ఎంపీలపై దాడి అమానుషం
ఎంపీలపై దాడి అమానుషం
సమైక్యాంధ్రను కోరుతూ లోక్‌సభలో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎంపీలపై కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడి అమానుషమని స్థానిక జెడ్పీ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయుడు పెద్దింటి సారంగపాణి అన్నారు. ఎంపీలపై దాడిని నిరసిస్తూ గురువారం సాయంత్రం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ైెహ స్కూలు నుంచి కట్టెల అడితీల సెంటర్‌మీదుగా ఐలాండ్ సెంటర్ చేరుకుని విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా జరిగిన దాడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఐలాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడిన విద్యార్థులు సమైక్యాంధ్ర ఆకాంక్షను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అప్పిరెడ్డి, నాగేశ్వరరావు, మల్లారెడ్డి, అబ్దుల్ రజాక్, ఖాశింపీరా, సాంబశివరావు, శంకరనారాయణ, ప్రసాద నారాయణ పాల్గొన్నారు.
విద్యార్థి జేఏసీ ఖండన
లోక్‌సభలో గురువారం సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడిని విద్యార్థి జేఏసీ నాయకులు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా విభజన నిర్ణయం తీసుకోవడమే కాకుండా అడిగినవారిపై దాడులకు పాల్పడ డం దారుణమని జేఏసీ నాయకులు ఎండీ అలీం పేర్కొన్నారు. టీ బిల్లు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేవరకు ఆందోళనను ఆపేది లేదన్నారు. ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో జేఏసీ నాయకులు మణిదీప్, కిరణ్, ఫిరోజ్, కరీమ్, నాగుల్, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.