హైదరాబాద్ : ఈనెల 19న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ విజ్ఞప్తి చేశారు. ఎల్బీస్టేడియంలో సభకు ఇప్పటికే శాప్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామని వారు ఈ సందర్భంగా కమిషనర్‌కు వివరించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శాంతియుత మార్గంలోనే సభ జరుగుతుందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామి ఇచ్చారని నేతలు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్సార్‌సీపీ భారీ సభను ఈనెల 19న నిర్వహించనున్న విషయం తెలిసిందే. సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని ఈనెల 4వ తేదీన డీజీపీ ప్రసాదరావుని వైఎస్‌ఆర్ సీపీ నేతలు కలిశారు.
'సమైక్య శంఖారావానికి అనుమతి ఇవ్వండి'
Published Mon, Oct 7 2013 2:38 PM | Last Updated on Wed, Aug 8 2018 5:45 PM
Advertisement
Advertisement