సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్యపోరు కొనసాగుతోంది. మూడో రోజు శనివారం ఎన్‌జీఓలు, సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. ఎన్‌జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి.
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎన్‌జీఓలు ఆదివారం నిర్వహించనున్న సమైక్యరన్ కోసం శనివారం సాయంత్రం ఎన్‌జీఓ భవన్ నుంచి ఏసీస్టేడియం వరకు సమైక్య ట్రైల్ రన్ నిర్వహించారు. ఆత్మకూరులో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాళెంలోని రెవెన్యూ కార్యాలయాలు పని చేయలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కావలి తాలూకా ఎన్‌జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు, విద్యార్థులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పొదలకూరు మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ముత్తుకూరులో రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఉద్యోగులు తాళాలు వేశారు. రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ ఏపీఎన్‌జీఓలు ఇచ్చిన పిలుపు మేరకు రెవెన్యూశాఖ పరిధిలోని అన్ని శాఖల వారు సమ్మెను కొనసాగిస్తున్నారు. అన్ని కార్యాలయాలను మూసివేసి పరిపాలనను స్తంభింపజేశారు.
సమైక్య హోరు
Published Sun, Feb 9 2014 3:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement