27న జనఘోష రైలుయాత్ర | Jana Gosha Rail Yatra Starts On Jan 27 | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 21 2019 3:16 PM | Last Updated on Mon, Jan 21 2019 3:21 PM

Jana Gosha Rail Yatra Starts On Jan 27 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రజల జనఘోషను ఢిల్లీలో వినిపించేందుకు ఈనెల 27న ‘జనఘోష రైలు యాత్ర’ కార్యక్రమం చేపడుతున్నట్లు ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి ఉదయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉత్తరాంధ్ర వేదిక బృందం బయలుదేరుతుందన్నారు. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అంతకన్నా ముందే అక్కడికి చేరుకుని రాష్ట్ర ప్రజల సమస్యలను వివిధ పక్షాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ రైలు యాత్రను తలపెట్టినట్లు రామకృష్ణ స్పష్టం చేశారు. ఐదు రోజుల పాటు ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ యాత్రకు రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement