B. R. Ambedkar
-
సలాం బాబా సాహెబ్
‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’ ప్రాంగణం అడుగడుగునా అద్భుతమైన ఆవిష్కరణలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడు అంబేడ్కర్ స్ఫూర్తి అంబరమంత ఎత్తున నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహా శిల్పం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. 18.81 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 206 అడుగుల ఎత్తయిన సామాజిక న్యాయ మహా శిల్పంతో పాటు ప్రతి నిర్మాణం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. రూ.404.35 కోట్లతో చేపట్టిన నిర్మాణంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు సందర్శకులకు గొప్ప అనుభూతిని పంచుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితమిచి్చన ఈ సామాజిక మహా శిల్పం, అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా రికార్డు సొంతం చేసుకున్నాయి. నాలుగేళ్లకు పైగా పట్టే ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏడాదిన్నరలోనే పూర్తి చేసినట్టు ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్(డీజెడ్‌ఎం) మహ్మద్ అబ్దుల్ రహీమ్ సాక్షికి తెలిపారు. తుపాను... భూ కంపాలు తట్టుకునేలా ‘మహా స్థూపం’ 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహా స్థూపం (కోర్ వాల్) తుపాను గాలులు, భూ కంపాల తీవ్రతను తట్టుకునేలా డిజైన్ చేశారు. భూ కంపాలతో పాటు 250 కిలోమీటర్ల వేగంతో వీచే తుపాను గాలుల తీవ్రతను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. వంద అడుగుల లోతు పునాదితో పాటు 81 అడుగుల పీఠం, దానిపై 510 మెట్రిక్ టన్నుల బరువు, 125 అడుగుల ఎత్తుతో, విగ్రహాన్ని ఠీవిగా నిలబెట్టారు. కాలచక్ర మహా మండపం నీటి కొలను మధ్యలో కాలచక్ర మహా మండపం డిజైన్‌తో 81 అడుగుల ఎత్తు, 3,481 చదరపు అడుగుల వెడల్పుతో పీఠం నిరి్మంచారు. బౌద్ధం, మయన్, ఈజిప్ట్ నాగరికతలను సమ్మిళితం చేసి 50 డిగ్రీల వంపుతో ఇది ఉంటుంది. పింక్ శాండ్ స్టోన్ (ఇసుక రాయి)తో తాపడం చేయించారు. కలర్ స్టోన్ నిర్మాణం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు. పీఠం లోపల జి+2 అంతస్తులను ఐసాసిలెస్, ట్రెపీజియం ఆకారంలో నిరి్మంచారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లేందుకు రెండు లిఫ్ట్‌లున్నాయి. అంబేడ్కర్ చైత్య అంబేడ్కర్ చైత్య (బౌద్ధంలో చైత్య అంటే పవిత్ర క్షేత్రం) పేరుతో గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ మహనీయుని జననం నుంచి మరణం వరకు అన్ని ప్రధాన ఘట్టాలు ఇందులో డిజిటల్ టెక్నాలజీతో ఆవిష్కరించారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఏదైనా ప్రశ్న అడిగితే అంబేడ్కర్ బదులిచి్చనట్టు అనుభూతిని కలిగించేలా వీడియో సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.‘విహార’ థియేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో 75 మంది కూర్చొని సినిమా చూసేలా విహార థియేటర్‌ను నిరి్మంచారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుసుకునేందుకు, విజ్ఞానం, భౌగోళిక, సంస్కృతి, చరిత్ర వంటి అనేక అంశాలకు సంబంధించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. సినిమా టైమింగ్స్, టికెట్ ధర నిర్ణయించాల్సి ఉంది. దక్షిణ భారత్‌తో అంబేడ్కర్ అనుబంధం దక్షిణ భారత్‌తో అంబేడ్కర్ అనుబంధానికి సంబంధించిన ఘట్టాలతో మొదటి అంతస్తును తీర్చిదిద్దారు. దక్షిణ భారత దేశంలో అంబేడ్కర్ తిరిగిన ప్రదేశాలు, సభలు, సమావేశాలకు సంబంధించిన ఘట్టాలకు అద్దం పట్టేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. ఒక భాగంలో ఉన్న స్టడీ రూమ్‌లో ఆయన కూర్చున్న మైనపు బొమ్మను పెట్టారు. మరొక భాగంలో 50 మంది విద్యార్థులు కూర్చొని అంబేడ్కర్ జీవిత చరిత్రపై స్టడీ చేసేందుకు ఇంటరాక్షన్ క్లాస్ రూమ్, మరో భాగంలో లైబ్రరీ ఉన్నాయి. మరెన్నో ప్రత్యేకతలు ఈ ప్రాంగణంలో ధ్యాన మందిరం, కుడ్య చిత్రాలు, అతి పెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్, చి్రల్డన్ ప్లే ఏరియా, యువత కోసం మల్టీ ప్లే విభాగాలు, అవుట్డోర్ జిమ్, రెండు క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్(ఎరీనా), అతి పెద్ద ఫుడ్ కోర్ట్‌లను తీర్చిదిద్దారు. భూమిపై రెండు నెమలి (పికాక్) ఆకారంలో తీర్చిదిద్దిన పచ్చదనం, ఆగ్రాలోని మొఘల్ గార్డెన్ తరహాలో తీర్చిదిద్దిన పూలవనం, సాహిత్య, కళారూపాల ప్రదర్శనకు యాంఫీ థియేటర్, కిలో మీటరున్నర మేర కాలిబాట.సందర్శన వేళలు: ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఎంట్రీ ఫీజు: రూ.5 యిర్రింకి ఉమా మహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
వేగు చుక్క
-
అంబేడ్కర్ విగ్రహం నమూనా విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసినట్లు సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలైనట్లు తెలిపారు. మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్‌తో కలసి బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో విగ్రహం నమూ నాను కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. హుస్సేన్‌సాగర్ తీరంలో రూ.140 కోట్ల వ్య యంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. 45.5 అడుగుల వెడల్పుతో ఏర్పాటయ్యే విగ్రహానికి 791 టన్ను ల స్టీలు, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడి వినియోగిస్తామని తెలిపారు. 11 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే పార్కులో అంబేడ్కర్ విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పాల్గొన్నారు. -
సమతకు పట్టం కట్టిన తీర్పు
