'వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయం' | Y S Jagan Mohan Reddy will be next Chief Minister of Andhra Pradesh, says Konathala Ramakrishna | Sakshi
Sakshi News home page

'వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయం'

Published Thu, Apr 3 2014 2:15 PM | Last Updated on Mon, Aug 27 2018 8:57 PM

'వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయం' - Sakshi

'వైఎస్ జగన్ను సీఎం చేయడమే ధ్యేయం'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తమ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పీ ఎల్ ఎన్ పట్నాయిక్ తన అనుచరులతో కలసి కొణతాల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 

ఈ సందర్బంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయిన వైఎస్ఆర్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎవరు ఎన్ని దుష్పచారాలు చేసినా...  ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement