ఓట్ల లెక్కింపు ప్రారంభం | Counting began | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు ప్రారంభం

Published Fri, May 16 2014 8:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

ఓట్ల లెక్కింపు ప్రారంభం - Sakshi

ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తరువాత 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. తొలి ఫలితం ఉదయం 10 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది.  దేశవ్యాప్తంగా 9 విడతలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.

మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 7న జరుగగా, చివరి విడత పోలింగ్ ఈ నెల 12న జరిగింది. తెలంగాణాలోని 119 శాసనసభ స్థానాలకు,17 లోక్సభ నియోజక వర్గాలకు  ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని 175  శాసనసభ, 25 లోక్సభ నియోజక వర్గాలకు మే 7న ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల అన్నింటి ఫలితాలు ఈరోజే వెల్లడవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement