సాక్షి, ముంబై: వరుస నష్టాల నుంచి పుంజుకున్న దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. గురువారం నాటి పాజిటివ్ ధోరణిని శుక్రవారం 380 పాయింట్లకు పైగా ఎగిసింది. తద్వారా 37700 స్థాయిని అధిగమించింది. ప్రస్తుతం 306 పాయింట్లు జంప్‌చేసి 37,699 వద్ద నిఫ్టీ 85 పాయింట్లు ఎగసి 11,343 వద్ద ట్రేడవుతోంది.
ఫార్మా తప్ప అన్ని సెక్టార్లులాభాల నార్జిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, మీడియా, బ్యాంక్ నిఫ్టీ 2-1 శాతం మధ్య లాభపడగా.. ఫార్మా దాదాపు 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ 6-5 శాతం చొప్పున జంప్‌చేయగా.. హీరో మోటో, హెచ్‌యూఎల్, జీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3-1.6 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు సన్ ఫార్మా టాప్ లూజర్‌గా ఉంది. ఐవోసీ, హిందాల్కో, వేదాంతా, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్, సిప్లా తదితరాలు నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment