జోరు తగ్గని సమైక్యం | Intractable rapid-coordinated | Sakshi
Sakshi News home page

జోరు తగ్గని సమైక్యం

Published Thu, Aug 29 2013 5:43 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Intractable rapid-coordinated

సాక్షి, నెల్లూరు: నిరసన కార్యక్రమాలతో తాత్కాలికంగా ఎన్ని సమస్యలు వ చ్చినా వెనక్కితగ్గేది లేదని సింహపురి వాసులు స్పష్టం చేస్తున్నారు. భావితరా ల భవిష్యత్తే తమకు ప్రధానమని తేల్చిచెబుతున్నారు. 29 రోజులుగా ఉద్యమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతు న్నా, వెనకడుగు వేయక ముందుకు సా గుతున్నారు. సమైక్య పోరును మరింత ఉధృతం చేస్తున్నారు. వినూత్న నిరసనలతో సమైక్యవాణి వినిపిస్తున్నారు. అం దులో భాగంగా బుధవారం జిల్లా వ్యా ప్తంగా ర్యాలీలు, నిరశన దీక్షలు, మానవహారాలు, సోనియాగాంధీ దిష్టిబొమ్మ ల దహనం తదితర కార్యక్రమాలు కొనసాగాయి. నెల్లూరులో మహిళా ఉద్యోగులు, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు, విక్రమసింహపురి యూని వర్సిటీ అధ్యాపకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
 టీపీ గూడూరులో ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. పొదలకూరులో ప్రభుత్వ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు. వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట  ఉపాధ్యాయులు రిలే దీక్షలు చే పట్టారు. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి.. బస్టాండ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  ఉదయగి రి-సీతారామపురం రోడ్డుపై మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు అ ధ్యాపకులు రోడ్డుపైనే విద్యాబోధన చే సి నిరసన తెలిపారు. దుత్తలూరు, కలి గిరిలో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వింజమూరులో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది బస్టాండ్ సెంటరు వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ  రిలే దీక్షలు 22వ రోజుకు చేరా యి.
 
 సీతారాంపురం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. కోవూరు ఎన్జీఓ హోంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షకు దిగా రు. మైపాడు సమీపంలోని కృష్ణాపురం తీరంలో మత్స్యకారులు బోట్లతో స ముద్రంలో సమైక్య వాణి వినిపించారు. గూడూరు టవర్‌క్లాక్ కూడలిలో సమైక్యభేరి నిర్వహించారు. విద్యార్థులు రోడ్లపైనే ఆటలాడి నిరసన తెలిపారు. వాకాడు అశోక్‌పిల్లర్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేత నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో నేతలు దీక్షలు చేపట్టారు. కోట మండలం విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. వెంకటగిరి లో పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో పోలేరమ్మ ఆలయం వద్ద నుం చి కాశీపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
 
 రాజా విగ్రహానికి పాలాభి షేకం చేశారు. పట్టణ జేఏసీ ఆధ్వర్యం లో విద్యార్థులకు ఆర్టీసీ బస్టాండు ఎ దుట వివిధ ఆటల పోటీలు నిర్వహించి ఉట్టి కొట్టారు.
 కావలిలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు పట్టణ వీధుల్లో కదం తొక్కారు. విట్స్, వెక్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో వివిధ సం ఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ గ్యారేజ్ నుంచి డిపోలోకి బస్సులు రాకుండా ఉద్యోగులు, కార్మికులు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వస్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సును నిలిపివేశారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. దొరవారిసత్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, పెళ్లకూరు తదితర ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నాయుడుపేట బస్టాండ్ సెంటర్‌లో వంటావార్పు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement