
'కొణతాల చేరికపై అసంతృప్తి సహజమే'
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో కొణతాల రామకృష్ణ చేరికపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విశాఖపట్నంలో తొలిసారిగా పెదవి విప్పారు. కొణతాల చేరికపై పార్టీలో అసంతృప్తి ఉన్నమాట సహజమేనని ఆయన ఒప్పుకున్నారు. అనకాపల్లిలో కొందరు కార్యకర్తలు కొణతాల రాకను వ్యతిరేకిస్తున్నారని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. స్థానిక కార్యకర్తలకు... కొణతాలకు మధ్య వివాదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.