ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్‌సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం.
మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు.
“ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్
టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment