కాంగ్రెస్ కుట్రతోనే 'సమైక్య శంఖారావం'కు అనుమతి ఇవ్వలేదు | congress conspiracy behind denial of permission to samaikya sankharavam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కుట్రతోనే 'సమైక్య శంఖారావం'కు అనుమతి ఇవ్వలేదు

Published Tue, Oct 15 2013 1:23 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ కుట్రతోనే 'సమైక్య శంఖారావం'కు అనుమతి ఇవ్వలేదు - Sakshi

కాంగ్రెస్ కుట్రతోనే 'సమైక్య శంఖారావం'కు అనుమతి ఇవ్వలేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో 'సమైక్య శంఖారావం' సభకు కిరణ్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ ఆగ్రహాం వ్యక్తం చేశారు. మంగళవారం విశాఖపట్టణంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...  సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు.

 

రాజ్యాంగ సంక్షోభానికి అడ్డుపడుతోంది సీఎం కిరణే అని ఆయన అభిప్రాయపడ్డారు.  ఆస్తులు కాపాడుకోవడానికే కేంద్రమంత్రులు దృష్టి పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచేందుకు వారు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని అన్నారు. అందులో భాగంగానే కేంద్రమంత్రలు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.

 

ఈ నెల 19న హైదరాబాద్ లో సమైక్య శంఖారావం సభను నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే  ఆ సభకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement