ప్రపంచంలోనే ఎత్తయిన కాంస్య విగ్రహం.. అతి పెద్ద ఎక్స్‌పీరియన్స్ సెంటర్
ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ ప్రాంగణం
బౌద్ధం, మయన్, ఈజిప్ట్ సంస్కృతుల సమ్మిళితంతో ‘కాలచక్ర మహా మండపం’
పునాదిలోతు వంద అడుగులు.. పీఠం 81 అడుగులు.. దానిపై 125 అడుగుల ‘సామాజిక న్యాయ మహా శిల్పం’
పలు దేశాల ఆహార పదార్థాలతోపాటు సంప్రదాయ వంటకాలు అందించేలా అతిపెద్ద ఫుడ్ కోర్టు
చిన్నారులకు అంబేడ్కరిజంపై అవగాహన కలి్పంచేలా చిల్డ్రన్ ప్లే ఏరియా
‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’ ప్రాంగణం అడుగడుగునా అద్భుతమైన ఆవిష్కరణలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడు అంబేడ్కర్ స్ఫూర్తి అంబరమంత ఎత్తున నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహా శిల్పం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. 18.81 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 206 అడుగుల ఎత్తయిన సామాజిక న్యాయ మహా శిల్పంతో పాటు ప్రతి నిర్మాణం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది.
రూ.404.35 కోట్లతో చేపట్టిన నిర్మాణంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు సందర్శకులకు గొప్ప అనుభూతిని పంచుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితమిచి్చన ఈ సామాజిక మహా శిల్పం, అంబేడ్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా రికార్డు సొంతం చేసుకున్నాయి. నాలుగేళ్లకు పైగా పట్టే ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏడాదిన్నరలోనే పూర్తి చేసినట్టు ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్(డీజెడ్‌ఎం) మహ్మద్ అబ్దుల్ రహీమ్ సాక్షికి తెలిపారు.
తుపాను... భూ కంపాలు తట్టుకునేలా ‘మహా స్థూపం’
125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహా స్థూపం (కోర్ వాల్) తుపాను గాలులు, భూ కంపాల తీవ్రతను తట్టుకునేలా డిజైన్ చేశారు. భూ కంపాలతో పాటు 250 కిలోమీటర్ల వేగంతో వీచే తుపాను గాలుల తీవ్రతను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. వంద అడుగుల లోతు పునాదితో పాటు 81 అడుగుల పీఠం, దానిపై 510 మెట్రిక్ టన్నుల బరువు, 125 అడుగుల ఎత్తుతో, విగ్రహాన్ని ఠీవిగా నిలబెట్టారు.
కాలచక్ర మహా మండపం
నీటి కొలను మధ్యలో కాలచక్ర మహా మండపం డిజైన్‌తో 81 అడుగుల ఎత్తు, 3,481 చదరపు అడుగుల వెడల్పుతో పీఠం నిరి్మంచారు. బౌద్ధం, మయన్, ఈజిప్ట్ నాగరికతలను సమ్మిళితం చేసి 50 డిగ్రీల వంపుతో ఇది ఉంటుంది. పింక్ శాండ్ స్టోన్ (ఇసుక రాయి)తో తాపడం చేయించారు. కలర్ స్టోన్ నిర్మాణం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు. పీఠం లోపల జి+2 అంతస్తులను ఐసాసిలెస్, ట్రెపీజియం ఆకారంలో నిరి్మంచారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లేందుకు రెండు లిఫ్ట్‌లున్నాయి.
అంబేడ్కర్ చైత్య
అంబేడ్కర్ చైత్య (బౌద్ధంలో చైత్య అంటే పవిత్ర క్షేత్రం) పేరుతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆ మహనీయుని జననం నుంచి మరణం వరకు అన్ని ప్రధాన ఘట్టాలు ఇందులో డిజిటల్ టెక్నాలజీతో ఆవిష్కరించారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఏదైనా ప్రశ్న అడిగితే అంబేడ్కర్ బదులిచి్చనట్టు అనుభూతిని కలిగించేలా వీడియో సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
‘విహార’ థియేటర్
గ్రౌండ్ ఫ్లోర్‌లో 75 మంది కూర్చొని సినిమా చూసేలా విహార థియేటర్‌ను నిరి్మంచారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుసుకునేందుకు, విజ్ఞానం, భౌగోళిక, సంస్కృతి, చరిత్ర వంటి అనేక అంశాలకు సంబంధించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. సినిమా టైమింగ్స్, టికెట్ ధర నిర్ణయించాల్సి ఉంది.
దక్షిణ భారత్‌తో అంబేడ్కర్ అనుబంధం
దక్షిణ భారత్‌తో అంబేడ్కర్ అనుబంధానికి సంబంధించిన ఘట్టాలతో మొదటి అంతస్తును తీర్చిదిద్దారు. దక్షిణ భారత దేశంలో అంబేడ్కర్ తిరిగిన ప్రదేశాలు, సభలు, సమావేశాలకు సంబంధించిన ఘట్టాలకు అద్దం పట్టేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. ఒక భాగంలో ఉన్న స్టడీ రూమ్‌లో ఆయన కూర్చున్న మైనపు బొమ్మను పెట్టారు. మరొక భాగంలో 50 మంది విద్యార్థులు కూర్చొని అంబేడ్కర్ జీవిత చరిత్రపై స్టడీ చేసేందుకు ఇంటరాక్షన్ క్లాస్ రూమ్, మరో భాగంలో లైబ్రరీ ఉన్నాయి.
మరెన్నో ప్రత్యేకతలు
ఈ ప్రాంగణంలో ధ్యాన మందిరం, కుడ్య చిత్రాలు, అతి పెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్, చి్రల్డన్ ప్లే ఏరియా, యువత కోసం మల్టీ ప్లే విభాగాలు, అవుట్‌డోర్ జిమ్, రెండు క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్(ఎరీనా), అతి పెద్ద ఫుడ్ కోర్ట్‌లను తీర్చిదిద్దారు. భూమిపై రెండు నెమలి (పికాక్) ఆకారంలో తీర్చిదిద్దిన పచ్చదనం, ఆగ్రాలోని మొఘల్ గార్డెన్ తరహాలో తీర్చిదిద్దిన పూలవనం, సాహిత్య, కళారూపాల ప్రదర్శనకు యాంఫీ థియేటర్, కిలో మీటరున్నర మేర కాలిబాట.
సందర్శన వేళలు: ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు.
ఎంట్రీ ఫీజు: రూ.5
యిర్రింకి ఉమా మహేశ్వరరావు, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment