'రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి' | ysrcp leader gattu sreekanth reddy slams pm modi over currency demonetization | Sakshi
Sakshi News home page

'రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి'

Published Thu, Dec 1 2016 4:03 PM | Last Updated on Sat, Sep 22 2018 7:57 PM

'రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి' - Sakshi

'రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి'

పెద్ద నోట్ల రద్దుతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని గట్టు విమర్శించారు.

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం ఆర్థిక మంద్యం దిశగా పయనిస్తోందన్నారు.

నోట్ల మార్పిడి కోసం బ్యాంక్ క్యూ లైన్లలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. తక్షణమే కేంద్రం ఉపశమన చర్యలు తీసుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement