసుకున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేసి వెనక్కు తీసుకునే హక్కు ఎవరికి లేదని అన్నారు. గతమూడు ఆర్థిక సంవత్సరాల్లో వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.1050 కోట్లు కేటాయిస్తే దానిలో రూ.946 కోట్లు మాత్రమే వినియోగించారని పిటిషన్లో తెలిపారు. -
చంద్రబాబుకు కొణతాల రామకృష్ణ లేఖ
సాక్షి, విశాఖ: ఉత్తరాంధ్రకు జీవనాధారమైన బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ లేఖ రాశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగు, సాగునీరు సమస్యలపై గత నాలుగేళ్లుగా ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామన్నారు. సుజల స్రవంతి ప్రాజెక్టుపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలు పంటకు సాగునీరు, తాగడానికి నీళ్లు అడుగుతున్నారే తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపైన కొన్ని రాజకీయ పక్షాలకు అభిప్రాయబేధాలున్నాయి. కానీ సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు. మేలో జరుగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడులోపు ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతామన్నారు. ఆందోళనల అనంతర పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. లేఖలో పేర్కొన్న పలు అంశాలు - ప్రాజెక్టు పనులకు ఏడాదికి 5 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాలి. - అదే విధంగా ఉత్తరాంధ్రలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి - గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరిలించేందుకు కార్యాచరణ రూపొందించాలి. - బాబు జగ్జీవన్‌రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టు పేరును మార్చే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలి - నిర్వాసితులకు చట్ట ప్రకారంగా తగిన నష్ట పరిహారం చెల్లించి భూ సేకరణ చేపట్టాలి. - పోలవరం ఎడమ కాలువ పనులను సత్వరం పూర్తిచేసి విశాఖ జిల్లాలోని లక్షా యాభైవేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలి. -
మళ్లీ అదే అన్యాయం: కొణతాల
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు రంగాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయంపై ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. ‘ఆర్టికల్ 371(డి) ప్రకారం విద్య ఉద్యోగ అవకాశాల్లో 85 శాతం స్థానికులకే కల్పించాలని స్పష్టం చేస్తుంది. కానీ వెనుకబడిన ఉత్తరాంధ్రలో ఈ నిబంధన అమలు కావడం లేదు. ఇది రాజ్యంగ ఉల్లంఘనే అవుతుంది. ఇందుకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై, ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవాల’ ని లేఖలో పేర్కొన్నారు. ‘అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగనట్లే తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన వాటా రాకపోవడం వల్ల యువత నిరాశకు గురవుతున్నారు. ఈ ప్రాంత వనరులు స్థానికేతరులు కొల్లగొడుతున్నారు. నీళ్లు, నిధులు, నియమకాల్లో తీవ్ర అన్యాయం జరగడం వల్ల ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో స్థానికులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం స్పందించకుంటే యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుతం న్యాయం చేయాల’ని విజ్ఞప్తి చేశారు. ‘స్థానికులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం కాలపరిమితితో కూడిన స్వతంత్ర ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా అన్యాయం జరగకుండా చూడాలి. ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న స్థానిక, స్థానికేతరుల లెక్కలు బయటికి తీసి శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రైవేటు సంస్థలు కూడా స్థానికులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే వాటిపైన కఠిన చర్యలు చేపట్టాల’ని లేఖలో కొణతాల డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా కోసం రక్తదాన శిబిరం
సాక్షి, విశాఖ : ప్రత్యేక హోదా, రైల్వేజోన్, ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్యాకేజీతో పాటు విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో విశాఖ కేజీహెచ్‌లో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర హక్కుల కోసం రాజకీయ పార్టీలన్నీ తమ జెండాలను పక్కన పెట్టి పోరాడినప్పుడే కేంద్రం దిగివస్తుందన్నారు. బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. సత్యనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. -
రైల్వేజోన్, ప్రత్యేక హోదా కోసం రక్తదానం
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వేజోన్, ప్రత్యేక హోదా సాధనకోసం రక్తదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. విభజన హామీలతో సహా ఉత్తరాంధ్రకు ఆర్ధిక ప్యాకేజీ హామీ అమలు కోసం ఈ నెల 30న ఉదయం 9 గంటలకు విశాఖపట్నం రైల్వే హాస్పిటల్ లో రక్త దానం కార్యక్రమం చేబడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుదామని ఆయన పిలుపునిచ్చారు. -
‘ఒకే ఎజెండాతో పోరాడాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం మార్చి 4న(ఆదివారం) విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో సాయంత్రం 6గంటలకు కొవ్వొత్తులతో తెలిపే నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని మాజీ పార్లమెంట్ సభ్యులు, ఉత్తరాంధ్ర చర్చవేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భరంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలు నాలుగేళ్లు గడుస్తున్నఅమలుకు నోచుకోని విషయం మనందరీకి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హక్కులు కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2014లో రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి ఆచరణలో లేవన్నారు. మనకు ఇచ్చిన హామీలపై నిర్ధిష్టమైన కార్యచరణతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా లేనిపక్షంలో ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా నష్టపోతుందని కొణతాల పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఎక్కవగా నష్టపోతారన్నారు. ఈ తరుణంలో జెండాలు పక్కనపెట్టి, ఏకైక ఎజెండాతో సమిష్టిగా పోరాడని పక్షంలో భావితరాలు మనల్ని క్షమించవు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు, స్వఛ్చంధ సంస్థలు, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కవులు, కళాకారులు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, న్యాయవాదులందరూ పాల్గొన్నాలని కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. -
‘ఏపీ కోలుకోవటానికి 30 ఏళ్లు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీరును పలు పార్టీల కీలక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విభజన హక్కుల సాధన సమితి సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. అన్ని విధాలుగా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న విధంగా నిధుల కేటాయింపు జరిగిందా లేదా చెప్పాలని టీడీపీ నేతలను పార్థసారధి డిమాండ్ చేశారు. ఢిల్లీ స్థాయిలో బాబు కేవలం ఆయన స్వార్ధం కోసం పని చేస్తున్నారని రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేశారని ఆరోపించారు. బాబుకు మంచి వైద్యం చేయించాలి: సీపీఐ నేత రామకృష్ణ ‘రాష్ట్రానికి ఏం సాధించాలి, ఏవి కావాలన్న విషయం మీద ఒక్క చంద్రబాబుకి తప్ప, ఏపీ నేతలతో పాటు ప్రజలకు స్పష్టత ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజితో సమానమని చెప్పారు. ఇప్పుడు అది నిజం కాదనే ధోరణిలో వ్యవహరిస్తూ పక్కా గందరగోళంలో ఉన్నారు. చంద్రబాబు సందిగ్ధత నుంచి ముందు బయటకు రావా. లేదా ఆయనకు మంచి వైద్యం అందించాలి. ఏపీకి జరుగుతున్న అన్యాయం మీద ఢిల్లీ కేంద్రంగా అంతిమ పోరాటం చేయాలంటూ’ అన్ని పార్టీల నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది: సీపీఎం నేత మధు ‘రాజకీయ క్రీడలో కొన్ని పార్టీలు బిజీ బిజీగా ఉన్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు సంప్రదింపులకే బీజేపీ నేతలకు నాలుగేళ్లు పట్టిందా. 11 జాతీయ విద్యా సంస్థలకు, మరో 9 సంస్థలుకు అనుమతులు ఇచ్చారు. రూ. 9000 కోట్ల నిధులకు కేవలం రూ. 420 కోట్లు మంజూరు చేశారు. ఈ విధంగా నిధులిస్తే ఆంధ్రప్రదేశ్ కోలుకోవటానికి ముప్పై ఏళ్లు పడుతుంది. ఇక ముసుగులో గుద్దులాటలు ఉండవు. మార్చి 5, 6 కల్లా అంతా తేలిపోతుంది. ఇన్నేళ్లలో అఖిలపక్షం ఏర్పాటు చెయ్యమంటే చేయనేలేదు. సీఎం దుర్మార్గంగా, ఏ బాధ్యతా లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రానిది ఒక నాటకం.. రాష్టానిది ఒక నాటకం. మార్చి 6వ తేదీ తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని’ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన: కొణతాల రాష్ర్ట విభజన హామీల అమలు కోసం ఉత్తరాంధ్ర చర్చా వేదిక విశాఖపట్నం బీచ్ లో మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శన నిర్వహించనుందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. -
మార్చి 4న కొవ్వొత్తులతో నిరసన
