మంత్రి పరిశీలించినా మారలేదు
ఆదిలాబాద్ రూరల్ : ఆదిలాబాద్ పట్టణం, మండలంలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో రెండు బాలికల, మరో రెండు బాలుర వసతి గృహలున్నాయి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు. దళిత సంక్షేమ శాఖ పరిధిలో ఏ, బీ, సీ వసతి గృహలున్నాయి. అలాగే మరొకటి సమీకృత బాలికల వసతి గృహం ఉంది. అయితే ప్రధానంగా దళిత ఏ, బీ వసతి గృహం ఆవరణలో ఉన్న మురికి కాలువ ఇబ్బందికరంగా మారింది. దీంతో మురికి నీరంతా ఆవరణలోనే నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. గతేడాది డిసెంబర్ 17న స్వయంగా మంత్రి జోగు రామన్న పరిశీలించారు. వెంటనే నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించినా, ఎలాంటి పనులు మాత్రం జరగడం లేదు. బేల మండలం చాంద్‌పల్లి బాలికల వసతి గృహంలో పది రోజుల కిందట కొంత మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. జైనథ్ మండలంలో రాత్రి పూట విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం వస్తే జిల్లా కేంద్రానికి తీసుకురావాల్సిందే.