statewide tour
-
త్వరలో తెలంగాణ రాష్ట్రవ్యాప్త పర్యటనలు
సాక్షి, హైదరాబాద్: బీసీల రాజ్యాధికార సాధన కోసం రాష్ట్రవ్యాప్త పర్యటనలు నిర్వహిస్తామని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ ప్రకటించారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఇటీవల ఓరుగల్లులో నిర్వహించిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైన సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కన్వీనర్ దాసు సురేశ్ నేతృత్వంలో శుక్రవారం కోర్ కమిటీ సమావేశమైంది. క్షేత్రస్థాయిలో బీసీ నేతలు వెలువరించిన అనేక అంశాలపై ముఖ్య నాయకులు దీర్ఘంగా చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికపై అవలంబించాల్సిన వ్యూహరచనపై చర్చించారు. వరంగల్ జిల్లా పర్యటనకు కొనసాగింపుగా ఈ నెల 29న నిజామాబాద్‌లో ‘మన ఓటు – మన సీటు’ నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని, సెప్టెంబర్ 3న ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్త రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు దాసు సురేశ్ వెల్లడించారు. -
ఫిబ్రవరి 21న ముహూర్తం
సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న కొత్త పార్టీని ప్రకటించనున్నారు. తన సొంతూరైన రామనాథపురంలో పార్టీని ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటనలో కమల్ తెలిపారు. ‘నటుడిగా నా అభివృద్ధికి కారకులైన తమిళ ప్రజానీకానికి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు మాత్రమే కాదు, ప్రజలకు అంతకంటే ఎంతో చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం నేరుగా ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని నేను పుట్టిన ఊరైన రామనాథపురం నుంచి వచ్చేనెల 21న ప్రారంభించబోతున్నాను. అదే రోజున పార్టీ పేరును, దాని లక్ష్యాలను ప్రకటించి, నా రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభిస్తాను. రామనాథపురం, మధురై, దిండుగల్లు, శివగంగై జిల్లాల ప్రజలను కలుసుకుంటాను. ఇది నా దేశం, దీనిని కాపాడుకోవాలి అనే భావన నాకు మాత్రం ఉంటే సరిపోదు, మనమంతా కలిసి ఈ రాజకీయ రథాన్ని లాగడమే ప్రజాస్వామ్యం’అని కమల్ పేర్కొన్నారు. కాలమే నిర్ణయిస్తుంది:రజనీ కమల్ పార్టీని ప్రకటించడంపై నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ 1973లో హీరోగా నటించి నిర్మించిన ‘ఉలగం చుట్రు వాలిబన్’ సినిమా సీక్వెల్ యానిమేషన్ చిత్రం ప్రారంభ వేడుక బుధవారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో కమల్, రజనీ పాల్గొని ఒకే వేదికను పంచుకున్నారు. -
'జానా, ఉత్తమ్‌లు మంత్రి పదవుల పరువు తీశారు'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొణతాల మాట్లాడుతూ... భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలల్లోని పలు ప్రాంతాల్లో నిన్న పర్యటిస్తున్న తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు వారి వారి మంత్రి పదవులు పరువు తీసేలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. విజయమ్మను తెలంగాణవాదులు అడ్డుకున్న అంశాన్ని మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వేళ్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం గతంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను అఖిలపక్ష సమావేశం కంటే ముందుగా బయటపెట్టాలని కొణతాల కేంద్రప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.