
'బాబు దయాదక్షిణ్యాలపై కిరణ్ సర్కార్ నడుస్తోంది'
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా ఉండేది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై కిరణ్ సర్కార్ నడుస్తోందని ఎద్దేవా చేశారు.
2007, 2009 సంవత్సరాల్లో తెలంగాణకు ఎలాంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీ అంగీకారం తెలిపిన సంగతిని కొణతాల ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలుపరచాల్సిన అవశ్యకతను ఈ సందర్బంగా కొణతాల రామకృష్ణ వివరించారు.