సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్లో ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ర్యాలీలు, సంబరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ అమల్లో ఉంటాయన్నారు. ఇక 17వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ వైన్ షాపులు, క్లబ్బులు మూసివేత కొనసాగుతుందన్నారు.