వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మూడింది
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.
కదిరి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అబద్దపు హామీలతో గద్దె నెక్కిన చంద్రబాబు ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి..అందరినీ నిలువునా ముంచారన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు హస్తం ఉందన్న విషయం అందరికీ తెలుసని, ప్రజా కోర్టులో ఆయన ముద్దాయేనని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా తీసుకొస్తామని బీజేపీ, టీడీపీ ఎన్నికలకు మునుపు చెప్పి, ఇప్పుడు హోదా అవసరమే లేదని, ప్యాకేజీ చాలని చెప్పడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ప్రత్యేకహోదా సాధనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడం కోసం మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని అనారోగ్యశ్రీగా మార్చేశారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింల తలాక్ విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. పెద్ద నోట్ల రద్దును తాము తప్పుబట్టడం లేదని, అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా రద్దుచేయడం అనాలోచిత నిర్ణయమేనని అన్నారు. సమావేశంలో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి, సీఈసీ సభ్యుడు జక్కల ఆదిశేషు, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, పాల్గొన్నారు.