removing
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
సాక్షి,విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసివేసేందుకు విశాఖ స్టీల్ యాజమాన్యం సిద్ధమైంది. తొలగించే కాంట్రాక్టు ఉద్యోగుల్లో సగం మంది నిర్వాసితులే ఉన్నారు. రేపటి నుంచి ఆన్ లైన్ పంచ్ స్టీల్ యాజమాన్యం నిలిపివేయనుంది.ఉద్యోగుల తొలగింపుపై సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలిసే ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగులు తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామన్న మాటను చంద్రబాబు, పవన్ నిల బెట్టుకోవాలి. నాయకులు చెప్పే మాటలకు స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదు’’ అని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
అన్నం పెట్టినోళ్లకు ఎసరు
ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా..కనీస వేతనం లేకపోయినా.. అప్పులు చేసి అన్నం తయారు చేశారు.. విద్యార్థుల కడుపునింపి ఆకలి తీర్చారు.. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే భోజనపథకం నిర్వాహకులను ఆదుకుంటాం అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు వారి పొట్టకొట్టేందుకు ఈ పథకాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టేస్తున్నాడు. ఫలితంగా వీరు రోడ్డున పడనున్నారు. దీనిపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డక్కిలి (నెల్లూరు): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజనం అందిస్తున్న నిర్వాహకులను ఒక్కసారిగా తొలగించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన జీఓలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక అధికారులకు చేరాయి. 2018 సెప్టెంబర్ 15 నుంచి మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు గత నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా అందుకు సంబంధించిన విధి విధానాలతో అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఎలాంటి ముందుస్తు నోటీసులు ఇవ్వకుండానే ఒక్కసారిగా మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పని చేస్తున్న తమని రోడ్డున పడేస్తే ఎలా, ఇన్నేళ్లుగా కష్టపడి చేసిన దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఫలం ఇదేనా అంటూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ కార్మికులు మండిపడుతున్నారు. జీఓ విడుదల ఇప్పటికే జిల్లాలోని ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం, గూడూరు, నెల్లూరుటౌన్లలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల పరం చేసింది. జిల్లాలోని మరో 19 మండలాల్లోని ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్ సంస్థకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులకు, స్థానిక ఎంఈఓ కార్యాలయాలకు ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పైవేట్ సంస్థకు ఇవ్వడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి కోల్పోతున్న మహిళలు జిల్లాలో వెంకటాచలం, నాయుడుపేట, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లోని 19 మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఢిల్లీకి చెందిన నవ ప్రయాస్కు అప్పగించింది. డక్కిలి మండలంలో 71 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 60 ప్రాథమిక, 5 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి 70 మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలలో 123 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరంతా సెప్టెంబర్ నెల నుంచి ఉపాధి కోల్పోనున్నారు. నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుసుకొన్న నిర్వాహకులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది నుంచే.. గతేడాది మొదటి దశగా జిల్లాలో ముత్తుకూరు, ఇందుకూరుపేట, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. నెల్లూరు టౌన్లో ఇస్కాన్ సంస్థకు అప్పగించారు. అయితే రెండో విడతగా నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, దొరవారిసత్రం, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, కావలి, కావలి రూరల్, బోగోలు, జలదంకి, కలిగిరి, ఆత్మకూరు, ఏఎస్‌పేట, అనంతసాగరం, సంగం మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. మొదటి విడతగా మధ్యాహ్న భోజన నిర్వహణను పొందిన సంస్థలు నిర్వహణ వ్యవహారంలో ఆదిలోనే కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా యి. ఉదయం 10 గంటలకు తయారు చేసిన అన్నం, కూరలను మధ్యాహ్నానికి పాఠశాలలకు చేరవేయడంతో విద్యార్థులు తినేందుకు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం తాజాగా జిల్లాలో 19 మండలాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసి పాఠశాలలకు చేరవేయడం సాధ్య కాదనే అభిప్రాయం తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. వేళకు అందేనా.. పాఠశాల ప్రాంగణంలోనే మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి వేడిగా విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి రూ.కోట్లు ఖర్చు చేసి పాఠశాలల ప్రాంగణాల్లోనే వంట గదులు నిర్మించి గ్యాస్ పంపిణీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ పథకం నిర్వహణను పైవేట్ సంస్థకు అప్పగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో విడుదల చేయడంతో విద్యార్థులకు భోజనం వేళకు అందుతుందా అనే సందేహ వ్యక్తమవుతోంది. స్థానిక ఏజెన్సీల పాత్ర నామమాత్రం ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న స్థానిక ఏజెన్సీలు నామమాత్రంగా మిగలనున్నాయి. ఈ ఏజెన్సీల ఆధారంగా ప్రతి రోజూ ముగ్గురు ఉపాధి పొందేవారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన జీఓతో వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆహారం వడ్డించడం, పాఠశాలలను శుభ్రం చేయడం, విద్యార్థుల ఆలనాపాలనా చూడడం వంటి పనులకే పరిమితం కావాల్సిఉంది. అయితే నిర్వాహకులకు మాత్రమే నెలకు రూ.1000 ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలోనే భోజనం తయారీ మంచిది పాఠశాల ప్రాంగణంలోనే వంటను తయారు చేసి విద్యార్థులకు అందిస్తే బాగుంటుంది. ఎక్కడో తయారు చేసి పాఠశాలకు తీసుకురావడం వల్ల విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుంది. స్థానికంగా తయారు చేస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుంది. – గువ్వల రాధ, మహసముద్రం, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు ఎంతో కాలంగా పనిచేస్తున్నాం 2003 నుంచి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నాం. కనీస వేతనం లేకపోయినా కష్టపడి పనిచేసిన నిర్వాహకులను తొలగించడం అన్యాయం. రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఏజీన్సీల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. – కట్లా శివరావమ్మ, ఏజెన్సీ నిర్వాహకురాలు, ఆల్తూరుపాడు -
సాక్షర భారత్‌కు మంగళం
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యంతో సాక్షరభారత్ ప్రాజెక్టును ప్రారంభించారు. సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా ప్రారంభించిన సాక్షరభారత్ పథకంలో పని చేస్తున్న కోఆర్డినేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఏడాది కాలంలో సాక్షర భారత్ కోఆర్డినేటర్లను అనేక కార్యక్రమాలలో ఉపయోగించుకున్నారు. వీరికి 8 నెలల జీతాల బకాయిలు అందాల్సి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తున్న సాక్షర భారత్ కోఆర్డినేటర్లను తొలగిస్తు న్నట్లు వయోజన విద్యా సంచాలకులకు శుక్రవారం ఉత్తర్వులు అందాయి. జిల్లా వ్యాప్తంగా 2010 సెప్టెంబర్ 8న సాక్షర భారత్ ప్రాజెక్టు ప్రారంభమైంది. జిల్లాలోని 789 పంచాయతీల్లో 1580 మంది గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. మండలానికి ఒకరు చొప్పున 50 మంది మండల కోఆర్డినేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరిని మార్చి 31 నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో జీతాల విషయం ఎక్కడా పొందపరచలేదు. కోఆర్డినేటర్లు గ్రామాల్లోని వయోజనులను అక్షరాస్యులుగా చేయడంలో వీరు యజ్ఞంలా పనిచేశారు. సాక్షర భారత్ మొదటి నుంచి చివరి దశ వరకు మందకొడిగా సాగింది. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్ష్యరాస్యతలో జిల్లా వెనుకబడిఉంది. అయితే ప్రభుత్వం సాక్షరభారత్ వ్యవస్థను రద్దు చేసింది. సామగ్రిని సమీప ప్రభుత్వ ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు అందించాలని జీవోలో ప్రస్తావించారు. రాత్రి వేళ అక్షరాలు నేర్పించడం, ఉదయం పత్రికలు, కథల పుస్తకాలు చదివించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.. మండల స్థాయిలో ఒక కోఆర్డినేటర్‌ను, గ్రామ స్థాయిలో మరో కోఆర్డినేటర్లను నియమించారు. మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ.6000 వేతనం, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లకు రూ. 2వేలు చెల్లించేవారు. అలాగే కేంద్రాల నిర్వహణకు నెలకు రూ.300 చొప్పున మంజూరు చేసేవారు. వయోజనులకు అక్షరాలు నేర్పిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కోఆర్డినేటర్లను ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే సాక్షర భారత్ కోఆర్డినేటర్లతో పనులు చేయించుకొని 10 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. గ్రామాల్లో, మండలాల్లో పెన్షన్లు, తదితర పనుల్లో పనులు చేయించుకొని మా పొట్ట కొట్టారు. బాబు వస్తే జాబు వస్తుందనుకొన్నాం, కానీ బాబు వస్తే ఉన్న జాబు ఊడిపోతుందని ఇప్పుడు అర్థమైంది. ప్రభుత్వం మాకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలి. –బాబు సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ -
ముళ్లపొదల తొలగింపు
గద్వాల క్రైం : నివాసగృహాల మధ్య ఖాళీ ప్లాట్లు.. అందులో పిచ్చి మొక్కలు.. దట్టంగా ముళ్లపొదలు.. ఇలా గృహనివాసాల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ప్లాటు యజమానికి చెప్పినా పట్టించుకోపోవడంతో పట్టణంలో హౌసింగ్ బోర్డు, రెండో రైల్వే గేట్, బీసీ కాలనీ, గంజిపేట, చింతలపేట తదితర కాలనీలో ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ∙ప్రజల రక్షణ, శాంతిభద్రతల నిమిత్తం గద్వాల పోలీసులు వినూత్నంగా వివిధ కాలనీలో ఖాళీ స్థలం, ప్లాట్లలో మొలిచిన ముళ్లపొదల తొలగింపుపై దృష్టిసారించారు. వివిధ కాలనీల్లో ఖాళీ ప్లాట్లు ఉన్న వివరాలు సేకరించి ముళ్లపొదలు తొలగించాల్సిందిగా యా జమానులకు తెలియజేస్తున్నారు. వారు చెప్పినా.. యాజమానులు తొలగించని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. జేసీబీల సాయంతో పట్టణంలోని అన్నికాలనీల్లో ముళ్లపొదల తొలగింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా ఆ ప్లాట్లలో ముళ్లపొదలు తొలగించని వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాలనీ ప్రజల శ్రేయస్సు దిశగా.. పట్టణంలో వివిధ కాలనీలో ముళ్లపొదలను తొలగించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా గద్వాల మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పట్టణంలో ఎటు చూసినా చెత్తచెదారం, ముళ్లపొదలతో నిండిపోయింది. నోటీసులు జారీ చేస్తున్నాం పట్టణంలోని ఖాళీ స్థలాల్లో ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఉండటంతో అనుకోని సంఘటనలు జరిగిన సందర్భంలో ముళ్లపొదలలో దాగి తప్పించుకునే వీలుంటుంది. ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉంటున్నాయి. పలు సమస్యలు ఉత్పన్నమయే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఖాళీ స్థలాల్లో ఏర్పడిన ముళ్లపొదలు తొలగిస్తున్నాం. ఇప్పటికే పలువురు యజమానులకు నోటీసులు జారీ చేశాం. ఆదేశాలను బేకాతరు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ -
కార్తీకమాసంలో శివుడికి పరాభవం
-
అపచారం.. అహంకారం
కార్తీక మాసంలో హిందువులు శివారాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి పరమశివుడికి కార్తీక మాసంలోనే పరాభవం ఎదురైంది. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ఇలాకాలో ఇది జరిగింది. కొవ్వూరు రూరల్: కొవ్వూరు పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీనివాస స్నానఘట్టంలో భక్తులు ఏర్పాటు చేసుకున్న శివలింగాన్ని మంగళవారం పోలీసుల సహకారంతో అధికారులు తొలగించడం వివాదాస్పదం అయింది. చెప్పులతోనే సిబ్బంది విగ్రహాలు తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. విగ్రహాల తొలిగింపుపై ఆందోళనకు దిగిన స్థానికులకు వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లిన జిల్లా వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పరిమి హరిచరణ్‌ను, పలువురు స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కి తరలించారు. సోమవారం అర్ధరాత్రే పోలీసుల సాయంతో అధికారులు విగ్రహాన్ని తొలగించడానికి వెళ్లారు. స్థానికులు ప్రతిçఘటించడంతో అధికారులు వెనుతిరిగారు. మంగళవారం గణపతి హోమం నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరుణంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి బలవంతంగా శివలింగాన్ని, గణపతి, నంది విగ్రహాలతో పాటు, శివుడికి ప్రార్థన చేసే రావణబ్రహ్మ విగ్రహాలను తొలగించడానికి పూనుకున్నారు. తొలగించిన విగ్రహాలను వ్యాన్‌లో ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయా నికి తరలించారు. రావణబ్రహ్మా విగ్రహాన్ని మాత్రం పూర్తిగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు అడ్డుకున్నారు. నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దాంతో వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో సుమారు మూడు గంటల పాటు స్టేషన్ ఎదుటే ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి మొయిన్ రోడ్డు మీదుగా ఫ్యాక్టరీ రోడ్డు నుంచి సంఘటనా స్థలం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పట్టాభిరామారావు (అబ్బులు)ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. దీంతో నాయకులు ఆంధ్రాషుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వ తీరుపై నాయకులు తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరించారని అన్నారు. ఆర్డీవోని కలిసి సోమవారం వినతిప్రతం అందజేశామని, కనీసం పరిగణనలోకి తీసుకోకుండా విగ్రహం తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్తీక మాసంలో శివలింగం, గణపతి, నందీశ్వరుడి విగ్రహాలను తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. టూరిజం పేరుతో మంత్రి, అతని అనుయాయులు ఆక్రమించా లనుకున్న 9 ఎకరాల స్థలంలో కొద్ది సెంట్ల స్థలంలో ఉన్న శివలింగమే అడ్డు వచ్చిందా అని ప్రశ్నించారు. తక్షణమే తొలగించిన విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేయాలని డిమాండు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ మాట్లాడుతూ పవిత్రమైన గోదావరి తీరంలో 2003 పుష్కరాల్లో దొరికిన అతి పురాతన శివలింగాన్ని భక్తులు ప్రతిష్టించుకుంటే, అధికారులు తొలగించడం దారుణమన్నారు. టూరిజం అభివృద్ధి పేరుతో భక్తుల మనోభావాలను కాలరాయడం సమజసం కాదన్నారు. దళిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయరావు మాట్లాడుతూ హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా ఎక్సైజ్‌శాఖ మంత్రి తీసుకునే నిర్ణయాలకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకవద్దని హితవు పలికారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నీటిపారుదల శాఖ భూమిని కబ్జా చేసేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మండల పార్టీ అధ్యక్షుడు గురుజు బాలమురళీకృష్ణ, నాయకుడు ముదునూరి నాగరాజు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. శ్రీనివాసపురం స్నానఘట్టానికి అడ్దంగా మట్టి గుట్టలు పోయడంపై స్ధానికులు మండిపడ్డారు. మత్య్సకారులతో పాటు స్థానికులు రోడ్డుపైకి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సుమారు గంటసేపు రోడ్డుపైనే వనితతో పాటు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసు అధికారుల సూచనలతో స్నానఘట్టానికి అడ్డుగా వేసిన మట్టి గుట్టలు తొలగించడంతో పరిస్థితి చక్కబడింది. బుధవారం నీటిపారుదల శాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని పట్టణ సీఐ ఎస్బీవీ శుభాకర్ హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు. పార్టీ జిల్లా కార్యదర్శులు కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, కాకర్ల నారాయుడు, చాగల్లు, తాళ్లపూడి మండల పార్టీ అధ్యక్షులు కొఠారు అశోక్‌బాబా, కుంటముక్కల కేశవనారాయణ, పట్టణ అధ్యక్షుడు రుత్తల ఉదయ భాస్కరరావు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి లకంసాని శ్రీనివాసరావు, కార్యదర్శి ముళ్లపూడి కాశీవిశ్వనాధ్, జిల్లా రైతు విభాగం నాయకులు గన్నిన రత్నాజీ, నాయకులు వర్రే శ్రీనివాస్, వరిగేటి సుధాకర్, కొయ్యల భాస్కరరావు, నగళ్లపాటి శ్రీనివాస్, చిలంకుర్తి బాబి లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. -
లాఠీ దాష్టీకం
దివీస్ కోసం పోలీసుల అతి.. అట్టుడికిన కోన తీరం బందోబస్తుతో రైతుల భూముల్లో చెట్ల తొలగింపు కోర్టు స్టే ఉన్న, అమ్మని భూముల్లో పనులపై ప్రజల ఆగ్రహం గ్రామాల్లో మహిళలపై దౌర్జన్యం అడ్డుకున్న 100 మంది అరెస్టు బాధితులను విడిపించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తొండంగి : జీడిచెట్ల వద్ద పిక్కలు ఏరుకుంటూ, గొర్రెల మందలను కాచుకుంటూ జీవనం సాగించే కోనతీరంలోని అమాయక ప్రజలపై కాలుష్య దివీస్ పరిశ్రమ కోసం ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ స్థాపన కోసం కోనఫారెస్ట్ భూములు 670 ఎకరాలను కేటాయించింది. ఈ భూములను తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులు, బాధిత గ్రామాల ప్రజల కాలుష్య పరిశ్రమ స్థాపనను, భూముల కేటాయింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేసే పోరుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం.ఎల్), జనశక్తి, ఏపీ వ్యవసాయరైతు కూలీసంఘం, సీఐటీయూ, ఐద్వా మహిళాసంఘం తదితర సంఘాలు, పార్టీల మద్దతునిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పలుమార్లు రైతులు ప్రభుత్వానికి అప్పగించని భూముల్లో బలవంతంగా చెట్లను తొలగించబోతుంటే బాధిత గ్రామాల ప్రజలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. శుక్రవారం కూడా రెవెన్యూ అధికారులు భారీగా జేసీబీలు, కోత యంత్రాలతో చెట్లను తొలగించారు. విషయం తెలుసుకున్నతాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట తదితర గ్రామాలకు చెందిన వారంతా తమ భూముల్లోకి వెళ్లి చెట్లుతొలగిస్తున్న జేసీబీ, కోత యంత్రాలను నిలుపుదల చేయించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి అరెస్టు చేశారు. తాటియాకులపాలెం రైతు సన్ని సత్యనారాయణను పోలీసులు దారుణంగా కొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమారు 100 మందిని కోటనందూరు, అన్నవరం, ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దివీస్ కోసం బలవంతపు భూసేకరణకు చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో కోన తీరప్రాంతంలో బాధిత గ్రామాల వద్ద సుమారు వెయ్యిమంది పోలీసులను మోహరించారు. మానవత్వాన్ని మరిచి.. పోలీసులు మానవత్వాన్ని మరచి బహిర్భూమికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలు, రోడ్డుకు సమీపంలో చదువుకుంటున్న విద్యార్థులు, యువతులు, బీచ్‌రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిపై ధాషీ్టకాన్ని ప్రదర్శించారు. పంపాదిపేటలో బీచ్‌రోడ్డుకు ఆవల ఉన్న పశువుల మకాంలోకి, ఇళ్ల వద్దకు వెళ్తున్న మహిళలను అరెస్టు చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ జీపుల్లో ఎక్కించారు. బాధితులకు అండగా ఎమ్మెల్యే రాజా అరెస్టుల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా బాధిత ప్రజలకు అండగా నిలిచారు. అరెస్టు సంఘటనలు తెలిసిన వెంటనే ఆయన కొత్తపాకలు సమీపంలో దివీస్‌కు ప్రతిపాదిత భూములు వద్దకు వెళ్లారు. దీంతో బాధిత రైతులంతా అక్కడకు చేరుకున్నారు. హైకొర్టు స్టేటస్కో విధించిన భూముల్లోనూ పనులు నిర్వహించారని, అడ్డువచ్చిన ప్రతి ఒక్కరినీ కొట్టి అరెస్టు చేశారని రైతులు ఎమ్మెల్యే వద్ద వాపోయారు. దీంతో అక్కడ ఉన్న డీఎస్పీ రాజశేఖర్‌తో ఎమ్మెల్యే మాట్లాడారు. దివీస్‌కు ప్రతిపాదించిన భూముల్లో వాస్తవంగా రైతుల నుంచి కొనుగోలు చేసినది ఎంత, అమ్మని భూమి ఎంత ఉందో రెవెన్యూ అధికారులు గుర్తించి, అవసరమైతే సర్వే నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజా అన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలని డీఎస్పీని కోరారు. లేదంటే వారి తరఫున ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. అరెస్టయినవారిని విడిపించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అన్నవరం పోలీస్‌స్టేషన్‌కు 32 మందిని, కోటనందూరు 66 మందిని, ఒంటిమామిడిపోలీస్స్టేషన్కు ఇద్దరిని వాహనాల్లో తరలించారు. డీఎస్పీతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే రాజా వారిని అక్కడి నుంచి బయటకు పంపించారు. -
బలప్రయోగం చేస్తే ప్రాణత్యాగానికీ సిద్ధం
దివీస్ బాధిత గ్రామాల ప్రజల హెచ్చరిక కోన భూముల్లో చెట్లు తొలగింపునకు యత్నం యంత్రాలతో భూముల్లోకి ప్రవేశించిన అధికారులు సమైక్యంగా అడ్డుకున్న మూడు గ్రామాల ప్రజలు తొండంగి : దివీస్ ల్యాబొరేటరీస్ కోసం తమ భూముల్ని బలప్రయోగంతో లాక్కోజూస్తే ప్రాణత్యాగాలకైనా వెనుకాడబోమని బాధిత గ్రామాల ప్రజలు స్పష్టం చే శారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను నేడు కాలుష్య కారక పరిశ్రమకు ప్రభుత్వం బలవంతంగా లాక్కొంటోందని ఆక్రోశించారు. బుధవారం మండలంలో ప్రభుత్వం దివీస్‌కు కేటాయించిన భూముల్లో చెట్ల తొలగింపునకు అధికారులు పోలీసు బందోబస్తుతో జేసీబీలు, కటింగ్ యంత్రాలు, ట్రాక్టర్లతో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం బాధిత గ్రామాల ప్రజలకు విషయం తెలియడంతో పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం గ్రామాలకు చెందిన సుమారు 400 మంది కలసికట్టుగా భూముల్లోకి వెళ్లారు. ప్రభుత్వానికి అమ్మని భూముల్లో, హైకోర్టు సేకరణను వ్యతిరేకించిన భూముల్లో పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అధికారుల మాటలు విని వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని జనమంతా జేసీబీలు, కోత యంత్రాల సామగ్రి తెచ్చిన సిబ్బందిని హెచ్చరించారు. మరోసారి యంత్రాలతో భూముల్లోకి వస్తే ఊరుకోబోమన్నారు. దీంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరచూ రైతుల భూముల్లోకి ప్రవేశించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదేవిధంగా చెట్లను తొలగించడంతో ఆందోళన చేశామన్నారు. ప్రభుత్వం తమ భూముల వ్యవహారంపై మొండి వైఖరి వీడాలని కోరారు. పనులు పరిశీలించేందుకు వెళ్లామంతే: తహసీల్దార్ గతంలో ప్రభుత్వం దివీస్‌కు భూములు అప్పగించిన నేపథ్యంలో ఆ సంస్థ అక్కడ ఏ పనులు చేస్తున్నదీ పరిశీలించేందుకు వెళ్లామని తహశీల్దార్ టి.వి.సూర్యనారాయణ తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన భూముల్లోకి వెళ్లలేదని చెప్పుకొచ్చారు. -
తెలంగాణలో MPTC, ZPTCలకు మంగళం
-
గుట్టువిప్పడంలో మొనగాళ్లు
సోషల్ మీడియాలో కలుసుకున్న 14 మంది ఐటీ విద్యార్థులు సైబర్ నేరాల గుట్టు విప్పడంలో సిద్ధహస్తులు వెబ్సైట్ల ర్యాంకింగ్ మెరుగు పరిచే ప్రయత్నం ఏయూక్యాంపస్: వారంతా రెండు పదుల వయసు కలిగిన యువకులు. సాంకేతిక ప్రపంచంలో పోటీపడే మనస్తత్వం. ఉపాధిని వెతుక్కోవడమనే పదాన్ని పక్కన పెట్టేశారు. ఉపాధిని అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏయూ, గీతం, జేఎన్‌టియూ విద్యా సంస్థలకు చెందిన 14 మంది విద్యార్థులు కలసి ఒక సంస్థను స్థాపించారు. తమ మేథస్సునే పెట్టుబడిగా పెట్టి సాంకేతిక ప్రపంచంలో రారాజులుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల గుట్టు విప్పడంలో వీరు సిద్ధహస్తులు. స్టార్టప్‌గా వీరు ప్రారంభించిన ప్రయాణం ఒక్కో మెట్టు ఎక్కుతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సెక్యూరిటీ రీసెర్చర్స్ లిస్ట్‌లో స్థానం సాధించారు. కొన్ని సందర్భాలలో పోలీసులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించారు. సాంకేతికతను మంచికోసం వినియోగిస్తూ సమాజానికి ఉపయుక్తంగా నిలుస్తున్న ఈ యువకుల ప్రస్థానం మీ కోసం. మూడు విభాగాలు.... ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఐటీ విభాగాలకు చెందిన 14 మంది విద్యార్థులు సోషల్ మీడియా సహకారంతో కలుసుకున్నారు. వివిధ సదస్సుల్లో పరిచయం అయిన వీరంతా కలసి ఒక స్టార్టప్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. 2013 జూన్‌లో www.cyberaon.com వెబ్‌సైట్‌ను స్థాపించారు. ప్రాథమికంగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం, హ్యాకింగ్ జరిగిన వెంటనే సంబంధిత సమాచారం పొందడం వంటి సేవలు అందించేవారు. 2014 వరకు వీరు ఇతరుల వెబ్సైట్లను పటిష్ట పరయడం చేశారు. తరువాతి కాలంలో వెబ్సైట్ డెవలప్మెంట్, బ్లాగ్ల ఏర్పాటు, నిర్వహణ జరిపారు. అదే సమయంలో సెక్యూరిటీ సంబంధిత సదస్సుల్లో పాల్గొంటూ నూతన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేశారు. సమాంతరంగా వివిధ ప్రముఖ వెబ్సైట్లలో డెవలప్మెంట్ లోపాలను గుర్తించి ఆయా సంస్థలకు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు. విభిన్న సేవలు సెర్చ్ ఇంజెన్ ఆప్టిమైజేషన్(ఎస్ఇఓ) చేయడం ద్వారా వెబ్సైట్ల ర్యాంకింగ్ మెరుగు పరిచే ప్రయత్నం చేశారు. పూర్తిస్థాయి సేవలు 2015లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 30కి పైగా విభిన్న సంస్థల వెబ్సైట్లను తీర్చిదిద్దారు. కార్పొరేట్ సంస్థలకు వెబ్సెక్యూరిటీ, ఎస్ఈఓలను సమకూర్చే అవకాశాలు వచ్చాయి. ప్రధాన వెబ్సైట్లలో పొందుపరచిన సమాచారం హ్యాక్ అవడం, మార్పుకు గురవకుండా చూడటం ఎంతో ప్రధానం. వెబ్సైట్లో పొందుపరచిన సమాచారం(డేటా)కు పూర్తి రక్షణ కల్పించే వ్యవస్థలను వీరు తీర్చిదిద్దుతున్నారు. ప్రమోషన్ అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంగా నిలుస్తున్న సోషల్ మార్కెటింగ్‌ను వీరు పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నారు. తాము వినియోగిస్తున్న వెబ్సైట్లు, సోషల్ నెట్‌వర్కింగ్‌ల మధ్య అనుసంధానం చేయడం, ప్రకటనల వీడియోలను ఉంచడం వంటి సేవలు అందిస్తూ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకటన రంగంలో విస్తరించిన సేవలు వ్యాపారానికి సంజీవనిగా నిలిచే అడ్వటైజింగ్ రంగంలోను వీరు తమ సేవలు విస్తరించారు. అత్యంత అధునాతన సాంకేతిక ఉపకరణాలు, డ్రోన్లు వినియోగించి వీడియోలను తయారు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రమోషనల్ వీడియోలో తయారు చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా తమ సాంకేతిక ప్రతిభతో ఆయా వీడియోలను సామాజిక మాధ్యమాలలో ఉంచుతూ ప్రచారం కూడా కల్పిస్తున్నారు. రెండు విభిన్న సేవలు ఒకే వేదికగా అందించడంతో వ్యాపార సంస్థలు సైతం వీరికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. వెబ్ సెక్యూరిటీ భారతీయ వెబ్సైట్లను పూర్తి రక్షణతో తీర్చిదిద్దాలనేని వీరి లక్ష్యం. వివిధ వెబ్సైట్లో అంతర్గత లోపాలను గుర్తించి వారికి తెలియజేయడం వలన వీరికి రూ.20 వేల డాలర్ల మూలధనం సమకూర్చుకున్నారు. తమ వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే దిశగా నూతన రక్షణ వ్యవస్థను తయారు చేస్తున్నారు. దీని సహాయంతో 90 శాతంపైగా వెబ్‌సైట్‌కు రక్షణ లభిస్తుంది. దీనిని శతశాతం రక్షణ చేసే దిశగా వీరు ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ కల్పించే దిశగా అవగాహన సదస్సులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు కళాశాల యాజమాన్యాలను సంప్రదించి అనుమతులు పొందారు. సైబర్ నేరగాళ్లను, మోసాలను నియంత్రించడంలో అవసరమైన సహకారాన్ని అందించడానికి సంసిద్ధత వ్యక్త చేశారు. ఈ బందంలో కొదరు దూర ప్రాంతాలలో ఉంటూ సంస్థ సేవల్లో పాలుపంచుకోవడం విశేషం. సెక్యూరిటీ లక్ష్యం.... సాంకేతిక విస్తరిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో సెక్యూరిటీ సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటికి పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో సేవలు అందించే సంస్థగా అభివద్ధి చేస్తున్నాం. ఆలోచలను పెట్టుబడిగా పెడుతున్నాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. –మహ్మద్ అజారుద్దీన్ సేవలే ఆదాయాన్ని అందిస్తున్నాయి సంస్థ నిర్వహణకు అవసరమైన నిధులు, నిర్వహణ ఖర్చులకు మేము అందించే సేవల నుంచి ఆదాయం లభిస్తోంది. అదే విధంగా గూగుల్ యాడ్స్సెన్స్ నుంచి కొంత ఆదాయం సమకూరుతోంది. వీటి సహయంతో సంస్థను విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం. –చింతల శ్రీనివాస్, సీటీవో -
కాలుష్య కారకులకు భారీ జరిమానా..!
న్యూఢిల్లీః రాజధాని నగరంలో కాలుష్య నివారణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరో అడుగు ముందుకేసింది. కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతున్ననగరంలో ఇకపై ధ్వని కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకోనుంది. సైలెన్సర్ లేని వాహనాలు నడిపేవారిపై ఆంక్షలు విధించి, కాలుష్య కారకులకు 5000 రూపాయల జరిమానా విధించనుంది. హస్తినలో వాయు కాలుష్యమే కాదు, ధ్వని కాలుష్యం కూడ ఎక్కువేనని గుర్తించిన ఎన్జీటీ.. కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై కొరడా ఝుళిపించనుంది. సైలెన్సర్ లేని వాహనాలను నడుపుతూ, నగరంలో తీవ్ర శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తున్న వారిపై 5000 వేల రూపాయలు జరిమానా వేయాలని ప్రకటించింది. ఎన్జీటీ ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. భరించరాని, నిబంధనలకు విరుద్ధమైన ధ్వని కాలుష్యాన్ని సృష్టించేవారిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం కింద చలాన్స్ మరియు పెనాల్టీలు విధించినట్లుగానే పర్యావరణ కాలుష్యాన్ని సృష్టించే నేరస్థులు 'పొల్యూటర్ పేస్' (కాలుష్య కారకులు) ఆధారంగా 5000 రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ ఎం ఎస్ నంబియార్ దర్శకత్వంతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే వాతావరణ పరిహారాన్ని ప్రత్యేక ఖాతాలో జమచేయాలని ట్రాఫిక్ పోలీసులకు గ్రీన్ ప్యానెల్ సూచించింది. నేరస్థులకు నోటీసులు జారీ చేయడంలో ఎన్జీటీని సంప్రదించేందుకు ట్రాఫిక్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. భారీ శబ్దం వచ్చే హారన్స్ తీవ్ర శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తాయన్న ట్రిబ్యునల్.. వాటి వాడకంపై దేశరాజధానిలో నిషేధం విధించింది. వాహనాల్లో హారన్స్ నుంచి వచ్చే శబ్దం కాలుష్యానికి ప్రధాన సమస్య అని, ముఖ్యంగా ఢిల్లీలో ట్రక్కు డ్రైవర్ల వంటివారు మితిమీరి హారన్ మోగించడంతో పాటు, డిటిసి బస్సులతో వచ్చే శబ్దం వల్ల కూడా నగరంలో కాలుష్యం తీవ్రమౌతోందని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ అధికారులు ఈ కోణంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంచ్ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి, నగరంలో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించింది.