షీనా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో
న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థులు మార్చి 23న చేపట్టిన ర్యాలీలో ఢిల్లీ పోలీసులు విద్యార్థినులతో వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. 8 మంది విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడిన జేఎన్‌యూ ప్రొఫెసర్ అతుల్ జోహ్రికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు పార్లమెంటు వరకూ భారీ ర్యాలీ చేపట్టిన సంగతి తెల్సిందే.
ర్యాలీలో పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జేఎన్‌యూ సోషియాలజీ విభాగానికి చెందిన షీనా ఠాకూర్(24) అనే విద్యార్థిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ర్యాలీని అడ్డుకున్న ఓ మహిళా పోలీస్ అధికారిణి ఆందోళన చేస్తున్న తన దుస్తుల్ని చించేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించిందన్నారు. దీంతో వెంటనే కొందరు తనపై పిడిగుద్దులు కురిపించారని, లోదుస్తుల్ని లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తమపై వాటర్ కేనన్లను ప్రయోగించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment