రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. ప్రస్తుత పాలకులు, వారు ఆరాధించే నాయకుల విగ్రహాలను కూలదోయడం విప్లవకారుల నుంచి అనేక రాజకీయ గ్రూపుల వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా సాగుతోంది.
అధికారంలో ఉన్నవారు, రాజ్యాధికారం కోసం తిరుగుబాటు చేసేవారు విగ్రహాల విధ్వంసానికి పాల్పడడాన్ని రాజకీయ అసహనంగా ప్రజాస్వామికవాదులు భావిస్తారు. దేశంలో 1960ల ఆఖరులో ఆరంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యంగా కోలకత్తా నగరంలో రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి 19వ శతాబ్దానికి చెందిన సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాస్చంద్రబోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది.
మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో దళితులతో పేచీ పడిన ఇతర వర్గాలు బడుగువర్గాలు ఆరాధించే బీఆర్అంబేడ్కర్ విగ్రహాలను పగలగొట్టడం లేదా నల్లరంగు పూయడం ఎంతో కాలంగా జరుగుతోంది. ఎక్కడైనా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై దాడులు జరిపి వాటిని పగలగొట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం రివాజుగా మారింది.
కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు
1991 జూన్ డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్టుల పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, ఇతర ప్రధాన నగరాల్లోని కమ్యూనిస్ట్యో ధులు వ్లాదిమిర్లెనిన్, జోసెఫ్స్టాలిన్భారీ విగ్రహాలను కూల్చివేయడం ఇతర దేశాల ప్రజలకు దిగ్భాంతి కలిగించింది. కమ్యూనిస్టుల పాలన అంతమైన పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు, విప్లవకారుల విగ్రహాలను బుల్డోజర్లతో తొలగించారు. 2001 మార్చిలో అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్లోయ ప్రాంతంలోని భారీ బుద్ధ విగ్రహాలను పాలకపక్షమైన తాలిబాన్లు తమ నేత ముల్లా మహ్మద్ఒమర్ ఆదేశాలపై కూల్చివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది.
దక్షిణాఫ్రికాలోని జొహనీస్ బర్గ్లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్12న కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో ముఖ భాగం స్వల్పంగా దెబ్బతింది. దక్షిణాఫ్రికా శ్వేత జాతి పాలనపై పోరాడిన గాంధీకి నల్లజాతివారంటే చిన్నచూపని ఆరోపిస్తూ ఈ పనిచేశారు. మరో ఆఫ్రికా దేశం ఘనా రాజధాని ఆక్రాలోని యూనివర్సిటీ ఆఫ్ఘనా ఆవరణలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలని 2016లో దాదాపు వేయి మంది పౌరులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపారు. దాంతో ఈ విగ్రహాన్ని మరో ప్రదేశానికి మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది.
అమెరికాలోనూ విగ్రహాలపై ఆగ్రహం!
అమెరికాను కనుగొన్న స్పెయిన్కు చెందిన అన్వేషకుడు క్రిస్టఫర్ కొలంబస్ స్మారక దినం సందర్భంగా 2017 అక్టోబర్9న ఇలినాయ్, రోడ్ఐలండ్రాష్ట్రాలు, కనెక్టికట్లోని మూడు నగరాల్లో వాటిని కొందరు ప్రదర్శకులు కొలంబస్ విగ్రహాలను స్వల్పంగా ధ్యంసం చేశారు. 19వ శతాబ్దంలో నల్లవారిని బానిసలుగా చూసే వ్యవస్థను కాపాడడానికి దక్షిణాది రాష్ట్రాలైన వర్జీనియా, నార్త్, సౌత్కరోలినా రాష్ట్రాల తరఫున పోరాడిని కాన్ఫడరేట్దళాలను నడిపించిన కమాండర్లు, సైనికుల విగ్రహాలు కొన్నింటిని కిందటేడాది తొలగించారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా సిడ్నీలోని అన్వేషకుడు కెప్టెన్జేమ్స్కుక్విగ్రహంపై నల్ల రంగు పెయింట్పోసి కొందరు స్థానిక జాతుల ప్రదర్శకులు నిరసన తెలిపారు.
ఏలూరు కాలవలోకి నీలం విగ్రహం!
1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖామంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలువలో వేశారు. 2001 మార్చిలో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్ బండ్‌పై సాగిన మిలియన్మార్చ్సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు.
అదే కాలంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొందరు పగలగొట్టారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్రావు వెంటనే జోక్యం చేసుకుని తెలుగువారికి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడిన అమరజీవి విగ్రహాల జోలికి పోవద్దనీ, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని ప్రకటించాక ఇలాంటి దాడులు జరగలేదు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment