
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం ఎల్బీ స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించినట్లు అనురాగ్ శర్మ తెలిపారు. సభలు, విజయోత్సవాలు నిషేధమని, కౌంటింగ్ కేంద్రాల నుండి ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.