
సాక్షి, హైదరాబాద్: బీసీల రాజ్యాధికార సాధన కోసం రాష్ట్రవ్యాప్త పర్యటనలు నిర్వహిస్తామని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ ప్రకటించారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఇటీవల ఓరుగల్లులో నిర్వహించిన బీసీల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైన సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కన్వీనర్ దాసు సురేశ్ నేతృత్వంలో శుక్రవారం కోర్ కమిటీ సమావేశమైంది.
క్షేత్రస్థాయిలో బీసీ నేతలు వెలువరించిన అనేక అంశాలపై ముఖ్య నాయకులు దీర్ఘంగా చర్చించారు. మునుగోడు ఉప ఎన్నికపై అవలంబించాల్సిన వ్యూహరచనపై చర్చించారు. వరంగల్ జిల్లా పర్యటనకు కొనసాగింపుగా ఈ నెల 29న నిజామాబాద్‌లో ‘మన ఓటు – మన సీటు’ నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని, సెప్టెంబర్ 3న ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్త రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు దాసు సురేశ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment