నగర సీపీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు జట్లు లేబర్ యూనియన్, కూరగాయల మార్కెట్, పార్టీ శాఖల్లో పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య ఎగుర వేశారు. ప్రజా నాట్య మండలి
-
ఘనంగా మేడే
కోటగుమ్మం(రాజమహేంద్రవరం సిటీ) :
నగర సీపీఐ ఆధ్వర్యంలో మే డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు జట్లు లేబర్ యూనియన్, కూరగాయల మార్కెట్, పార్టీ శాఖల్లో పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రావుల వెంకయ్య ఎగుర వేశారు. ప్రజా నాట్య మండలి కళాకారులు నృత్య, విప్లవ గీతాలతో మంగళవార పేట నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ తాడితోట మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ రావుల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తిప్పికొట్టాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ మతోన్మాద విధానాలతో మోడీ ముందుకు వెళుతున్నారని, దేశాన్ని మత విభజనగా చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమితి సభ్యుడు మీసాల సత్యనారాయణ, నగర కార్యదర్శి నల్లా రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణ, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చిట్టూరి ప్రభాకరచౌదరి తదితరులు పాల్గొన్నారు.