బాబు వైఫల్యాలు ఎండగట్టేందుకే.. | Gattu sreekanth reddy comments on cm chandrababu | Sakshi
Sakshi News home page

బాబు వైఫల్యాలు ఎండగట్టేందుకే..

Published Mon, Nov 6 2017 2:08 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Gattu sreekanth reddy comments on cm chandrababu - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డి

షాద్‌నగర్‌ రూరల్‌/జడ్చర్ల టౌన్‌/అడ్డాకుల: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆదివారం గట్టు శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయకు వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టేందుకే జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు. బాబుకు ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అడ్డాకులలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

వైఎస్సార్‌సీపీ నేతల పాదయాత్ర
హసన్‌పర్తి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఆదివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. హసన్‌పర్తి మండలంలోని ఎర్రగట్టు గుట్ట నుంచి వరంగల్‌లోని భద్రకాళి దేవస్థానం వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement