Women rights organisation
-
ఇది మాయని ‘మరక’ : లైంగిక వేధింపులపై వినూత్న నిరసన
ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. “ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్ టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. -
రేప్ బాధితురాలికి ఘోరమైన ప్రశ్నలు!
- మహిళా జడ్జి అడిగిన ప్రశ్నలపై సర్వత్రా నిరసన మాడ్రిడ్: ఓ రేప్ బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని వివరిస్తుండగా.. మహిళా జడ్జి ఆమెను అడుగకూడని ప్రశ్నలు అడిగింది. మానవత్వం తలదించుకునేలా రేప్ బాధితురాలిపై న్యాయమూర్తి ప్రశ్నలు సంధించింది. తనపై జరిగిన లైంగిక దాడి గురించి బాధితురాలు వివరిస్తుండగా.. న్యాయమూర్తి అడ్డుపడి 'నువ్వు ఆ సమయంలో కాళ్లు దగ్గరగా ముడుచుకున్నావా? నీ స్త్రీ అంగాలను ముడుచుకున్నావా' అంటూ అవమానకరరీతిలో ప్రశ్నించింది. ఈ ఘటన గత ఫిబ్రవరిలో స్పెయిన్లో జరిగింది. రేప్ బాధితురాలిని అవమానించేలా ప్రశ్నలు అడిగిన జడ్జి మారియా డెల్ కార్మెన్ మొలినాపై చర్యలు తీసుకోవాలంటూ స్పెయిన్లోని మహిళా హక్కులు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సదరు న్యాయమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ జాతీయ జ్యుడీషియల్ కౌన్సిల్ (సీజీపీజె)కు ఫిర్యాదు చేశాయి. మహిళలపై నేరాల కేసును విచారించే ప్రత్యేక కోర్టులో ఈ విచారణ జరిగింది. ఉత్తర స్పెయిన్లోని విక్టోరియాకు చెందిన రేప్ బాధితురాలు ఐదు నెలల గర్భవతి. తన పార్ట్నర్ తనపై లైంగిక దాడులు జరుపడమే కాదు శారీరకంగా హింసిస్తున్నాడని, అతడి నుంచి విముక్తి కల్పించాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంలో మహిళా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలతో బాధితురాలు దిగ్భ్రాంతి చెందింది. ఇలాంటి ప్రశ్నలు న్యాయమూర్తి అడుగటం విచారణకు అనవసరమే కాకుండా బాధితురాలి గౌరవ, ఆత్మాభిమానాలకు భంగకరమని మహిళా హక్కుల సంఘం క్లారా కాంపొమర్ అసోసియేషన్ పేర్కొంది. జడ్జి అడిగిన ప్రశ్నలు అవమానకరం, అగౌరవకరం, మానవత్వానికి మచ్చ అని పేర్కొన్నారు. రేప్ బాధితురాలి వాంగ్మూలాన్ని విశ్వసించని న్యాయమూర్తి ఇలా అభ్యంతరకరమైన ప్రశ్నలతో తరచూ అడ్డుపడిందని, ఏ విచారణలోనైనా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదని ఆ సంఘం స్పష్టం చేసింది.