కొవ్వూరు పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీనివాస స్నానఘట్టంలో భక్తులు ఏర్పాటు చేసుకున్న శివలింగాన్ని మంగళవారం పోలీసుల సహకారంతో అధికారులు తొలగించడం వివాదాస్పదం అయింది. చెప్పులతోనే సిబ్బంది విగ్రహాలు తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. విగ్రహాల తొలిగింపుపై ఆందోళనకు దిగిన స్థానికులకు వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన జిల్లా వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్‌ను, పలువురు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కి తరలించారు. సోమవారం అర్ధరాత్రే పోలీసుల సాయంతో అధికారులు విగ్రహాన్ని తొలగించడానికి వెళ్లారు. స్థానికులు ప్రతిçఘటించడంతో అధికారులు వెనుతిరిగారు.