
'దిగ్విజయ్ మాటొకటి.. షిండే ప్రకటన మరొకటి'
రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తోందని వైఎస్‌ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ ఒక ప్రకటన చేస్తే, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే మరో ప్రకటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
తెలంగాణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి నేతలను తప్పుదారి పట్టిస్తున్నారని కొణతాల ఆరోపించారు. తీర్మానాన్ని ఓడిద్దామంటూ రాజీనామా చేయకుండా అడ్డుపడుతున్నారని చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. రెండో ఎస్సార్సీ అన్న కాంగ్రెస్ పార్టీయే యూటర్న్ తీసుకుని మాకు స్పష్టత లేదని విమర్శించడం విడ్డూరమన్నారు. ఫైలిన్ తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం, అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కొణతాల కోరారు.