
'సమైక్య శంఖారావం'ను విజయవంతం చేద్దాం: కొణతాల రామకృష్ణ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో ఈ నెల 26న నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభను విజయవంతం చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. సమైక్యవాదులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పీఠం కదిలేలా సమైక్య శంఖారావాన్ని పూరిద్దామంటూ కొణతాల ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు సహకరిస్తున్నాయని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం పార్టీలకు అతీతంగా పోరాడామంటూ సూచించారు. మహనీయుల త్యాగాలతో ఏర్పడ్డ తెలుగుగడ్డ విడిపోకూడదని కొణతాల రామకృష్ణ అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.