Chief Minister of Andhra Pradesh
-
Polavaram: పోలవరం వద్ద సీఎం చంద్రబాబు
అమరావతి/ఏలూరు, సాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల్ని గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారాయన.ఆపై ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ప్రత్యేకంగా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విలేకర్లతో మాట్లాడతారని తెలుస్తోంది. గతంలో.. 2014-19 మధ్య మూడో సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టారు. -
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం
-
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్రజినీకాంత్ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే -
AP Cabinet: ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికో?
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్ర కూటమి నేడు అధికారం చేపట్టబోతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వేళ.. 24 మంత్రులతో కూడిన జాబితా విడుదల విడుదలయ్యింది. వీళ్లందరితో కలిసే ముఖ్యమంత్రిగా ఇవాళ విజయవాడలో ప్రమాణం చేయబోతున్నారు ఆయన. అయితే.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. తనతో సహా 25(24 మంది మంత్రులు)తో కూడిన జాబితానే చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే.. ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా? లేదంటే టీడీపీకా? అనే అంశం తెరపైకి వచ్చింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్‌పోలియో కేటాయిస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఈ అంశంపైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.సంబంధిత వార్త: చంద్రబాబు కేబినెట్.. సామాజిక వర్గాల వారీగా చూస్తే..మంగళవారంనాడు ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాక.. అర్ధరాత్రి దాటాక కొత్త మంత్రుల జాబితా విడుదల చేశారు. తొలుత జనసేనకు 4, బీజేపీ 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ, కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. ముందు నుంచి వినవస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లు మంత్రులు కాబోతున్నారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్‌కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలి అనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. -
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌గారికి కృతజ్ఞతలు
‘‘కళారంగంలో శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జీవిత సాఫల్య పురస్కారం కె. విశ్వనాథ్‌గారితో పాటు నాకూ దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి «కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ప్రముఖ దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలపై ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి సినిమాలు తీస్తున్న నన్ను పీపుల్స్‌స్టార్ అని ప్రజలు అభిమానిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
అబద్ధాలకు చెక్... అభివృద్ధితోనే!
ఎన్నో ప్రణాళికలతో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన నాయకుడికి పదవీకాలంలో తొలి సగం చాలా కీలకం. అనుకున్నవి చేయాలి, అనుకోకుండా వచ్చిపడేవి ఎదుర్కోవాలి. దురదృష్టవశాత్తూ జగన్‌కు గత టీడీపీ ప్రభుత్వం మిగిల్చివెళ్లింది ఖాళీ ఖజానా. దీనికితోడు కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభం. పైగా నిత్యం రంధ్రాన్వేషణ చేసే, అబద్ధపు కథనాలు వండివార్చే పచ్చ మీడియా. ఆర్థిక అననుకూలతలను తట్టుకొని మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలనూ అమలు చేస్తోంది. ఇక అడ్డగోలు మీడియాను, బాధ్యత లేని ప్రతిపక్షాన్ని సంక్షేమ ఫలాలతో ప్రజలకు చేరువ కావడం ద్వారా ఎదుర్కొంటోంది. జగన్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం ఇదే! ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవీకాలం అప్పుడే సగం ముగిసింది. ఇందులో మొదటి ఆరు నెలలు ఇల్లు సర్దుకోవడానికి సరిపోయింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో ఏడాదిన్నర కాలం జరిగిపోయింది. ఇప్పటికీ అది పూర్తిగా తొలగిపోలేదు. మొత్తం మీద జగన్ ప్రభుత్వం సరిగా నడి చింది ఆరు నెలలే అన్నమాట. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి మిగిల్చి వెళ్లింది వంద కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని టీడీపీకి మద్దతిచ్చే ఒక పత్రికే రాసింది. కానీ ప్రస్తుతం అవే టీడీపీ పత్రికలు, టీవీ చానళ్లు జగన్ ప్రభుత్వాన్ని దుర్మార్గంగా వెంటాడుతున్నాయి. ప్రతిపక్ష దాడి ఒక ఎత్తు అయితే, ఈ మీడియా దాడిని తట్టుకోవడం మరో సమస్య. అయినా జగన్‌కు ఇది కొత్త కాదు. 2011 నుంచి ఈ పరిస్థితికి అలవాటుపడ్డారు. తాజాగా ఒక టీడీపీ పత్రిక జగన్ తన పదవీకాలం సగం పూర్తి చేసుకున్న సందర్భంగా సమీక్ష పేరుతో ఒక కథనం రాస్తూ, కొన్ని వాస్తవాలు తప్ప అత్యధిక భాగం అబద్ధాలతో నింపేసింది. ఏ మీడియా అయినా నిష్పక్షపాతంగా విశ్లేషణలు ఇవ్వాలి. ప్రభుత్వం వైపు నుంచి జరిగిన మంచిపనులను అంగీకరించాలి. కానీ ఈ మీడియా మాత్రం జగన్ ప్రభుత్వంలో ఈ రెండున్నర ఏళ్లలో ఏమీ జరగలేదని ప్రచారం చేసే దుస్సాహసానికి దిగింది. జగన్ వ్యతిరేకులు అనండి, ఆయా ప్రతిపక్షాలు అనండి, టీడీపీ మీడియా అనండి... ఎక్కడా ఏడాదిన్నర కరోనా సంక్షోభం గురించి గానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులు మిగల్చకుండా వెళ్లిపోయిన వైనం గురించి గానీ ఒక్క ముక్క కూడా ప్రస్తావించ కుండా, జగన్ ప్రభుత్వం అప్పులు చేసిందని ప్రచారం చేస్తున్నారు. అప్పులు మరీ ఎక్కువ అయితే ఇబ్బందే కావచ్చు. కానీ కరోనా సమయంలో అప్పులు చేసి పేదలను ఆదుకోకుండా ఉన్నట్లయితే వీరే ఎంత గగ్గోలు పెట్టేవారు! చంద్రబాబు హయాంలో చివరి మూడు నెలల్లో పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ తదితర స్కీముల పేర్లతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మహిళలంతా టీడీపీకి ఓటు వేస్తున్నారని ప్రచారం చేసిన ఈ మీడియా, ప్రతిపక్షం ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న స్కీములను చూసి ఓర్వలేకపోతున్నాయి. గతంలో చంద్రబాబు గానీ, మరే ముఖ్యమంత్రి గానీ తమ పార్టీ మానిఫెస్టోని సెక్రటేరియట్లో, మంత్రుల చాంబర్లలో ఉంచి ఇవి అమలు కావాలని చెప్పారా? కానీ జగన్ అలా చేయగలిగారు. అందులో తొంభై శాతం హామీలను నెరవేర్చామని జగన్ చెబు తున్నారు. అలా చేయలేదని పథకం వారీగా విశ్లేషించే ధైర్యం వీరికి ఉందా? ఉదాహరణకు అమ్మ ఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ మానిఫెస్టోలో ఉంది. దానిని అమలు చేశారా, లేదా? దాని గురించి ఒక్కమాటా చెప్పరు. చేయూత కింద బలహీనవర్గాల మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకోసం 18,500 చొప్పున ఇస్తున్నారా, లేదా? రైతు భరోసా కింద రైతులకు పదమూడువేల రూపాయల చొప్పున ఇచ్చారా, లేదా? రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటివి అందుబాటులో ఉంచగలుగుతున్నారా, లేదా? గ్రామ సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించడం ద్వారా పరిపాలనను గ్రామాలకు తీసుకు వెళ్లారా, లేదా? వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చుతున్నారా, లేదా? గ్రామాలలో, పట్టణాలలో స్కూళ్లను పూర్తిగా మార్పు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా తయారు చేస్తున్నారా, లేదా? వైద్య రంగంలో కూడా నాడు–నేడు అమలు చేస్తున్నారా, లేదా? ప్రజల ఇళ్లవద్దకే రేషన్ అందిస్తున్నారా, లేదా? గతంలో పింఛన్ల కోసం వృద్ధులు రోజుల తరబడి ప్రభుత్వ ఆఫీసుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు వారి ఇళ్ల వద్దకే తీసుకు వెళ్లి ఇస్తూ పెద్ద మార్పు తెచ్చారన్నది నిజమా, కాదా? ఈ రెండున్నర సంవత్సరాలలో జగన్ అమలు చేసినన్ని స్కీములను మరే ప్రభుత్వం అమలు చేయలేదని డంకా భజాయించి చెప్పవచ్చు. జగన్ అమలు చేసే స్కీములలో కొన్ని నచ్చవచ్చు, నచ్చక పోవచ్చు. కానీ ఆయన చెప్పింది చేస్తున్నారా, లేదా అన్నది విశ్లేషిం చుకోవాలి. ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది కనిపిస్తోందా, లేదా? ఇవన్ని చెబితే అంతా సంక్షేమమే, అభివృద్ధి ఏదని మరో విమర్శ చేస్తారు. ఇవన్నీ అభివృద్ధి కిందకు రాకుండా ఏమవుతాయి? 1994లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తిరిగి ప్రవేశపెట్టారు. అప్పుడు కాంగ్రెస్, మరికొన్ని పక్షాలు విమర్శించేవి. ఆనాడు ఇదే చంద్రబాబు, అప్పట్లో పౌరసరఫ రాల శాఖ మంత్రిగా ఉన్న బుచ్చయ్య చౌదరి తదితరులు ఇదంతా మానవాభివృద్ధి కిందే, క్యాపిటల్ వ్యయం కిందే తీసుకోవాలని వాదించేవారు. కానీ ప్రస్తుతం తెలుగు దేశం, ఆ పార్టీకి వంత పాడే మీడియా అంతా ఇదంతా అభివృద్ధి కానట్లు మాట్లాడుతోంది. జగన్ ముఖం చూసి ఎవరు అప్పులు ఇస్తారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అంటే, చంద్రబాబు కాబట్టి అమరావతి బాండ్ల పేరుతో రెండువేల కోట్లు తెచ్చారని టీడీపీ మీడియా ఆ రోజులలో ప్రచారం చేసింది. మరి ఇప్పుడు జగన్ ఇన్ని సంక్షేమ కార్య క్రమాలకు ఎలా డబ్బు తేగలిగారు! వీటిలో అవినీతి లేకుండా నేరుగా ఎలా లబ్ధిదారులకు బదిలీ చేస్తున్నారు! గతంలో మాదిరి జన్మభూమి కమిటీలు ఉన్నాయా? పార్టీ, కులం, మతం వంటివి చూస్తు న్నారా? చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా స్కూలును తీర్చి దిద్దింది జగన్ ప్రభుత్వం కాదా? ఈ ఒక్కటి చాలు... జగన్ ప్రభు త్వానికీ, చంద్రబాబు ప్రభుత్వానికీ ఉన్న తేడా చెప్పడానికి. రోడ్లకు సంబంధించి కొంత ఇబ్బంది ఎదురైన మాట నిజమే. ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త పరిశ్రమలు రావడం కరోనా సమయంలో దేశం అంతటా ఉన్నదే. దాని ప్రభావం ఏపీపై కూడా ఉంది. మరోవైపు ప్రత్యేక హోదాపై కేంద్రం మొండికేసింది. అయినా కొప్పర్తి పారిశ్రామికవాడ, శ్రీసిటీ వంటి చోట్ల కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖలో అదానీ డేటాసెంటర్, ఇతర ఐటీ పరిశ్రమలు పుంజుకుంటే కొంత మెరుగైన పరిస్థితి ఉండవచ్చు. అదానీ గతంలో చంద్రబాబును కలిస్తే అదంతా అభివృద్ధి కోసమనీ, ఇప్పుడు అదే అదాని జగన్‌ను కలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌ను రాసిచ్చేస్తున్నారని ప్రచారం చేసే దుర్మార్గపు మీడియాను ఎదుర్కుని నిలబడటమే జగన్ అసలు విజయం. అమరావతి పేరుతో లక్షల కోట్లు ఒకేచోట వ్యయం చేయాలన్న తమ డిమాండ్ నెరవేర లేదన్న దుగ్ధ కూడా టీడీపీకీ, ఆ వర్గం మీడియాకూ ఉంది. విశాఖ పట్నం కార్యనిర్వాహక రాజధాని అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం పొందవచ్చన్నది జగన్ ఆలోచన. వీటన్నిటికి న్యాయ వ్యవస్థ ద్వారా అడ్డుపడేది వీరే. మళ్లీ వ్యతిరేక ప్రచారం చేసేది వీరే. ఎంతగా జగన్‌ను దెబ్బతీయాలని అనుకున్నా, స్థానిక ఎన్నికలలో వందకు తొంభై శాతం వైసీపీ పరం అయ్యాయి. అందులో కుప్పం కూడా ఉండటం వీరికి జీర్ణం కావడం లేదు. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని ఆదేశించి అధికారులను విస్తుపరచిన చంద్రబాబును గొప్ప వ్యక్తిగా టీడీపీ మీడియా ప్రచారం చేసు కోవచ్చు. కానీ అది రాజుగారి దేవతా వస్త్రం అని ప్రజలు గమనిం చారు కనుకే టీడీపీని మట్టికరిపించి వైసీపీకి పట్టం కట్టారు. అయితే ఏ ప్రభుత్వానికి అయినా సమస్యలు ఉంటాయి. వాటిని సరిచేసు కుంటూ ముందుకు పోవడమే నాయకుడి విధి. రానున్న రెండున్నర ఏళ్లలో జగన్ ఎలా ఆర్థిక సమస్యలను ఎదుర్కుని తన కార్యక్రమాలను అమలు చేయగలుగాతరన్న ప్రశ్న చాలా మందిలో లేకపోలేదు. దీనికి కాలమే జవాబు ఇస్తుంది. ఇప్పటికైతే సఫలం అయిన ముఖ్యమంత్రి గానే వైఎస్ జగన్ నిలుస్తారు. - కొమ్మనేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
'వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే ధ్యేయం'
-
'వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే ధ్యేయం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తమ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం విశాఖపట్నంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పీ ఎల్ ఎన్ పట్నాయిక్ తన అనుచరులతో కలసి కొణతాల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయిన వైఎస్ఆర్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎవరు ఎన్ని దుష్పచారాలు చేసినా... ప్రజల ఆశీస్సులతో రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.