వేల ఏళ్లుగా ఊరికి అవతల శ్మశానాల్లో, పశువుల కళేబరాలతో సహజీవనం చేస్తూ, వెలివేత బతుకులు అనుభవించిన వారు అకస్మాత్తుగా తమతోపాటు కుర్చీల్లో కూర్చొని పనిచేయడాన్ని దళితేతర వర్గం సహించలేకపోతోంది. తమ కన్నా హీనకులం వాడు తన కన్నా ఉన్నత పదవిలో ఉన్నాడనే భావన రిజర్వేషన్ల వ్యతిరేకతకు పునాది అవుతోంది. ఎస్సీలు 30–40 ఏళ్ల నుంచి చదువుల్లో, ఉద్యోగాల్లోకి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వీళ్ల మీద రిజర్వేషన్ల పేరుతో ద్వేషాన్ని కలిగి ఉండటం సమాజానికి మంచిది కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ఏ ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ‘‘నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి వివిధ కోర్సుల్లో సీటు, నాకన్నా తక్కువ ప్రావీణ్యం చూపిన వారికీ, తక్కువ ప్రతిభ ఉన్నవారికీ ఉద్యోగం, అంతే కాదు నాకన్నా వెనుక ఉద్యోగంలో చేరిన వారికి ఉద్యోగంలో ప్రమోషన్– ఇది దేశానికి నష్టం. ఇలాంటివి ఉండ టం వల్లే దేశం పురోగతి సాధించటం లేదు. అందుకే రిజర్వేషన్ల అమలు అవసరం లేదు’’ అనే రిజర్వేషన్ల వ్యతిరేకుల మాటలు మనకు కొత్త కాదు. రిజర్వే షన్లను ఏ విధంగానైనా దెబ్బకొట్టాలనేవారు ఇంకా చాలా మంది మన మధ్య ఉన్నారు. ఇక రిజర్వేషన్లు కొనసాగితే తమకు కూడా అమలు చేయాలని కొన్ని ఆధిపత్య కులాలు, అభివృద్ధి చెందిన సామాజిక వర్గాలు వాదిస్తున్నాయి. ఈ వాదన క్రమంగా ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా మారిపోయింది. దానిలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు గానీ, రిజర్వేషన్లలో ప్రమోషన్లు గానీ అమలు చేయకుండా ఆందోళనలు, కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారిపో యింది. సమాజంలో రిజర్వేషన్లపై వ్యతిరేకతను ఇది స్పష్టం చేస్తోంది. రిజర్వేషన్లు పొందుతున్న వారిపై విద్వేషానికి, అసూయకీ ఇది తార్కాణంగా నిలు స్తోంది. కొన్ని సార్లు కోర్టులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించడం వల్ల సామాజిక అశాంతి కొంత తగ్గుతోంది. మంగళ వారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అలాంటిదే. గత కొన్నేళ్లుగా ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రక్రియ ఆగిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే ప్రమోషన్లలో రిజర్వేషన్లు కొనసాగించవచ్చనీ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వ డానికి ఎలాంటి ఇబ్బందీ లేదనీ సుప్రీంకోర్టు ఆదే శాలు ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇదే సుప్రీంకోర్టు ప్రమో షన్లలో రిజర్వేషన్లలో అవకతవకలున్నాయంటూ అందులో రిజర్వేషన్లను నిలిపివేసింది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఎస్సీలమీద పాశవిక దాడులకు కూడా రిజర్వేషన్లపై చర్చ కారణమయింది. ఓ రాష్ట్రం లోనైతే ఓ దళిత యువతి ఎస్ఐ ఉద్యోగానికి ఎంపి కయ్యాక శిక్షణ పొంది ఇంటికొచ్చినప్పుడు నీకు ఎస్ఐ ఉద్యోగం ఎందుకంటూ ఆమెను రాళ్లతో తల మీద మోది చంపేసిన దారుణ ఘటన సంచలనం సృష్టించింది. మితిమీరుతున్న సామాజిక అసహనం వేల ఏళ్లుగా ఊరికి అవతల శ్మశానాల్లో, పశువుల కళే బరాలతో సహజీవనం చేస్తూ, వెలివేత బతుకులు అనుభవించిన వారు అకస్మాత్తుగా తమతోపాటు కుర్చీల్లో కూర్చొని పనిచేయడాన్ని దళితేతర వర్గం సహించలేకపోతోంది. తమ కన్నా హీనకులం వాడు తన కన్నా ఉన్నత పదవిలో ఉన్నాడనే భావన రిజ ర్వేషన్ల వ్యతిరేకతకు పునాది అవుతోంది. ఈ విష యంపై అవగాహన కలగాలంటే మళ్లీ అంబేడ్కర్‌ను పలకరించక తప్పదు. భారత సామాజిక పరిశీలన చేసి అంటరాని కులాల పేరుతో ఊరి అవతలకి విసిరి పారేసిన కులాల పరిస్థితికి కారణం కనుక్కున్నవాడు బాబాసాహెబ్ అంబేడ్కర్. అందుకే అంబేడ్కర్ ఆలో చనను మరోసారి పరిశీలించక తప్పదు. ఇనుపకంచెకన్నా బలమైన వర్ణ విభజన భారతదేశ సమాజం వర్ణ, అవర్ణ అనే రెండు భాగాలుగా విడిపోయింది. వర్ణ విభాగంలో ద్విజులు, ద్విజులు కాని వారు అనే రెండు వర్గా లున్నాయి. వర్ణలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉండగా, ద్విజులు కాని వారిలో శూద్రు లున్నారు. అయితే ఈ విభజన కూడా నిలకడ అయిందేమీ కాదు. వర్ణలో ఉన్న మూడింటిలో విభే దాలున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియుల మధ్య జరిగిన యుద్ధాలే ఇందుకు నిదర్శనం. రామాయణంలో, భారతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ద్విజులకు, శూద్రులకు మ«ధ్య కూడా వైరుధ్యం ఉన్నది. దీనికి ఎన్నో చారిత్రక ఆధారా లున్నాయి. శివాజీ లాంటి మహాచక్రవర్తి ఎదుర్కొన్న వివక్ష, అవమానాలే ఇందుకు ఉదాహరణ. అవర్ణలో అంటరాని కులాలు, మైదాన ఆదివాసీ తెగలు, అడవి ఆదివాసీ తెగలుగా అంబేడ్కర్ గుర్తించారు. మైదాన ఆదివాసీలను ఆ రోజుల్లో క్రిమినల్ ట్రైబ్స్‌గా పేర్కొనే వారు. అయితే అంటరాని కులాలను, ఆదివాసీ తెగ లను విడదీసి దూరంగా ఉంచారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటరాని కులాలపై ఆదివాసీ తెగలు వివక్ష చూపుతూనే ఉంటాయి. ఆదివాసీ తెగలను సమాజంలోని వర్గ సమాజం ఎప్పుడూ కూడా తమలో భాగంగా చూడలేదు. కానీ ఆదివాసులను వర్గ సమాజం అంటరాని వారుగా చూడదు. ఈ మొత్తం సామాజిక విభజనను, పరిశీల నను గమనిస్తే అంటరాని కులాలకు, మిగతా సమా జానికీ మధ్య నున్న విభజన ఇనుప కంచెకన్నా బల మైనదనీ అంబేడ్కర్ వాదన. ఇది చర్చ జరగాల్సిన అంశం. ఈ విద్వేషం వల్లనే ఈ రోజు దళితుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వందల మంది దళితులు హత్యకు గురవుతున్నారు. వేలాది మంది దళిత ఆడపడుచులు అత్యాచారాలకు బలవుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ప్రతీచోటా అవమానాలే ఎదురవుతున్నాయి. ఇది ఈ నాటి కథ కాదు రెండు వేల ఏళ్ళుగా సాగుతున్న నరమేధం. దళితులు ఏనాడూ హింసకు, రక్తపాతా నికీ దిగలేదన్నది వాస్తవం. శాంతియుత జీవన విధానం, శత్రువునైనా క్షమించే గుణం దళితుల సొంతం. నిజానికి ఇలాంటి హింస ఏ దేశంలో జరి గినా సగం సమాజం నాశనమయ్యేది. దీనికి కూడా సామాజిక నేపథ్యం ఉంది. ప్రస్తుతం అంటరాని కులాలుగా ఉన్న చాలామంది బౌద్ధం, జైనం వారసత్వం కలిగిన వాళ్లు. అందుకే వారిలో ప్రేమ తప్ప, ద్వేషం ఉండదు. ఎవరైనా తమతో సమా నంగా గౌరవించే తత్వం దళితులకే సాధ్యమవు తుంది. సమానత్వమే బాబాసాహెబ్ తత్వం అదేరకమైన స్వభావాన్ని, విధానాన్నీ బీఆర్ అంబే డ్కర్ అందిపుచ్చుకున్నారు. ఎన్నో అవమానాలు, అణచివేతను ఎదుర్కొన్న అంబేడ్కర్ ఒకవేళ హింసా మార్గం వైపు వెళ్లి ఉంటే ఈ రోజు దేశం మధ్య ఆసి యాలాగా మండుతుండేది. అంబేడ్కర్ అమెరికాలో చదివిన చదువు ఆయనకు సామాజిక మార్పుపై ఒక శాస్త్రీయ అవగాహన కలిగించింది. అమెరికాలో ఆయన గురువు జాన్ డ్యూయి బోధించిన ప్రజా స్వామ్య దృక్పథం ఆయనకు భారతదేశ సమాజ నిర్మాణానికి మార్గదర్శకమైంది. అందువల్లనే ఆయన ప్రజాస్వామ్యంలోనే పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యమంటే కేవలం ఓటు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకోవడం మాత్రమే కాదు. సామాజిక జీవితంలో ప్రజల మధ్య ఉండే సంబం ధాల్లో కొనసాగాల్సిన సోదరత్వం ప్రజాస్వామ్యానికి పునాది. అందువల్లనే ఆయన ప్రకటించుకొన్న సమా నత్వం, స్వేచ్ఛ, సోదరత్వాల్లో ఆయన ఎక్కువగా ఆలోచించింది సోదరత్వం గురించే. అంబేడ్కర్ ప్రారంభం నుంచీ గాంధీజీ విధానాలనూ, కాంగ్రెస్ రాజకీయాలను విమర్శనాత్మకంగానే చూశారు. ఒక దశలో కాంగ్రెస్‌ను, గాంధీజీని చాలా తీవ్రపదజా లంతో విమర్శించారు. అయితే 1946లో ఏర్పాటైన రాజ్యాంగ సభలో చేరడానికి వెనకాడలేదు. అంతే కాదు రాజ్యాంగ సభలో అంబేడ్కర్ చేసిన ప్రసంగం, ఆయనకు ప్రజాస్వామ్యం, భారతదేశ ఐక్యత మీద ఎంతో విశ్వాసం ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ ప్రసంగమే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచనా కమిటీకి ఛైర్మన్‌గా ఎంపిక చేయడానికి కారణ మైంది. అప్పటి వరకు కాంగ్రెస్‌ను శత్రువుగా భావిం చినా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం పని చేసే విజ్ఞతను అంబేడ్కర్ అందిపుచ్చుకున్నారు. ఇది అంబేడ్కర్ దార్శనికతకు నిదర్శనం. ఇంకో విష యాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇలాంటి దృక్పథం కేవలం అంబేడ్కర్‌కే కాదు, దళిత సమా జం మొత్తంలో ఇది నిండి ఉంది. తమను ఊరి బయటకు వెలివేసినప్పటికీ ఆ వూరి ప్రగతికోసం ప్రాణాలకు తెగించి పనిచేయడం, సమాజాభివృద్ధికి తమ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం దళి తులు తరాల తరబడి చేస్తూనే ఉన్నారు. వర్షాధార పంటలమీద ఆధారపడే కాలం నుంచి చెరువుల నిర్మాణం ద్వారా నికరమైన పంటల పెరుగుదలకు ప్రాణం పోశారు. చచ్చిన పశువుల చర్మాలు ఒలిచి, మురికిలో మురికిగా మారి తోలును శుభ్రం చేసి పద్దె నిమిది కులాలకు పనిముట్లను తయారు చేసిన పని తనం దళితులది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన రైల్వేల నిర్మాణం, గనుల తవ్వకం లాంటి పనుల్లో వేలాది ప్రాణాలు బలైపోయాయి. కుళ్లు కంపుకొడుతోన్న పాయిఖానాలను, చెత్తతో నిండిన వాడలను శుభ్రం చేసిన స్వచ్ఛమైన భారతీ యులు వీరే. ఇది భారత దేశంలోని దళితుల ఔదా ర్యం. వారిగొప్పతనం. అయితే గత వేల ఏళ్ళుగా భూమికీ, చదువుకూ, సంపదకూ, మంచి బట్టకూ, ఇంటికీ దళితులు దూరంగానే ఉన్నారు. కొన్ని కులాలు వందల ఏళ్ళుగా చదువులో, సంపదలో, భూమిలో నూటికి నూరుశాతం రిజర్వేషన్లు అను భవించాయి. చాలా మంది అన్నదాత పేరును కేవలం భూమి హక్కు కలిగిన భూస్వాములనే అర్థంలో ప్రస్తావిస్తున్నారు. నిజానికి పంట పండిం చింది, పండించేది కూలీలే. ఆ కూలీలు ఎవ్వరో కాదు, నూటికి నూరు పాళ్లూ దళితులే. ఇలాంటి ఎస్సీలు 30–40 ఏళ్ల నుంచి చదువుల్లో, ఉద్యోగాల్లోకి వస్తున్నారు. అయితే, ఇరవై ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యో గాలను కుదించారు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్న వీళ్ల మీద రిజర్వేషన్ల పేరుతో ద్వేషాన్ని కలిగి ఉండటం సమాజానికి మంచిది కాదు. భారతదేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాం గాన్ని రూపొందించుకున్నాం. సమానత్వం, స్వేచ్ఛ, సోదరత్వం పునాదిగా ఎన్నో అంశాలను పొందుపరు చుకున్నాం. అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4)ఏ ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు: మల్లెపల్లి లక్ష్మయ్య , మొబైల్ : 97055 66213 -
వెలుగు దివిటీ
-
హింస నచన ధ్వంస రచన
రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తలు, సంఘసంస్కర్తల విగ్రహాల విధ్వంసం ఈనాటిది కాదు. మతపరమైన విగ్రహాలు, పూజా స్థలాలను ధ్వంసం చేయడం వేల ఏళ్ల క్రితమే క్రితమే జరిగిందని చరిత్ర చెబుతోంది. కొత్త పాలకులు అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోయిన నేతల చిత్రాలు, విగ్రహాలు, వారి అధికారం, సిద్ధాంతాల చిహ్నాలను పగలగొట్టడం ఫ్రెంచి విప్లవంలో విస్తృతంగా జరిగింది. ప్రస్తుత పాలకులు, వారు ఆరాధించే నాయకుల విగ్రహాలను కూలదోయడం విప్లవకారుల నుంచి అనేక రాజకీయ గ్రూపుల వరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. అధికారంలో ఉన్నవారు, రాజ్యాధికారం కోసం తిరుగుబాటు చేసేవారు విగ్రహాల విధ్వంసానికి పాల్పడడాన్ని రాజకీయ అసహనంగా ప్రజాస్వామికవాదులు భావిస్తారు. దేశంలో 1960ల ఆఖరులో ఆరంభమైన నక్సలైట్ ఉద్యమకాలంలో పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా కోలకత్తా నగరంలో రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి 19వ శతాబ్దానికి చెందిన సంఘసంస్కర్తలు, గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాస్‌చంద్రబోస్ వంటి స్వాతంత్య్రసమరయోధుల విగ్రహాలను ధ్వంసం చేయడం సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో దళితులతో పేచీ పడిన ఇతర వర్గాలు బడుగువర్గాలు ఆరాధించే బీఆర్అంబేడ్కర్ విగ్రహాలను పగలగొట్టడం లేదా నల్లరంగు పూయడం ఎంతో కాలంగా జరుగుతోంది. ఎక్కడైనా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై దాడులు జరిపి వాటిని పగలగొట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడం రివాజుగా మారింది. కూలిన లెనిన్, స్టాలిన్ విగ్రహాలు 1991 జూన్ డిసెంబర్ మధ్య జరిగిన పరిణామాలతో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై కమ్యూనిస్టుల పాలన ముగిసినప్పుడు రాజధాని మాస్కో, ఇతర ప్రధాన నగరాల్లోని కమ్యూనిస్ట్యో ధులు వ్లాదిమిర్లెనిన్, జోసెఫ్స్టాలిన్భారీ విగ్రహాలను కూల్చివేయడం ఇతర దేశాల ప్రజలకు దిగ్భాంతి కలిగించింది. కమ్యూనిస్టుల పాలన అంతమైన పోలండ్, బల్గేరియా వంటి తూర్పు ఐరోపా దేశాల్లోనూ కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు, విప్లవకారుల విగ్రహాలను బుల్డోజర్లతో తొలగించారు. 2001 మార్చిలో అఫ్ఘానిస్తాన్‌లోని బామియాన్లోయ ప్రాంతంలోని భారీ బుద్ధ విగ్రహాలను పాలకపక్షమైన తాలిబాన్లు తమ నేత ముల్లా మహ్మద్ఒమర్ ఆదేశాలపై కూల్చివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. దక్షిణాఫ్రికాలోని జొహనీస్ బర్గ్‌లో గాంధీ విగ్రహాన్ని 2015 ఏప్రిల్12న కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో ముఖ భాగం స్వల్పంగా దెబ్బతింది. దక్షిణాఫ్రికా శ్వేత జాతి పాలనపై పోరాడిన గాంధీకి నల్లజాతివారంటే చిన్నచూపని ఆరోపిస్తూ ఈ పనిచేశారు. మరో ఆఫ్రికా దేశం ఘనా రాజధాని ఆక్రాలోని యూనివర్సిటీ ఆఫ్ఘనా ఆవరణలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించిన గాంధీ విగ్రహాన్ని తొలగించాలని 2016లో దాదాపు వేయి మంది పౌరులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి పంపారు. దాంతో ఈ విగ్రహాన్ని మరో ప్రదేశానికి మార్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. అమెరికాలోనూ విగ్రహాలపై ఆగ్రహం! అమెరికాను కనుగొన్న స్పెయిన్‌కు చెందిన అన్వేషకుడు క్రిస్టఫర్ కొలంబస్ స్మారక దినం సందర్భంగా 2017 అక్టోబర్9న ఇలినాయ్, రోడ్ఐలండ్రాష్ట్రాలు, కనెక్టికట్‌లోని మూడు నగరాల్లో వాటిని కొందరు ప్రదర్శకులు కొలంబస్ విగ్రహాలను స్వల్పంగా ధ్యంసం చేశారు. 19వ శతాబ్దంలో నల్లవారిని బానిసలుగా చూసే వ్యవస్థను కాపాడడానికి దక్షిణాది రాష్ట్రాలైన వర్జీనియా, నార్త్, సౌత్కరోలినా రాష్ట్రాల తరఫున పోరాడిని కాన్ఫడరేట్దళాలను నడిపించిన కమాండర్లు, సైనికుల విగ్రహాలు కొన్నింటిని కిందటేడాది తొలగించారు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా సిడ్నీలోని అన్వేషకుడు కెప్టెన్జేమ్స్కుక్విగ్రహంపై నల్ల రంగు పెయింట్పోసి కొందరు స్థానిక జాతుల ప్రదర్శకులు నిరసన తెలిపారు. ఏలూరు కాలవలోకి నీలం విగ్రహం! 1960ల చివర్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ సాగిన ఆందోళన సందర్భంగా విజయవాడలోని అప్పటి కేంద్ర ఉక్కు శాఖామంత్రి నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఉద్యమకారులు తొలగించి ఎదురుగా ఉన్న ఏలూరు కాలువలో వేశారు. 2001 మార్చిలో ప్రత్యేక తెలంగాణ కోసం ట్యాంక్ బండ్‌పై సాగిన మిలియన్మార్చ్సందర్భంగా కొందరు అక్కడి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. అదే కాలంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలోనే సిద్దిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొందరు పగలగొట్టారు. టీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు వెంటనే జోక్యం చేసుకుని తెలుగువారికి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడిన అమరజీవి విగ్రహాల జోలికి పోవద్దనీ, ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందని ప్రకటించాక ఇలాంటి దాడులు జరగలేదు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
సోదరత్వ భావనే కీలకం
కొత్త కోణం భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన సమాజం కావాలని అంబేడ్కర్ ప్రకటించారు. అందులో సోదరత్వం అత్యంత ఆవశ్యకమని కూడా ఉద్ఘాటించారు. ప్రజా స్వామ్యమంటే ప్రభుత్వాలు అనుసరించే విధానం మాత్రమే కాదనీ, ప్రజల జీవన విధా నంలో ప్రతిబింబించే సోదరత్వమే ప్రజాస్వామ్యమనీ అన్నారు. అందుకే భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని సోదరత్వ భావనగా చూడాలి. అటువంటి సమానత్వ విలువల కోసం సాగిన మహా సంగ్రామమే రెండున్నర వేల ఏళ్ల ప్రజాస్వామ్య ఉద్యమం. మనుషులందరికీ సమాన హక్కులూ, సమాన అవకాశాలూ, సమాన భాగస్వామ్యం, పాలనలో పారదర్శకత, గౌరవప్రదమైన జీవితం, వివక్షకు తావు లేని మానవ సంబంధాలు అన్నీ కలిస్తే ప్రజాస్వామ్యం. ఆ పేరు ఎత్తగానే మనకు గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో ఆనాటి పాలనా వ్యవస్థలు గుర్తొస్తాయి. ప్రజాస్వామ్య పునాదులు అక్కడే ఉన్నట్టు చరిత్రకారులు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోకానీ, ఇతర పరిశోధక గ్రంథాల్లో కానీ భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రస్తావించిన దాఖలాలు మాత్రం కనిపించవు. ఇప్పటి వరకు ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తులన్నీ భారత ప్రజల ప్రజాస్వామిక పోరాటాల చరిత్రను రకరకాల పేర్లతో వక్రమార్గం పట్టించారు. భారతదేశ చరిత్రను ప్రజల దృక్కోణంలోనుంచి విశ్లేషించిన వాళ్లు సైతం, కొద్దిగా అటూ ఇటూగా హిందూత్వ ఆధిపత్య శక్తుల ఆలోచనల మూసలోనే ప్రయాణాన్ని కొనసాగించినట్టు చరిత్ర చెపుతోంది. గ్రీకు రాజ్యంలో సమానత్వం అనే మాట వేళ్లూనుకొనకముందే, భారతదేశం అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఈ గడ్డమీద సమానత్వం, స్వేచ్ఛ, సోదరత్వ భావనలు పరిఢవిల్లాయి. వాటికోసం