డిసెంబర్ 2న వైఎస్సార్సీపీ మహాధర్నా | ysrcp maha dharna in telangana over water for farms says by gattu sreekanth reddy | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 2న వైఎస్సార్సీపీ మహాధర్నా

Published Sat, Nov 26 2016 3:22 PM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

డిసెంబర్ 2న వైఎస్సార్సీపీ మహాధర్నా - Sakshi

డిసెంబర్ 2న వైఎస్సార్సీపీ మహాధర్నా

డిసెంబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నాలు నిర్వహించనున్నట్లు గట్టు శ్రీకాంత్రెడ్డి చెప్పారు.

సూర‍్యాపేట : రైతులకు రెండో పంట కోసం నీటిని విడుదల చేయాలంటూ డిసెంబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ప్రకటించారు.

సూర్యాపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రైతులు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ఆయకట్టు కింద నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లధనం వెలికితీతకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని గట్టు శ్రీకాంత్రెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement