No change
-
మంత్రి పరిశీలించినా మారలేదు
ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ పట్టణం, మండలంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రెండు బాలికల, మరో రెండు బాలుర వసతి గృహలున్నాయి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు. దళిత సంక్షేమ శాఖ పరిధిలో ఏ, బీ, సీ వసతి గృహలున్నాయి. అలాగే మరొకటి సమీకృత బాలికల వసతి గృహం ఉంది. అయితే ప్రధానంగా దళిత ఏ, బీ వసతి గృహం ఆవరణలో ఉన్న మురికి కాలువ ఇబ్బందికరంగా మారింది. దీంతో మురికి నీరంతా ఆవరణలోనే నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. గతేడాది డిసెంబర్ 17న స్వయంగా మంత్రి జోగు రామన్న పరిశీలించారు. వెంటనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించినా, ఎలాంటి పనులు మాత్రం జరగడం లేదు. బేల మండలం చాంద్పల్లి బాలికల వసతి గృహంలో పది రోజుల కిందట కొంత మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. జైనథ్ మండలంలో రాత్రి పూట విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం వస్తే జిల్లా కేంద్రానికి తీసుకురావాల్సిందే. -
తీరుమారని సీబీఐ
మందలింపులతోనే అందరూ మారతారనుకుంటే పొరపాటు. కొందరు అలాంటి మందలింపులకు క్రమేణా అలవాటు పడి బండబారతారు. ఆ తర్వాత తీరు మార్చు కోవడం వారివల్ల కాదు. సీబీఐ ఇప్పుడు అలాంటి అవస్థలోనే ఉంది. ఈమధ్య రెండు కేసుల విషయంలో సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టు సీబీఐని నిశితంగా విమర్శించిన తీరుతో ఆ సంస్థ వ్యవహార శైలి మళ్లీ చర్చకొచ్చింది. తన నివాసంలో అక్రమంగా టెలిఫోన్ ఎక్ఛేంజ్‌ను నెలకొల్పి ఖజానాకు నష్టం చేకూర్చిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు దయానిధి మారన్ అరెస్టు ప్రయత్నం... విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టాన్ని(ఎఫ్సీఆర్ఏ) ఉల్లంఘించిన కేసులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లను అదుపులోకి తీసుకునే యత్నానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ అత్యుత్సాహాన్ని న్యాయమూర్తులు తప్పు బట్టారు. ఆ సంస్థ స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం చేతులు మారింది. యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీయే సర్కారు వచ్చింది. కానీ సీబీఐ తీరు మాత్రం ఎప్పటిలానే ఉంది. బొగ్గు కుంభకోణం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు ఇప్పటికీ అది ‘పంజరంలో చిలుక’లాగే ప్రవర్తిస్తోంది. సంస్థ నిర్వాహకులు సున్నిత మనస్కులైతే, అంకితభావంతో పనిచేసేవారైతే, ప్రజలపట్ల తమకు జవాబుదారీతనం ఉంటుందని విశ్వసించేవారైతే సుప్రీంకోర్టు వ్యాఖ్య తర్వాతనైనా మారాలి. మరోసారి ఆ మాట అనిపించుకోకూడదన్న పట్టుదల ఉండాలి. ‘పంజరంలో చిలుక’ వ్యాఖ్యకు అప్పుడే రెండేళ్లొచ్చాయి. కానీ సీబీఐ ఇంకా అలాగే ఉన్నదని న్యాయస్థానాలు అభిప్రాయపడక తప్పలేదు. సీబీఐ ఉన్నత శ్రేణి దర్యాప్తు సంస్థ. దేశంలో ఏమూల ఏం జరిగినా, ఎవరిపై ఆరోపణలు వచ్చినా ఎవరైనా కోరేది సీబీఐ దర్యాప్తు జరిపించాలనే. ఆ సంస్థ కేసుల దర్యాప్తులో చూపిస్తున్న సామర్థ్యంవల్లే అందరూ అలా కోరుతున్నారని అనుకోనవసరం లేదు. వారికంతకన్నా గత్యంతరం లేదు. దేశంలో దాన్ని మించిన దర్యాప్తు సంస్థ లేదు మరి! ఏ కారణం