
ప్రతీకాత్మక చిత్రం
బాగేపల్లి : బాగేపల్లి తాలుకాలోని సీగలపల్లిలో లభించిన విగ్రహాల ఘటన కొత్త మలుపు తిరిగింది. ఈ విగ్రహాలకు ఎలాంటి చరిత్ర లేదని, ఈ విగ్రహాలను ఇటీవల తయారు చేసి పురాతన విగ్రహాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారని అధికారులు తెలిపారు. బాలుడికి కలలో దేవుడు కనిపించి పొలంలో విగ్రహాలు ఉన్నాయని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈమేరకు పొలానికి వెళ్లి చూడగా పంచముఖి అంజనేయ విగ్రహం, చౌడేశ్వరి విగ్రహాలు కనిపించాయి.
దీంతో ప్రజలు పూజలు చేసి జాతరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విషయం తహసీల్దార్ దృష్టికి వెళ్లగా ఆయన పురావస్తు శాఖ అధికారులను పంపారు. వారు వచ్చి పరిశీలించగా పురాతన విగ్రహాలు కాదని, ఇటీవల తయారైనట్లు నిర్ధారించారు. అక్కడ ఎలాంటి పూజలు, జాతరలు చేయవద్దని ఆయన సూచించారు.