
చంద్రన్న రాజ్యం తెస్తామని ఎందుకు చెప్పడం లేదు?
హైదరాబాద్: చంద్రబాబు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే 1999 నుంచి ఇప్పటివరకు టీడీపీ గెలవలేకపోయిందని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని అన్నారు. రాజన్న రాజ్యం తెస్తామని తాము చెబుతున్నామని, చంద్రన్న రాజ్యం తెస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పాత హామీలనే మళ్లీ గుప్పించారని విమర్శించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పారు. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని కొణతాల రామకృష్ణ తెలిపారు.