
కొత్త పార్టీ అంటే విభజన కోరడమే: కొణతాల
అనకాపల్లి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న వారు విభజనను కోరుకున్నట్లేనని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. విశాఖ జిల్లా గవరపాలెంలోని కొణతాల సుబ్రహ్మణ్యం ఘాట్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెల రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్చడంతో విభజనపై ఎటువంటి ప్రభావం ఉండబోదని అన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అస్వస్థత పేరు చెప్పి సీఎం, మొక్కుబడి కారణాలు చూపి చంద్రబాబు సభలో లేకపోవడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. అప్పుడు లేని హడావుడి ఇప్పుడు ఎందుకని, కేవలం ఇదంతా రాజకీయా డ్రామాగానే అభివర్ణించారు.