
మొదలైన వినాయక విగ్రహాల సందడి
జోగిపేట :వినాయక చవితి పండగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి వినాయక విగ్రహాలు గ్రామాలకు తరలిస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చవితి నిర్వహించనున్నారు. పండగకు 20 రోజుల ముందే విగ్రహాలను తీసుకువెళుతున్నారు. జోగిపేట, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట ప్రాంతాలకు కూడా విగ్రహాలను తీసుకువస్తుంటారు. ఈ సారి వినాయక విగ్రహాల రేట్లు బాగా పెరిగినట్లు కొనుగోలు దారులు తెలిపారు. 4, 5 అడుగుల వినాయక విగ్రహాలు రూ.14వేల వరకు పలుకుతున్నాయని కొనుగోలు దారులు తెలిపారు.