సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: జాతీయ బీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దాసు సురేశ్ నియమితులయ్యారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై.. సురేశ్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధికారికంగా ప్రకటించి నియామకపత్రాన్ని అందజేశారు.
అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల్లో బీసీలను బలోపేతం చేయడానికి సురేశ్‌ను నియమించామన్నారు. సురేశ్ మాట్లాడుతూ.. అన్ని బీసీ వర్గాలను బలోపేతం చేసి రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ బీసీ సేనా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి కృష్ణయ్య హాజరయ్యారు. బీసీబంధు పథకం వెంటనే ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment