'జానా, ఉత్తమ్లు మంత్రి పదవుల పరువు తీశారు'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొణతాల మాట్లాడుతూ... భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలల్లోని పలు ప్రాంతాల్లో నిన్న పర్యటిస్తున్న తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిలు వారి వారి మంత్రి పదవులు పరువు తీసేలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకున్న అంశాన్ని మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వేళ్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం గతంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను అఖిలపక్ష సమావేశం కంటే ముందుగా బయటపెట్టాలని కొణతాల కేంద్రప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.