ఒకే మాట.. ఒకటే బాట
Published Sun, Sep 8 2013 6:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
కాంగ్రెస్ పార్టీ రేపిన రాష్ట్ర విభజన జ్వాల 40 రోజులు కావస్తున్నా ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ‘పశ్చిమ’ ప్రజలు హస్తిన పెద్దలపై కళ్లెర్రజేస్తున్నారు. ఎన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లినా జిల్లాలో ఉద్యమ వేడి ఏ మాత్రం తగ్గలేదు. అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మార్మోగించారు.
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో ఎవరిని కదిపినా ‘సమైక్యాంధ్ర’ అంటున్నారు. ఉద్యమ పథమే తమ బాట అని ఘంటాపథంగా చెబుతున్నారు. లక్ష్యాన్ని సాధిం చేందుకు కడవరకూ పోరాడతామని విస్పష్టంగా చెబుతున్నారు. 39వ రోజైన శనివారం కూడా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సాగారుు. వేలాది ఉద్యోగులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు తరలివెళ్లినా ఆందోళన కార్యక్రమాల్లో ఆ లోటు ఎక్కడా కని పించలేదు. ఏపీ ఎన్జీవోల ఉద్యమానికి మద్దతుగా తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు
పట్టణాలతోపాటు దేవరపల్లి, సిద్ధాం తం, గుమ్ములూరు గ్రామాల్లో శనివా రం చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. ఏలూరు శ్రీశ్రీ విద్యార్థులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించి ‘జై సమైకాంధ్ర’ అక్షర రూపంలో కూర్చున్నారు.
తూర్పుకాపు విద్యా, విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంట ర్‌లో మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో స్వర్ణకారులు, బం గారు వ్యాపారులు త్రివర్ణ బెలూన్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ముస్లింలు రిలే దీక్షలో పాల్గొన్నారు. అక్కడే నమాజు చేశారు. తణుకు మండలం దువ్వలో రైతులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అత్తిలిలో ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఇరగవరం, తూర్పువిప్పర్రులో నిరాహార దీక్షలు కొనసాగాయి. భీమవ రం కాకతీయ స్కూల్ విద్యార్థులు ప్రకా శం చౌక్‌లో మానవహారం నిర్మించారు. జీవీఐటీ ఇంజినీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రిక్షాలు తొక్కి నిరసన వ్యక్తం చేశారు.
ఆదిత్య స్కూల్ ఉపాధ్యాయులు ఏసుక్రీస్తు, అల్లా, బ్రహ్మ, వివేకానంద, పుట్టపర్తి సాయిబాబా వేషధారణలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వీరవాసరంలో ఉపాధ్యాయులు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు మానవహారం నిర్మించారు. పాలకొల్లులో న్యాయవాదులు మౌన ప్రదర్శన చేశారు. బ్రాహ్మణగూడెం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జంగారె డ్డిగూడెంలో రైతులు రాస్తారోకో చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సుకు తెలంగాణ వాదులు ఆటంకం కల్గిస్తే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని నరసాపురంలో ఆరుగురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మునిసిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కడంతో ఉత్కంఠ ఏర్పడింది.
మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నాలుగు గంటల అనంతరం వారు దిగివచ్చారు. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామస్తులు ఉదయం 6నుంచి సాయంత్రం వరకు రాస్తారోకో చేశారు. బుట్టాయగూడెంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఒంటికాలితో జపం చేశారు. పెనుగొండలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. మార్టేరు వరి పరిశోధనా సంస్థకు చెం దిన 25 మంది శాస్త్రవేత్తలు సామూహిక సెలవు పెట్టి నిరసన తెలిపారు. కొవ్వూరు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో స్వర్ణాంధ్ర కళాశాల విద్యార్థులు కూర్చున్నారు. ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, రోడ్డుపై ఆటలు ఆడారు.
వైఎస్ కుటుంబం స్ఫూర్తితో...
నరసాపురం బస్టాండ్ సెంటర్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ దీక్షల స్ఫూర్తితో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు 17వ రోజుకు చేరారుు. వీరవాసరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దెందులూరు మండలం గాలాయగూడెంలో వైఎస్సార్ సీపీ నాయకుడు ముసునూరి సీతారామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగించారు. తాడేపల్లిగూడెం పోలీ స్ ఐలండ్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన పార్టీ కార్యకర్తలు శనివారం రిలే దీక్షలో పాల్గొన్నారు.
Advertisement