
కేంద్ర మంత్రుల బృందానికి గోబ్యాక్ చెప్పాలి: కొణతాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే కేంద్ర మంత్రుల బృందానికి (జీఓఎం)గో బ్యాక్ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ గురువారం సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజ్యాంగ సంక్షోభంతోనే విభజనను అడ్డుకోగలమని అభిప్రాయపడ్డారు. తక్షణమే అసెంబ్లీని సమావేశపరచి సమైక్య తీర్మానం చేద్దామన్నారు. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని సూచించారు. న్యూఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమైక్యం కోసమే దీక్ష చేస్తున్నానని చెప్పడం లేదంటూ కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు.