ఎవరి ఖాతాలోకి..!
‘సుధీర్ఘ పోరాట ఫలితంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ’ సాధన ఎవరి ఖాతాలో వేసుకుంటే బాగుంటుంది. ఒకరికే ఎందుకు...అంతా మాదంటే మాది అని చెప్తే పోలా’.. క్రెడిట్‌ను కాస్తా తమకు అన్వయించుకుంటే ఓట్ల పంట పండక పోదా అని అంతా తెగ పోటీపడుతున్నారు. దీనికోసం హడావుడి చేస్తున్నారు.అందుకే అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని అంబరాన్నంటే సంబరంలా మార్చేసి ధూం..ధాం చేసి పడేస్తున్నారు.ఇలాంటి హడావుడే జిల్లాలో ఇప్పుడు కనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంకం తుది దశకు చేరుకోవడంతో రాజకీయ పక్షాలు, నేతలు క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు త హతహలాడుతున్నారు. ఇప్పటికే ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ’ శుభాకాంక్షల పేరిట నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో అన్ని కూడళ్లలో ఎన్నికల వాతావరణం తలపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు, అనుచరుల ఫోటోలతో ఫ్లెక్సీలను నింపేశారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే తమ మనోగతాన్ని నేతలు ఫ్లెక్సీల రూపంలో బయట పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇ న్నాళ్లూ దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేసిన నేతలు ఇప్పుడిప్పుడే జిల్లాకు చే రుకుంటున్నారు. నేతలు ఎవరికి వా రుగా విమానాశ్రయంలో, సొంత ని యోజకవర్గంలో అనుచరులు భారీ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసుకుం టున్నారు. ప్రత్యర్థి పార్టీలతో పాటు, సొంత పార్టీలోని ప్రత్యర్థులపై పైచేయి సాధించే దిశలో నేతల ఎత్తుగడలు సా గుతున్నాయి. ఇందులో భాగంగానే తె లంగాణ విజయోత్సవ ర్యాలీలు, స మావేశాలు ఏర్పాటు చేసేందుకు నేత లు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీల అగ్రనేతలను జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాల కు రప్పించడం ద్వారా బల ప్రదర్శన చే యాలనే యోచనలో ఔత్సాహిక నేతలున్నారు. ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించని పార్టీలు, నేతలు కూడా క్రెడిట్‌ను దక్కించుకునే దిశగా వాదన లు సిద్ధం చేసుకుంటున్నారు.
మొదలైన రాజకీయ సందడి
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కు అనుచరులు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూ రో సభ్యుడు ఇబ్రహీం శనివారం అనుచరులతో ర్యాలీ పేరిట హడావుడి సృ ష్టించారు. బీజేపీ ఎమ్మెల్యేలు నాగం జ నార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి షా ద్‌నగ ర్, మహబూబ్‌నగర్‌లో ర్యాలీలు నిర్వహించారు. జడ్చర్ల నుంచి కాంగ్రె స్ టికెట్ ఆశిస్తున్న మల్లు రవి, టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఇ దే రీతిలో ఏర్పాట్లు చేసుకున్నారు. మంత్రి డీకే అరుణ ఇప్పటికే సొంత ని యోజకవర్గం గద్వాలలో సంబురాల పేరిట సందడి చేస్తున్నారు. త్వరలో జి ల్లాలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని శనివారం హైదరాబాద్‌లో జరి గిన తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకుల సమావేశంలో నిర్ణయించారు.
ఈ నెల 25 లేదా 26 తేదీల్లో దిగ్విజయ్ సింగ్‌ను ఆహ్వానిస్తామని డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ ప్రకటించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా తనను గెలిపిం చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు త్వరలో కేసీఆర్ జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రాజ్‌నాథ్ సింగ్ లేదా సుష్మా స్వరాజ్ తో బహిరంగ సభ ఏర్పాటు చేయాల ని బీజేపీ జాతీయ నేతలకు జిల్లా నే తలు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇన్నాళ్లూ ఎదుటి పార్టీల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం లేదంటూ విమర్శించిన నేతలు, ఇప్పుడు తమ వల్లే ఏర్పడిందనే ప్రచారానికి పదును పెట్టేందుకు సన్నద్దమవుతున్నారు.