సాక్షి, విశాఖపట్నం : రాష్ర్ట విభజన హామీల అమలు కోసం మార్చి 4న కొవ్వొత్తులతో మహా నిరసన ప్రదర్శ నిర్వహించాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక తలపెట్టింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఈ నెల 12 నుంచి నర్సీపట్నం, విజయనగరం, మాడుగుల ప్రాంతాల్లో చేపట్టిన ‘ ఉత్తరాంధ్ర జనఘోష’ కార్యక్రమాలు విజయవంతం కావడంతో మార్చి 2 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు ముందు విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ కొవ్వొత్తుల మహా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ర్టంలోని అన్ని పార్టీల నాయకులను స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని కొణతాల యోచిస్తున్నారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతుందని తెలిపారు. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్, రాయలసీమ అభివృద్ధి మండలి ఏర్పాటు, ఎయిమ్స్ ఆసుపత్రి, విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, విశాఖ మెట్రో రైలు, ఒడిశాతో ఉన్న జలవివాదాల పరిష్కారం వంటి హామీల సాధనే లక్ష్యంగా మహా నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రాష్ర్ట విభజన హామీల అమలు కోసం అన్ని పార్టీలను ఒకే తాటిపై తెచ్చేందుకు ఉత్తరాంధ్ర చర్చావేదిక ఆహ్వానం పంపుతుందని తెలిపింది. కొవ్వొత్తుల మహా ప్రదర్శనలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేస్తున్నప్పటికీ ఆయా పార్టీలేవీ తమ జెండాలను ప్రదర్శించకూడదనే షరతులు విధించింది. ఈ కొవ్వొత్తుల మహా ప్రదర్శనలో పాల్గొనే వారంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా కొవ్వొత్తులు తెచ్చుకునేలా పిలుపునివ్వాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక నిర్ణయించింది. కేంద్ర హామీల అమలుతో పాటు రాష్ర్ట వార్షిక బడ్జెట్లోనూ ఉత్తరాంధ్ర వాటా కోసం ఈ ప్రదర్శన ద్వారా ఒత్తిడి తేవాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక నాయకులు భావిస్తున్నారు. -
పార్లమెంటు చట్టాన్ని గౌరవించండి: కొణతాల
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయాక ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న రైల్వే జోన్, ప్రత్యేక హోదా హామీలను బీజేపీ నెరవేర్చాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ శుక్రవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరారు. ఆయన రైల్వే మంత్రికి రాసిన సుదీర్ఘ లేఖలో ప్రస్తుత బడ్జెట్లోనైనా విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని విన్నవించారు. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత కూడా విశాఖ రైల్వే జోన్ అంశం కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. ఈ విషయమై మాజీ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి రెండు సార్లు అర్జీ పెట్టుకున్నా.. ఫలితం లేకుంగా పోయిందని తెలిపారు. ‘ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లు, 2014 లోని షెడ్యూల్ 3 అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులను కల్సిస్తామని తెలిపింది. దాంట్లో భాగంగానే ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్ తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు రైల్వే జోన్ ఏర్పాటు అనివార్యం అయినందున వెంటనే స్పందించండి’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. హామీల అమలుకు దిక్కు లేదు.. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలికాంశాలు విశాఖపట్నం కలిగివుందని కొణతాల అన్నారు. 1052 కి.మీ. రైల్వే లైన్ వున్న ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన రైల్వేజోన్ ఏర్పాటు కొన్ని రాజకీయ కారణాలతోనే జాప్యం అవుతోందని ఆయన విమర్శించారు. ఆదాయార్జనలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న వాల్తేర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మరో విశేషమని అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా సాగుతున్న దేశంలో న్యాయమైన తమ వంతు వాటాకోసం ఉత్తరాంధ్ర ప్రజానీకం కోరుకుంటోందని.. విశాఖ పట్నం హెడ్ క్వార్టర్స్‌గా రైల్వే జోన్ ఏర్పాటుతో వారి కలలను నిజం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లులో రాష్ట్రం విడిపోయాక ఆరు నెలల కాలంలోనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైల్వే జోన్‌ను చేర్చారని గుర్తు చేశారు. పార్లమెంటు హామీలు కూడా అమలుకు నోచుకోకుంటే ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం పోతుందని నిరసన వెళ్లగక్కారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో చివరి ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇంకా ఆలస్యం చేసి ప్రజల్లో ఉన్న అసహనాన్ని పెంచొద్దని హెచ్చరించారు. -
రైల్లో కొణతాల వినూత్న దీక్ష?
సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వినూత్న నిరసనకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 27న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో 48 గంటల పాటు నిరసన దీక్షను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఆసుపత్రి(విమ్స్)ను ఎయిమ్స్‌గా మార్చడం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల అమలుకు అవసరమయ్యే నిధులన్నీ రాబోయే బడ్జెట్లో కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో కొణతాల ఈ వినూత్న నిరసనను చేపడుతున్నట్లు తెలిసింది. డిమాండ్ల సాధన కోసం ఒక రాజకీయ నాయకుడు రైలులో దీక్ష చేపట్టడం ఇదే ప్రథమం. గతంలో జాతి పిత మహాత్మా గాంధీ డిమాండ్ల కోసం రైల్లో దీక్షలు చేపట్టేవారు. రైల్లో దీక్ష చేపడుతున్న తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున కొణతాల అనుచరులు కూడా పయనమవుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏం చేయబోతున్నారు? ఈ నెల 27వ తేదీన ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో దీక్షను ప్రారంభించి.. 29వ తేదీన ఢిల్లీలోని రాజ్‌ఘాట్(మహాత్మాగాంధీ సమాధి)కు వెళ్లి దీక్షను విరమిస్తారు. ఆ తర్వాత పార్లమెంటు ఉభయ సభల ఫ్లోర్ లీడర్లను, ఎంపీలను కలసి సంబంధిత డిమాండ్ల సాధనకు మద్దతు కోరతారు. అలాగే కేంద్రమంత్రులను కలుసుకుని వచ్చే బడ్జెట్లో రాష్ట్రానికి నిధులను కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేస్తారు. -
విభజన తర్వాత అన్నీ కష్టాలే..!