ఇక్కడ నిరంతరా యంగా సంఘర్షణ జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి వివిధ రూపాల్లో జరిగిన ఉద్యమాలన్నింటినీ ప్రజాస్వామిక ఉద్యమాలుగా కాక, మతపరమైన సంస్కరణ ఉద్యమాలుగా పక్కకుతోసి, యూరప్, అమెరికాల నుంచి ప్రజా స్వామ్య భావనలను మనం అరువు తెచ్చుకున్నాం. ఆధిపత్యం కొనసాగించే శక్తులు వీటిని రాక్షసకృత్యాలు, దైవవ్యతిరేక ఘటనలు, దుర్మార్గపు చర్యలుగా పేర్కొంటే, ప్రగతిశీల, అభ్యుదయ భావాలు కలిగిన మేధావులు వీటిని మత సంస్కరణోద్యమాలకు కుదించారు. ఈ రెండు ధోరణులు భారత ప్రజా స్వామిక చరిత్రలోని సత్యాలను మరుగుపరిచాయి. ఇప్పుడైనా భారత ప్రజాస్వామిక చరిత్రలోని చారిత్రక వాస్తవాలపై చర్చ జరగాలి. అంత ర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మన ప్రజాస్వామ్య మహ త్తర చరిత్రను మననం చేసుకుందాం. ప్రజాస్వామ్య పరిధి విస్తృతమైనది అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించాలని 2007లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఇది 2008 సంవత్సరం నుంచి అమలవుతోంది. ఈ అంశం మీద 1997, సెప్టెంబర్ 16న ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన సమావేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో మొదటి భాగంలో మొట్టమొదటి పేరాలో ‘సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే విధమైన విలువలపైన ఆధారపడి జీవితాలను గడిపే హక్కు ప్రజాస్వామిక విలువలలో అత్యంత ముఖ్యమైన అంశం’ అంటూ దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యం వివిధ దేశాల్లో రకరకాల రూపాల్లో అమలు జరుగు తున్నది. కొన్ని దేశాలు చిత్తశుద్ధితో ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుంటే, మరికొన్ని ఆ పేరును వల్లెవేస్తున్నాయి. భారత ప్రజాస్వామ్యం కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నది. మన ప్రజాస్వామ్యం యూరప్, అమెరికా నమూనాల నుంచి కొన్ని అంశాలను తీసుకొని చట్టాలలో పొందుపరుచుకొని ఉండవచ్చు. కానీ గత రెండున్నర వేల సంవత్సరాల ప్రజల బలమైన సమా నత్వ కోరికలు, సంఘర్షణలు, త్యాగాలు ఈ ప్రజాస్వామ్యం భావజాలం వెనుక ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనగానే ‘ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ప్రభుత్వం’ అన్న అబ్రహం లింకన్ మాటలను ఉటంకిస్తుంటాం. కానీ ఇది పాక్షిక సత్యం. ప్రజాస్వామ్య భావనను భారతదేశానికి అన్వయించే విధంగా వ్యాఖ్యానించిన వారు బాబాసాహెబ్ అంబేడ్కర్. భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వంతో కూడిన సమాజం కావాలని ఆయన ప్రకటించారు. అందులో సోదరత్వం అత్యంత ఆవశ్యకమని కూడా ఉద్ఘాటిం చారు. సోదరత్వానికి మరో రూపమే ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యమంటే ప్రభుత్వాలు అనుసరించే విధానం మాత్రమే కాదని, ప్రజల జీవన విధానంలో ప్రతిబింబించే సోదరత్వమే ప్రజాస్వామ్యమని స్పష్టం చేశారు. అందుకే భారతదేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని సోదరత్వ భావనగా చూడాలి. అటువంటి సమానత్వ విలువల కోసం, జీవితాల కోసం సాగిన మహా సంగ్రామమే రెండున్నర వేల సంవత్సరాల ప్రజాస్వామ్య ఉద్యమం. బౌద్ధం కృషి మరువలేనిది భారతదేశంలో వేదాల ప్రామాణికతని ఉన్నతంగా చూపెట్టి, తమ ఆధి పత్యాన్ని నిలుపుకోవడానికి వర్ణ వ్యవస్థను, అనంతరం కుల వ్యవస్థను సృష్టించి, పెంచి పోషించిన పూజారి వర్గానికి వ్యతిరేకంగా ఆది నుంచే ప్రతిఘటన మొదలైంది. మొదట్లో చార్వాక, లోకాయుక్త, అజీవక, జైనులు బ్రాహ్మణ పురోహిత ఆధిపత్యాన్ని నిరసించారు. మనుషులంతా ఒక్కటేననే విషయాన్ని ఆ సిద్ధాంతాలు ముందుకు తీసుకొచ్చాయి. వీటన్నింటి ఆచరణ ఆధారంగా ఆ భావాలను మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లగలిగిన చైతన్యమే బౌద్ధం ఆవిష్కరణకు మూలం. గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన త్రిశరణాలలో ధమ్మం, సంఘం అనేవి ప్రజాస్వామ్య విలువలకు ప్రాథమిక రూపాలు. బుద్ధుడు ప్రతిపాదించిన సంఘంలో వివక్షకు చోటులేదు. కులం, లింగం, ప్రాంతం ఎటువంటి భేదాలు పాటించని వ్యవస్థ బౌద్ధ సంఘం. ఆనాటి అసమాన సామాజిక వ్యవస్థకు ఎదురైన మొదటి ప్రతిఘటన బహుశా అదే. ఈ విధానాలే తదనంతరం ముఖ్యంగా అశోకుడు, కనిష్కుడు హర్షవర్ధనుడి లాంటి చక్రవర్తులు బుద్ధుని ప్రజాస్వామ్య భావాలను తమ పాలనలో భాగం చేసుకున్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించడా నికి అశోకుడు చేసిన ప్రయత్నం మరువలేనిది. ప్రజలకు నాటి అభివృద్ధి ఫలాలు అందడానికి ఆయన రూపొందించిన విధానాలు ఎంతో ప్రాము ఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ప్రజలు తమ జీవితాలను సుఖ సంతోషాలతో ఉంచడానికి అశోకుడు చేసిన ప్రయత్నం ప్రజాస్వామ్య భావనలో భాగంగానే చూడాలి. అయితే ఈనాటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థను ఆనాటి పాలనతో పోల్చిచూడడానికి ప్రయత్నం చేసేవాళ్లు కొందరు న్నారు. అది పొరపాటు. ఆనాడున్న సామాజిక పరిస్థితుల్లో ఆ విధానాలు ఏమేరకు సమాజంలో సమానత్వ భావనకు కృషిచేశాయి, ప్రజలను సమా నత్వం వైపు ముందుకు నడిపించాయి అనేది ముఖ్యం. ఆనాడున్న ఆధిపత్య భావజాలాన్ని, ప్రజాస్వామిక విధానాలు ప్రతిఘటించిన తీరును మనం గమనంలోకి తీసుకోవాలి. దీనినే చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడంగా చెప్పుకోవాలి. ఐక్యపోరాటాలతోనే ప్రజాస్వామ్యం ఆనాడు బుద్ధుడు, అశోకుడు సాగించిన ప్రజాస్వామిక విప్లవాన్ని మళ్లీ బ్రాహ్మణ పురోహిత వర్గాలు క్షత్రియులతో కలసి దెబ్బతీశాయి. దానినే అంబేడ్కర్ ప్రతీఘాత విప్లవంగా పేర్కొన్నాడు. చరిత్రను ఎవ్వరూ మరుగు పర్చలేరు. వివిధ రూపాల్లో చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. పాత భావాల నుంచి విముక్తమయ్యేందుకు విప్లవోన్ముఖం అవుతూనే ఉంటుంది. ఏదో రూపంలో అసమానతలను ప్రతిఘటిస్తూనే ఉంటుంది. అశోకుడి పాలన తర్వాత క్రమక్రమంగా బలాన్ని పుంజుకున్న బ్రాహ్మణ పూజారి వర్గం కులవ్యవస్థను వ్యవస్థీకృతం చేసే పనిని సాగించింది. ఆ విధంగా కుల వ్యవస్థకు ఒక రూపాన్నీ, శక్తినీ అందించింది. ఆ క్రమంలోనే భగవంతుని చట్రంలోనే, మత పరిధిలోనే మధ్య యుగాల్లో భక్తి ఉద్యమాలు బయలు దేరాయి. అందులో బసవేశ్వరుడు సాగించిన వీర శైవం, రామానుజుడు సాగించిన వీర వైష్ణవం కుల వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించాయి. ఈ రెండు ఉద్యమాలు కులాలన్నింటికీ తమలో భాగస్వామ్యం కల్పించాయి. తద్వారా అన్నికులాలు సమానమనే భావానికి దైవత్వాన్ని జోడించి ప్రజలముం దుంచాయి. ఆ తర్వాత కబీర్ తీసుకొచ్చిన వాదన, సాగించిన ఉద్యమం, ఉత్తరాదిని ప్రభావితం చేసింది. అందువల్లనే వృత్తికులాలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణ వ్యతిరేక భావంతో ఈ ఉద్యమాలలో భాగస్వా ములయ్యాయి. వీర శైవంలో అంటరానికులం నుంచి మాదిగలు, వీరవైష్ణ వంలో మాలలు ప్రధాన భాగస్వాములు కావడం గమనించాలి. ఆ తర్వాత రవిదాసు, నానక్, మీరాబాయి, తమిళనాడులో సిద్ధ ఉద్యమం, తెలుగునేలపైన బ్రహ్మంగారు, వేమన సాగించిన ఉద్యమాలు కూడా ఇందులో భాగంగానే చూడాలి. మహారాష్ట్రలో సాగిన వరకర ఉద్యమం, ఆ తర్వాత మహాత్మా జ్యోతీరావ్ఫూలే ప్రతిఘటన ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి ఆధునిక ధోరణులు మొదలయ్యాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో సాగుతున్న బానిస వ్యతిరేక పోరాటాలు ఫూలేను ఆధునిక ప్రజాస్వామ్య భావాల వైపు నడిపించాయి. అయితే వాటిని మరింతగా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి అసమాన సమాజానికి ప్రతినిధిగా మనువాద సిద్ధాంతానికి నిర్దిష్టమైన ముగింపు పలికే అస్త్రశస్త్రాలను సమకూర్చింది బాబాసాహెబ్ అంబేడ్కర్. స్వాతంత్య్రం కోసం జరిగిన రాజకీయ పోరాటాల్లో రూపొందించుకున్న విధానాలు కూడా కుల వ్యవస్థను ప్రశ్నించాయి. వీటన్నింటితో పాటు బాబాసాహెబ్ తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరంగా అధ్యయనం - పోరాటం అనే విధానంతో సాగించిన సంఘర్షణ భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలకు స్థానం కల్పించింది. బుద్ధుడు ప్రారంభించిన ప్రజాస్వామ్య పోరాటం, బాబాసాహెబ్ అంబేడ్కర్ వరకు కొనసాగి భారతీయ ప్రజలకు రాజ్యాంగం అనే ప్రజాస్వామ్య ఆయుధాన్ని అందించింది. అయితే ఇంకా ఆ పోరాటం పరిపూర్తికాలేదు. అంబేడ్కర్ చెప్పినట్టు ప్రజాస్వామ్యం విలువ దాని అమలుపైనే ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం రాజ్యాంగం ప్రతిపై కాదు. అందుకే నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను సాధించుకోవడానికి విశాల ప్రాతిపదికపై మరింత శక్తిమంతమైన ఐక్య పోరాటాలు అవసరం. మల్లెపల్లి లక్ష్మయ్య (నేడు ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
దళితుల విశ్వాసం పొందకుంటే కష్టమే: దిగ్విజయ్
అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో దిగ్విజయ్‌సింగ్ వారిని ఓటు బ్యాంకుగా చూడకూడదని వ్యాఖ్య కేసీఆర్.. దళిత సీఎం సంగతేంది?: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు తొలి నుంచీ అండగా ఉంటున్న దళితుల విశ్వాసం పొందకపోతే ఇక ముందు కష్టమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను టీపీసీసీ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ మాట్లాడారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పరితపించిన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయం జరిగిందని చెప్పారు. దళితులను ఓటు బ్యాంకుగా చూడకూడదన్నారు. దళితవాడలకు వెళ్లాలని, వారితో చర్చలు జరపాలని, వారితో కలసి తిరుగుతూ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో బెల్లయ్య నాయక్ చేరిక లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్య రాజకీయాలకు వేదిక అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. దళిత సీఎం మాటేమైంది?: ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని కేసీఆర్ ఇచ్చిన మాట ఏమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక కొనడానికి భూమి దొరకడం లేదనడం దళితులను మోసం చేయడం కాదాని నిలదీశారు. దళితులపై కేసీఆర్ బూటకపు ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు మనుస్మృతి ఇరానీగా మారిపోయారని ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. సమాజానికి ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాల్సిన యూనివర్సిటీలను ఏబీవీపీకి అడ్డాగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఎలుగెత్తి చాటిన మహా మేధావి అంబేడ్కర్‌ను కేవలం దళితులకే నాయకుడనే ధోరణితో కొందరు చూడటం బాధాకరమని కొప్పుల రాజు వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పోరాట ఫలితమే దళితులకు దక్కుతున్న అవకాశాలని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి అన్నారు. బాంచెన్ బతుకుల వివక్ష నిర్మూలనకు అంబేడ్కర్ జీవితాంతం కృషి చేశారని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. అట్టడుగు వర్గాలకు అధికారం అంబేడ్కర్ పుణ్యమేనని షబ్బీర్ అలీ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాజాన్ని కలుషితం చేస్తోందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. కుల రహిత, స్త్రీ-పురుష సమానత్వం కోసం చివరివరకూ పోరాడిన మహానేత అంబేడ్కర్ అని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు సర్వే సత్యనారాయణ, వివిధ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘బాబాసాహెబ్’ అంబేడ్కర్ 125వ జయంతి
-
‘సమాఖ్య’కు కాంగ్రెస్ సమాధి!
‘‘భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించటంలో ఆచరణ యుక్తమైన మంచి రాజ్యాంగాన్ని అందించాలన్న లక్ష్యం తప్ప రాజ్యాంగ నిర్ణయ సభకు మరో ఉద్దేశమేలేదు... కొన్ని ప్రత్యేక అంశాలకు సంబంధించి (ఉ:372-3 లాంటివి) వచ్చిన సవరణలు చాలా కొద్దివి మాత్రమే. అలాంటి ప్రత్యేక సవరణలకు రాష్ట్రాల శాసనసభల ధృవీకరణ తప్పనిసరి. కనుకనే, సవరణలు చేసే అధికారాలను కేంద్ర, రాష్ట్ర శాసన వేదికలకు వదిలిపెట్టడం జరిగింది... అయితే, అందుకు ఒక్క పరిమితి ఉంది - పార్లమెంటుకు చెందిన ఉభయ సభలూ దేనికదే సభలో హాజరైన మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది రాజ్యాంగ సవరణలను విధిగా ఓటింగ్ ద్వారా ఆమోదించి తీరాలి... అంతేగాదు, ముందు ముందు భావి పార్లమెంటు రాజ్యాంగ నిర్ణయ సభగా కలిసినప్పుడు ఆ పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీల సభ్యులుగా తమ చర్యల పట్ల పాక్షిక దృష్టితో వ్యవహరించగల అవకాశముంది; అప్పుడు వాళ్లు రాజ్యాంగంలోని ఏదో ఒక అధికరణ తమకు అడ్డు తగులుతున్నందున ఆ అధికరణకు పార్లమెంటు ద్వారా సవరణలు పొందడంలో విఫలమైనప్పుడు వారు పాక్షికంగానే వ్యవహరిస్తారు!’’ - డాక్టర్ అంబేద్కర్: ‘రాజ్యాంగ నిర్ణయ సభా చర్చలు’ (సంపుటి 7, పేజీ: 43-44). రాజ్యాంగ నిర్ణేత డాక్టర్ అంబేద్కర్ 1948-49లోనే ముందు ముందు రాజకీయ పార్టీలు రాజ్యాంగ లక్ష్యాలను ఎలా తమ స్వార్థపూరిత ప్రయోజనాలకు అనుకూలంగా నిర్వీర్యం చేస్తాయో పసికట్టి దేశ ప్రజలను దూరదృష్టితో హెచ్చరించిన ద్రష్ట! నేటి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అంబేద్కర్ అనుమానాలను రుజువు చేస్తూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యల ద్వారా పాక్షిక ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్నీ, రాజ్యాంగ సంస్థలనూ భ్రష్ఠు పట్టిస్తూ వచ్చిన తీరు మనకు తెలుసు. దేశంలోని ‘సమాఖ్య’ (ఫెడరల్) వ్యవస్థను కూడా అవమానించే స్థాయికి అవి చేరుకున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ - రాజ్యాంగంలోని 3వ అధికరణ అనే తెరచాటు నుంచి ఫెడరల్ వ్యవస్థ స్వరూప స్వభావాలకే విరుద్ధంగా కేంద్రమే ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ సంఘం సిఫార్సుల ఆధారంగా ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలను సహితం చీల్చడానికి ఈ రెండు పార్టీలూ వెనుకాడక పోవడం. అసలు రాజ్యాంగంలో ఆ ‘3వ అధికరణ’ పుట్టిన సందర్భంలోకి వారు తొంగిచూడలేదు. ముసాయిదా రాజ్యాంగం సిద్ధమవుతున్న సమయంలో అది వచ్చింది. బ్రిటిష్ వాళ్ల ‘విభజించి-పాలించే’ విధాన చట్రంలో 1935 నాటి వలస చట్టం (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్) ప్రకారం ఏర్పడిన ‘ప్రావిన్సెస్’గానూ, స్వదేశీ సంస్థానాలు, రాచరికాలు (నేటివ్ స్టేట్స్)గానూ దేశంలో ఆనాడు ద్వంద్వ పరిపాలన (1948-49) అమలులో ఉంది. నైజాం వంటి సంస్థానాధీశులు తమ ‘స్వతంత్ర’ ఇలాకాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి ‘ససేమిరా’ అంటున్న దుర్ముహూర్తాలవి! ఈ స్వదేశీ సంస్థానాలు ఉత్తరోత్తరా ‘కొరకురాని కొయ్యలవు’తాయేమోనని భావించి ఆ పరిణామాన్ని అరికట్టడం కోసం ‘3వ అధికరణ’ను పటిష్టం చేసారు. తద్వారా ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని లేదా రాష్ట్రాలను విడగొట్టడానికి, సరిహద్దుల్ని చెరిపివేసి వాటిని మరొక రాష్ట్రంలో కలపడానికి, సంస్థానాల, రాష్ట్రాల పేర్లు మార్చడానికీ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకూ హక్కు ఉందని చాటవలసివచ్చింది. అలా రాజ్యాంగంలో చొప్పించిన ఈ ప్రత్యేక అధికరణను వాడుకొని సంస్థానాల విలీనం తరువాత కూడా కేంద్రంలో అధికారం చెలాయించే పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం, ఓట్లు-సీట్లు పెంచుకోవడం కోసం రాష్ట్రాలను చీల్చడానికి శ్రీకారం చుట్టాయి. దేశ సమైక్యతకు, సంఘీభావానికి ప్రాథమిక పునాదులుగా ఉండాల్సిన రాష్ట్రాలను బలహీనపర్చి, ప్రతీ దానికీ కేంద్రంపై ఆధారపడి బతికే బానిస పరిస్థితుల్లోకి వాటిని నెడుతూ వచ్చాయి. రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాల పరిధులలోకి, ఆ రెండింటి ఉమ్మడి అధికారాల పరిధిలోకి వచ్చే మూడు జాబితాలను వేర్వేరుగా రూపొందించినప్పటికి తన జాబితా పరిధుల్ని దాటి కేంద్రం రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితాలలోని అంశాలలోకి దూరుతూ రాష్ట్ర ప్రభుత్వాలనూ ‘డూడూ బసవన్నలు’గా దిగజార్చుతూ వస్తోంది. ఇందుకు తొలి ఉదాహరణ - మెజారిటీలో ఉన్న కేరళలోని నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కాంగ్రెస్ నిష్కారణంగా కూల్చడం. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు: 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లనేరదన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు పర్యవసానంగా బ్రూట్ మెజారిటీ ఆసరాగా ఆమె తన పదవీ ప్రయోజనాల కోసం దేశంలో ‘ఎమర్జన్సీ’ని ప్రకటించి ప్రజాస్వామ్యాన్నీ, న్యాయవ్యవస్థ ఉనికినీ ప్రశ్నార్థకం చేయడం; రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని చుప్తాగా రద్దు చేయటం; న్యాయస్థానాలను బెదిరించ టం, బెదిరింపులకు లొంగని జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా లాంటి వారికి ప్రమోషన్లు నిలిపివేయటం ఇత్యాది చర్యలు. చివరికి దేశ రాష్ర్టపతిని రబ్బరు స్టాంపుగా మార్చుకోవటం! ఫెడరల్ వ్యవస్థలో ఒకరి పరిధుల్లోకి మరొకరు దూరకుండా ప్రభుత్వం, శాసన వేదిక, న్యాయవ్యవస్థల మధ్య పాలనాధికారాలను రాజ్యాంగం స్పష్టంగా విభజించినప్పటికీ నర్మగర్భంగా అలాంటి జోక్యానికి పాల్పడటానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు వెనుకాడలేదు! అసలు ఫెడరల్ వ్యవస్థనే ఆ రెండు పక్షాలూ అపహాస్యం చేశాయి, చేస్తున్నాయి. ‘‘ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థా రాజ్యాంగంలో అతి ముఖ్యమైన అంశాలు, అవి రెండూ, రాజ్యాంగం మౌలిక లక్షణాలలో అంతర్భాగం’’ అని జస్టిస్ సవంత్, జస్టిస్ జీవన్‌రెడ్డి 1977 లోను, 1994లోనూ సుప్రీం తీర్పుల్లో స్పష్టం చేశారని మరువరాదు (బొమ్మయ్ కేసులో)! జస్టిస్ జీవన్‌రెడ్డి ఇలా పేర్కొన్నారు: ‘‘మన రాజ్యాంగ పరిధుల్లో రాష్ట్రాలకన్నా కేంద్రానికి ఎక్కువ అధికారం ఉన్న మాట నిజమే. కానీ, దానర్థం రాష్ట్రాలనేవి కేంద్రాధికారానికి లోబడి ఉండే అనుబంధ సంస్థలని కాదు! రాష్ట్రాల అధికారాలను కేంద్రం దురాక్రమించలేదు. ఫెడరల్ వ్యవస్థ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే కాదు, అది సూత్రబద్ధమైన సువ్యవస్థ.’’ కొందరు వేర్పాటు వాదులు, కొందరు న్యాయవాదులూ కేంద్రం బిల్లు అనేది (తెలంగాణ బిల్లు ఏర్పాటు ప్రతిపాదన) నామమాత్రంగానే రాష్ట్రపతి నుంచి శాసనసభకు ఓటింగ్ ద్వారా ఆమోదం పొందడం కోసం గాక, ప్రస్తావన మాత్రంగా ‘రిఫర్’ కావడమే అసలు మౌలిక రాజ్యాంగ స్ఫూర్తి అని పొరబడుతున్నారు. 1955లో ‘3వ అధికరణ’కు 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరిగిన కుట్రపూరిత సవరణ పూర్వాపరాలు వీరికి తెలియనట్టుంది. 1955 రాజ్యంగ సవరణ చట్టం రావడానికి ముందటి ‘ప్రొవిజో’ ప్రకారం ఏ పార్లమెంటు ‘బిల్లు’ అయినా సరే దానిని రాష్ట్ర శాసనసభ ‘నిశ్చితాభిప్రాయాన్ని’ తెలుసుకోవడానికి రాష్ట్రపతికి నివేదించాలని ఉంది. ఇందుకు వాడిన పదం ‘ఎసర్‌టైన్.’ అంటే ‘నిశ్చితాభిప్రాయ’ ప్రకటన. అసెంబ్లీలో సభ్యుల ఓటింగ్ ద్వారానే అది స్పష్టపడుతుంది గాని సభ్యుల ఉపన్యాసాల ఊదర ద్వారా తేలదు! ఓటింగ్ ద్వారానే సభ వారి నిశ్చితాభిప్రాయం లేదా నిర్ణయం ప్రకటించడమనేదే ఆ ‘ఎసర్‌టైన్’ పదానికి అర్థం! ఆ కారణం వల్లనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అది తన అవకాశవాద స్వార్థ ప్రయోజనాలకు నష్టమని భావించి, ఆ పదాన్ని అర్థాంతరంగా మార్చేసి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని ‘రిఫరెన్స్’ అన్న పదాన్ని 1955 సవరణ ద్వారా చడీ చప్పుడు లేకుండా చేర్చింది! కనుకనే, శాసనసభ ‘అభిప్రాయాలు’ తెలుసుకోవడానికి రాష్ట్రపతి శాసనసభకు బిల్లును ‘రిఫర్’ చేయాలి గాని ఓటింగ్ తీసుకోవడానికి కాదు అనేది రుజువైపోయింది. ఆ ‘5వ సవరణ’ భరోసాతోనే కాంగ్రెస్ అధిష్టానంలోని తెలుగుజాతి వ్యతిరేకులు తెలుగు జాతిని చీల్చే పన్నాగానికి పాల్పడ్డారు! అలాగే 356వ అధికరణ పేరిట తనకు పడని ప్రతిపక్ష ప్రభుత్వాల్ని కూల్చడానికి రాష్ట్రపతి పాలనను యధేచ్ఛగా వినియోగించడానికి అలవాటుపడిన కాంగ్రెస్, బీజేపీ పాలకుల నోళ్లకీ, చేతులకూ సుప్రీంకోర్టు ‘బొమ్మాయ్ కేసు’లో తీర్పు ద్వారా కళ్లేలు వేయవలసి వచ్చింది! అలాగే విభజించబోయే రాష్ట్రాలను, వాటి సరిహద్దులు మార్చే విషయంలో ‘పార్లమెంటు అధికారాలకు రాజ్యాంగపరమైన పరిమితులు ఉన్నాయ’నీ, ఫెడరల్ వ్యవస్థలోని రాష్ట్రాల శాసనసభల ప్రతిపత్తిని తగ్గించే ఏక పక్ష చర్యను తీసుకోరాదనీ తప్పు డు వ్యాఖ్యానం చేయరాదనీ ప్రపంచ ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు డాక్టర్ దుర్గాదాస్ బసు హెచ్చరించాల్సి వచ్చింది! కాంగ్రెస్ నుంచి ఈ భావి పరిణామాలను ఆ మహా విద్యావేత్త ముందే ఊహించినట్టున్నారు. స్వాతంత్య్ర సిద్ధికి ముందు క్రిప్స్ మిషన్‌కు ఆయన కాంగ్రెస్ తరఫున సమర్పించిన నివేదికలో కూడా కేంద్రం వద్ద రక్షణ, విదేశాంగ, రెవెన్యూ శాఖలు మాత్రమే ఉండాలనీ మిగతా అధికారాలన్నీ రాష్ట్రాలకు సంక్రమింపచేయాలనీ సూచించి ఉంటారు. ఇప్పుడు ఆ దిశగానే ఈశాన్య భారత రాష్ట్రాలన్నీ కదలబారుతున్నాయి!