చేత అయితేనేమి జనం కోరుతున్నారు గనుక కాస్తయినా మారాలని, సరిగా ప్రవర్తించాలని దాని నిర్వాహకులు ఎప్పుడైనా అను కున్న దాఖలాలు కనబడవు. కేంద్రంలో యూపీఏ సర్కారు ఉండగా వరసబెట్టి అనేక కుంభకోణాలు వెలుగులోకొచ్చాయి. కామన్వెల్త్ క్రీడల కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ ఎన్నో స్కాంలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. వీటిలో కొన్నిటి పర్యవేక్షణను స్వయంగా సుప్రీంకోర్టే స్వీకరించింది. అయినా సరే సీబీఐకి నదురూ బెదురూ లేదు. ‘పంజరంలో చిలుక’ గా అభివర్ణించినప్పుడు ఆనాటి డెరైక్టర్ రంజిత్‌సిన్హా ఎంతో నొచ్చుకున్నారు. ‘ఏ శుభ కార్యానికెళ్లినా న న్ను చూసి చిలకొచ్చిందని వెటకారం చేస్తున్నార ’ని వాపోయారు. కానీ అనంతర కాలంలో ఆయన ఆ పాత్ర పోషణలోనే తరించారు. ఇది శ్రుతి మించి వివిధ కుంభ కోణాల్లోని నిందితులు ఆయన్ను ఇంటికొచ్చి కలిసే స్థితి ఏర్పడే సరికి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఇకనుంచి జోక్యం చేసుకోరాదని హుకుం జారీచేసింది. ఆయనపై దర్యాప్తునకు ఆదేశించింది. అదింకా కొనసాగుతోంది. ఇంత జరిగినా దయానిధి మారన్, తీస్తా సెతల్వాడ్ కేసుల్లో సీబీఐని న్యాయస్థానాలు మళ్లీ తప్పుబట్టాల్సివచ్చింది. చెన్నైలోని తన ఇంట్లో బీఎస్ఎన్ఎల్ సహకారంతో మారన్ చట్టవిరుద్ధంగా 360 లైన్ల టెలిఫోన్ ఎక్ఛేంజ్‌ను ఏర్పాటు చేయించుకున్నారని, ఆయన కుటుంబానికి చెందిన సన్ టీవీ ఆ లైన్లను వాణిజ్యపరంగా వినియోగించుకున్నదనీ...ఇందువల్ల ఖజానాకు రూ. 1.20 కోట్లు నష్టం వచ్చిందని సీబీఐ ఆరోపిస్తున్నది. ఇందుకు సంబంధించి 2013లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఈలోగా మారన్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో ఆయనకు సహకరించిన అధికారులెవరినీ అరెస్టు చేయని సీబీఐ మారన్‌పైనే ఎందుకు శ్రద్ధ చూపుతున్నదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అందుకు రాజకీయ కారణాలు లేవా అని నిలదీసింది. మీరే దర్యాప్తు చేస్తున్న యూపీ జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం(ఎన్ఆర్హెచ్ఎం) కుంభకోణంలో రూ. 8,000 కోట్ల నష్టం వాటిల్లినా ఇంతవరకూ ఒక్క నిందితుణ్ణయినా ఎందుకు అరెస్టు చేయలేదని అడిగింది. రూ. 1.20 కోట్ల స్కాంలో అరెస్టు కోసం తహతహలాడుతున్నవారు అంత పెద్ద కుంభ కోణంపై మౌనంగా ఉండిపోయారేమని ప్రశ్నించింది. తీస్తా సెతల్వాడ్ కేసులోనూ బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వానికి నచ్చని అభిప్రాయం కలిగి ఉన్నంతమాత్రాన అలాంటివారిని జాతీయ భద్రతకూ, ప్రజా ప్రయోజనాలకూ ప్రమాదకారులుగా చిత్రించడం తగదని చెప్పింది. తీస్తా దంపతులను అరెస్టు చేసి ప్రశ్నించాలన్న సీబీఐ వాదనను తోసిపుచ్చింది. ఆమె ఆధ్వర్యంలోని సంస్థలు సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్, సబ్రంగ్ ట్రస్టులు పొందిన విరాళాలను నిబంధనలకు విరుద్ధంగా సబ్రంగ్ కమ్యూనికేషన్స్, పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. ప్రచురణ రంగంలోని సంస్థలు విదేశీ విరాళాలు స్వీకరించకూడదన్న నిబంధనను తీస్తా దంపతులు ఉల్లంఘించారని సీబీఐ చేస్తున్న ఆరోపణను న్యాయమూర్తి తోసిపుచ్చలేదు. అందుకు సంబంధించి వారిస్తున్న సంజాయిషీ ఏమిటో వారు దాఖలు చేసిన పత్రాల ఆధారంగానే తెలుసుకో వచ్చునని, చట్టపరంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. 2002నాటి గుజరాత్ నరమేథానికి సంబంధించి కొన్ని కేసులు కీలక దశకు చేరుకున్న తరుణంలో తాము వెలుపల ఉండరాదని కేంద్రం భావిస్తున్నదని...అందుకు అనుగుణంగా సీబీఐ పనిచేస్తున్నదని తీస్తా దంపతులు చేసిన ఆరోపణను న్యాయ స్థానం పరిగణనలోకి తీసుకుంది. అధికారంలో ఉన్నవారి ఆదేశాలను పాటించడం తప్ప సొంతంగా ఆలోచించే అలవాటు లేనందువల్లే ఈ రెండు కేసుల్లోనూ సీబీఐ ఇరకాటంలో పడాల్సివచ్చింది. ఇలా కొన్ని కేసుల్లో అనవసర శ్రద్ధ చూపుతూ అతిగా వ్యవహరిస్తున్న సీబీఐ... వ్యాపం కుంభకోణంలో మాత్రం దర్యాప్తు తనవల్ల కాదని చేతులెత్తేసింది. తనవద్ద సిబ్బంది లేరని, అంత పెద్ద స్కాం దర్యాప్తు సాధ్యపడదని చెప్పింది. ఇప్పటికైనా సీబీఐ తన వ్యవహార శైలిని సమీక్షించుకోవాలి. ఈ దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలో, నిరర్ధక సంస్థగా మిగిలి పోవాలో తేల్చుకోవాలి. -
పోలీస్.. ఫూలిష్‌గా...
కాకినాడ క్రైం : ‘‘పోలీసులు నియంతలా వ్యవహరించకూడదు.. పోలీసు ఇమేజ్ పెంచాలి’’ అంటూ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మూడు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాల్గొని పోలీసు సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు చెడ్డపనులు చేస్తే సహించనంటూ హెచ్చరించారు కూడా... అయినా పోలీసు సిబ్బంది తీరులో ‘నో ఛేంజ్’!సర్పవరం పోలీసులు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా, ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఇంకా మరువకముందే... బుధవారం సాయంత్రం ఓ కానిస్టేబుల్ ఏకంగా 14 ఏళ్ల బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉన్నతాధికారి ఆదేశాలను సైతం పక్కన పెట్టి సిబ్బంది ఇలా ప్రవర్తించడంపై ప్రజలు మండిపడుతున్నారు. తీవ్రగాయాల పాలైన బాలుడు కాకినాడ జగన్నాథపురం గోళీలపేటకు చెందిన 12 ఏళ్ల బసల మోహన్ ప్రసాద్, అతడి అక్క పరిమళ సెయింట్ జేవియర్స స్కూల్లో చదువుతున్నారు. బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి వారిద్దరూ, స్నేహితుడితో కలసి కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు. అదే దారిలో టూటౌన్ కానిస్టేబుల్ విక్టర్ ఇల్లు ఉంది. అతడి ఇంటి ముందు ఆగి పెద్దగా మాట్లాడుతుండగా విక్టర్ బయటకు వచ్చి గదిమాడు. దీంతో చిన్నారులు ‘‘రోడ్డు మీదేగా మాట్లాడుకుంటున్నాం’’ అన్నారు. వారి సమాధానాన్ని భరించలేని కానిస్టేబుల్ విక్టర్ వారిపై విరుచుకుపడ్డాడు. మోహన్ప్రసాద్ను కిందపడేసి గుండెలపై తన్నాడు. అడ్డువెళ్లిన పరిమళను దుర్భాషలాడుతూ గెంటివేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని అతడి తల్లి పద్మ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు సూచనమేరకు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. వైద్యులు మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘గ్రీన్‌ఫీల్డ్ ఘటన మరువకుండానే... ఇటీవల గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో ముగ్గురు అంధ విద్యార్థులపై ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ పాశవికంగా దాడి చేసి గాయపరిచిన ఘటన మరువకుండానే మరో బాలుడిపై కానిస్టేబుల్ దాడి చేయడం కాకినాడలో చర్చనీయాంశమైంది. సామాన్యులపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
బండి నంబర్ మారదండి
తణుకు అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త వాహనాలకు కొత్త నంబర్ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ ఉంటుందనే ఊహాగానాలకు తెరపడింది. సీమాంధ్ర జిల్లాల్లోని వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన విధానాన్నే అనుసరించాలంటూ రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. మన జిల్లాకు సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన విధంగా ‘ఏపీ 37’ సిరీస్‌తోనే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతుందని రవాణా శాఖ అధికారులతోపాటు సాధారణ ప్రజలూ భావించారు. ఈ కారణంగా సుమారు 10 రోజుల నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయూయి. కొత్త సిరీస్ వచ్చిన అనంతరం ఆ నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో వాహనాలు కొన్నవారు ఇప్పటివరకూ వేచిచూశారు. అయితే, తెలంగాణ జిల్లాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతుందని, సీమాంధ్ర జిల్లాల్లో పాత సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్లు చేయూలని ఆదేశాలు వెలువడటంతో కొత్త వాహనాలు కొన్నవారి ఆశలు నీరుగారాయి. తాజా ఆదేశాల నేపథ్యంలో కొన్ని రోజులుగా ఖాళీగా దర్శనమిచ్చిన రవాణా శాఖ కార్యాలయూల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు తిరిగి మొదలయ్యూయి. తణుకు రవాణా శాఖ కార్యాలయంలో మార్చిలో మొదలైన ‘ఏపీ 37 సీసీ’ సిరీస్‌తోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. మంగళవారం నాటికి ఆ సిరీస్‌లో 1899 నంబర్ వరకు వచ్చింది. ఏపీ 37 సీసీ 1899 నంబర్ కోసం ఓ యువకుడు రూ.10 వేలు చెల్లించి వేలంలో ఆ నంబర్ దక్కించుకునేందుకు సిద్ధమయ్యూడు. -
ఒకే మాట.. ఒకటే బాట
కాంగ్రెస్ పార్టీ రేపిన రాష్ట్ర విభజన జ్వాల 40 రోజులు కావస్తున్నా ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ‘పశ్చిమ’ ప్రజలు హస్తిన పెద్దలపై కళ్లెర్రజేస్తున్నారు. ఎన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లినా జిల్లాలో ఉద్యమ వేడి ఏ మాత్రం తగ్గలేదు. అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని మార్మోగించారు. ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో ఎవరిని కదిపినా ‘సమైక్యాంధ్ర’ అంటున్నారు. ఉద్యమ పథమే తమ బాట అని ఘంటాపథంగా చెబుతున్నారు. లక్ష్యాన్ని సాధిం చేందుకు కడవరకూ పోరాడతామని విస్పష్టంగా చెబుతున్నారు. 39వ రోజైన శనివారం కూడా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాలు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సాగారుు. వేలాది ఉద్యోగులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సుకు తరలివెళ్లినా ఆందోళన కార్యక్రమాల్లో ఆ లోటు ఎక్కడా కని పించలేదు. ఏపీ ఎన్జీవోల ఉద్యమానికి మద్దతుగా తాడేపల్లిగూడెం, భీమవరం, నిడదవోలు పట్టణాలతోపాటు దేవరపల్లి, సిద్ధాం తం, గుమ్ములూరు గ్రామాల్లో శనివా రం చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. ఏలూరు శ్రీశ్రీ విద్యార్థులు ర్యాలీగా ఫైర్‌స్టేషన్ సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించి ‘జై సమైకాంధ్ర’ అక్షర రూపంలో కూర్చున్నారు. తూర్పుకాపు విద్యా, విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంట ర్లో మానవహారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో స్వర్ణకారులు, బం గారు వ్యాపారులు త్రివర్ణ బెలూన్లు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఐలండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ముస్లింలు రిలే దీక్షలో పాల్గొన్నారు. అక్కడే నమాజు చేశారు. తణుకు మండలం దువ్వలో రైతులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అత్తిలిలో ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఇరగవరం, తూర్పువిప్పర్రులో నిరాహార దీక్షలు కొనసాగాయి. భీమవ రం కాకతీయ స్కూల్ విద్యార్థులు ప్రకా శం చౌక్‌లో మానవహారం నిర్మించారు. జీవీఐటీ ఇంజినీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రిక్షాలు తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆదిత్య స్కూల్ ఉపాధ్యాయులు ఏసుక్రీస్తు, అల్లా, బ్రహ్మ, వివేకానంద, పుట్టపర్తి సాయిబాబా వేషధారణలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వీరవాసరంలో ఉపాధ్యాయులు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు మానవహారం నిర్మించారు. పాలకొల్లులో న్యాయవాదులు మౌన ప్రదర్శన చేశారు. బ్రాహ్మణగూడెం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జంగారె డ్డిగూడెంలో రైతులు రాస్తారోకో చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సుకు తెలంగాణ వాదులు ఆటంకం కల్గిస్తే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటామని నరసాపురంలో ఆరుగురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మునిసిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కడంతో ఉత్కంఠ ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో నాలుగు గంటల అనంతరం వారు దిగివచ్చారు. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామస్తులు ఉదయం 6నుంచి సాయంత్రం వరకు రాస్తారోకో చేశారు. బుట్టాయగూడెంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఒంటికాలితో జపం చేశారు. పెనుగొండలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేశారు. మార్టేరు వరి పరిశోధనా సంస్థకు చెం దిన 25 మంది శాస్త్రవేత్తలు సామూహిక సెలవు పెట్టి నిరసన తెలిపారు. కొవ్వూరు ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో స్వర్ణాంధ్ర కళాశాల విద్యార్థులు కూర్చున్నారు. ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, రోడ్డుపై ఆటలు ఆడారు. వైఎస్ కుటుంబం స్ఫూర్తితో... నరసాపురం బస్టాండ్ సెంటర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయమ్మ దీక్షల స్ఫూర్తితో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు 17వ రోజుకు చేరారుు. వీరవాసరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దెందులూరు మండలం గాలాయగూడెంలో వైఎస్సార్ సీపీ నాయకుడు ముసునూరి సీతారామయ్య ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగించారు. తాడేపల్లిగూడెం పోలీ స్ ఐలండ్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో పెంటపాడు మండలం రావిపాడుకు చెందిన పార్టీ కార్యకర్తలు శనివారం రిలే దీక్షలో పాల్గొన్నారు.