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ విజయనగరం పూల్‌బాగ్ : రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయిందని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఆది నుంచి అన్ని ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తూ, అభివృద్ధిని పక్కన పెట్టేశాయని పేర్కొన్నారు. లక్షలాది ప్రజలు కూలి కోసం వలస బాట పడుతున్నారని, దీనికి కేవలం పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆరోగ్యం, పర్యాటకం, విద్యుత్ శక్తి, పరిశ్రమలు, పారిశుద్ధ్యం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఉత్తరాంధ్ర వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. విద్యాభివృద్ధికి నిధులు కేటాయించడం లేదన్న విషయం బహిరంగానే తెలుస్తుందన్నారు. బుందేల్ ఖండ్, కోరాపుట్, బోలంగీర్, కలహాండి తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 24 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు అందించాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, విమ్స్‌ను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని అన్ని పార్టీల మేధావులను పిలిచి ఈ నెల 25న చర్చావేదిక ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 నుంచి ఆగస్టు 15 వరకు సంతకాల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ కోలగట్లను కలిసిన కొణతాల విజయనగరంమున్సిపాలిటీ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం చేపడుతున్న చర్చావేదికలో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా కోరుతూ మాజీ మంత్రి, చర్చవేదిక నాయకుడు కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామిని కోరారు. ఆదివారం విజయనగరానికి వచ్చిన కొణతాల కోలగట్లను కలిసి తర్వాత మాట్లాడారు. అనంతరం కొణతాల మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని, ఇక్కడి ప్రజల వెనుకబాటుతనం, ఆకాంక్షల పేరిట ముద్రించిన కరపత్రాలను కోలగట్లకు అందించారు. ఆ సమయంలో మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, వల్లూరి ప్రకాష్‌బాబు పాల్గొన్నారు. -
‘ఏపీలో మళ్లీ ఉద్యమాలు’
-
‘ఏపీలో మళ్లీ ఉద్యమాలు’
విజయనగరం: ఉత్తరాంధ్రపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి చుట్టే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో మళ్లీ ఉద్యమాలు వచ్చే అవకాశముందని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికివుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెండు ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ నమ్మరని కొణతాల రామకృష్ణ అన్నారు. -
కొణతాలకు పరామర్శ
శ్రీకాకుళం న్యూకాలనీ: సతీ వియోగంతో బాధ పడుతున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతిలు పరామర్శించారు. వీరు సోమవారం అనకాపల్లిలోని కొణతాల నివాసానికి వెళ్లి ఆయనను ఓదార్చారు. ఈ సందర్భంగా కొణతాల భార్య సుజాత చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కొణతాలను పరామర్శించిన వారిలో వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు ఎ.మురళీధరరావు, బి.ఈశ్వరరావు, కె.రమణమూర్తి, తదితరులు ఉన్నారు. -
చంద్రబాబుకు మాజీ ఎంపీ కొణతాల లేఖ
గుంటూరు : ఉత్తరాంధ్రలోని సేద్యపు నీటి రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ సీఎం చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు. ఏపీలోని 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్న విషయం గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అత్యధిక వర్షపాతం 1050 మి.మీ ఉత్తరాంధ్రలో కురుస్తున్నా.. అక్కడి జిల్లాల్లోని కోటిమంది ప్రజలు తాగునీరు, సాగునీరు సమస్యలతో అల్లాడిపోతూ, పొట్ట చేతబట్టుకుని లక్షలాదిమంది వలస బాట పడుతున్నారన్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి రంగంపై శ్రద్ధ చూపకపోవడమే అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, త్రాగునీరు కష్టాలను పరిష్కరించడానికి ఏకైక మార్గం 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును తక్షణం చేపట్టడమేనని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, పన్నెండు వందల గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చు. దానిని దృష్టిలో ఉంచుకునే అప్పటి ముఖ్యమంత్రి దివంగతనేత డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డిగారి దృష్టికి ఆ ప్రాజెక్టును తీసుకుని రాగా వెంటనే 2008 సంవత్సరంలో ఆయన పరిపాలనా అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ ప్రాజెక్టుకు సబ్బవరంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని గుర్తుచేశారు. అయితే ఆయన మరణానంతరం ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కూడా 'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి' ప్రాజెక్టును సత్వరం పూర్తి చేస్తామని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ ప్రాజెక్ట్ పనులు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ప్రాజెక్ట్ పూర్తికావాలంటే 7500 కోట్లు అవసరం కాగా ఈసారి బడ్జెట్ లో 3 కోట్లు మాత్రమే కేటాయించారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి తక్షణమే ప్రాజెక్ట్ పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య తీరాలంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు నష్టం చేస్తున్న ఒడిశా ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వ వైఖరి కారణంగా రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతుందన్నారు. న్యాయపరంగా కట్టుకుంటున్న సేద్యపు ప్రాజెక్టులకు అనేక అడ్డంకులను కలిగిస్తూ, అక్రమంగా ఆ రాష్ట్రంలో ప్రాజెక్టును నిర్మిస్తూ ఉత్తరాంధ్ర రైతాంగానికి ఒడిశా ప్రభుత్వం తీవ్ర నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉత్తరాంధ్ర రైతాంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. -
'కొణతాల చేరికపై అసంతృప్తి సహజమే'
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో కొణతాల రామకృష్ణ చేరికపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విశాఖపట్నంలో తొలిసారిగా పెదవి విప్పారు. కొణతాల చేరికపై పార్టీలో అసంతృప్తి ఉన్నమాట సహజమేనని ఆయన ఒప్పుకున్నారు. అనకాపల్లిలో కొందరు కార్యకర్తలు కొణతాల రాకను వ్యతిరేకిస్తున్నారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. స్థానిక కార్యకర్తలకు... కొణతాలకు మధ్య వివాదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
కొణతాలను చేర్చుకుంటే రాజీనామా చేస్తాం
►కశింకోట మండల టీడీపీ నాయకుల హెచ్చరిక ► టీడీపీ నేతలపై కేసులు పెట్టిన ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారు ► తమ నిర్ణయాన్ని కాదంటే మూకుమ్మడిగా గుడ్‌బై కశింకోట: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను పార్టీలో చేర్చుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలపై మండల టీడీపీ భగ్గుమంది. ఈ మేరకు కశింకోటలో ఆదివారం రాత్రి మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రామకృష్ణను టీడీపీలో చే ర్చుకోవడానికి ససేమిరా వీలులేదని, శ్రేణుల మనోగతాలకు విరుద్ధంగా చేర్చుకుంటే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తామని పలువురు టీడీపీ నాయకులు హెచ్చరించారు. విశాఖ డెయిరీ డెరైక్టర్ మలసాల రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొణతాల రామకృష్ణ గతంలో మండల టీడీపీ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, జైలు పాలు చేశారని ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు సంప్రదాయాలను పాటించకుండా టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీపీలను వేధింపులు, ఇబ్బందులకు గురిచేసి విలువ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. పీఎసీఎస్ ఎన్నికల్లోను టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులపాలు చేశారన్నారు. అటువంటి కొణతాలను చేర్చుకుంటే సహించేది లేదని, రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాయల మురళీధర్ మాట్లాడుతూ కార్యకర్తల అభీష్టానికి విరుద్ధంగా కొణతాలను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఇక్కడ తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వేగి వెంకటరావు మాట్లాడుతూ పసుపు చొక్కా వేసుకున్న తనను ఎన్నికల కేంద్రంలో ఏజెంటుగా వెళ్లకుండా పోలీసులతో మంత్రిగా ఉన్న కొణతాల బయటకు నెట్టించి వేశారని, అక్రమంగా కేసు బనాయించి యలమంచిలి సబ్ జైలులో తొమ్మిది రోజులు ఉండేలా చేశారని ఆరోపించారు. అటువంటి కొణతాలను చేర్చుకుంటే కార్యకర్తలు ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఎంపీటీసీ సభ్యుడు వేగి దొరబాబు మాట్లాడుతూ పచ్చ చొక్కా అంటే పడని కొణతాల ఇప్పుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎలా టీడీపీలోకి చేరుతారని ప్రశ్నిం చారు. కార్యకర్తలకు వ్యతిరేకంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ముకుమ్మడిగా రాజీనామా చేయాలని సమావేశం నిర్ణయించింది. అంతే కాకుండా కశింకోటలో సోమవారం మండలస్థాయి సమావేశాన్ని పార్టీ శ్రేణులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో నిర్వహించి కొణతాలను చేర్చుకోవద్దని గ్రామాల వారీగా తీర్మానాలు తీసుకొని అధిష్టానానికి పంపాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పొన్నగంటి నూకరాజు, పార్టీ నాయకులు తిరుచోళ్ల రామకృష్ణ, వేగి గోపీకృష్ణ, మలసాల కుమార్‌రాజా, అందె సన్యాసిరావు, గొంతిన అప్పలనాయుడు, కరక రాజు, కలగా సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.