విగ్రహాల తొలగింపు యోచన రెచ్చగొట్టడమే: కిషన్‌రెడ్డి | Thought provoking removal of statues: Kishan Reddy | Sakshi
Sakshi News home page

విగ్రహాల తొలగింపు యోచన రెచ్చగొట్టడమే: కిషన్‌రెడ్డి

Published Tue, Sep 30 2014 2:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

విగ్రహాల తొలగింపు యోచన రెచ్చగొట్టడమే: కిషన్‌రెడ్డి - Sakshi

విగ్రహాల తొలగింపు యోచన రెచ్చగొట్టడమే: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రాప్రాంత మహనీయుల విగ్రహాలను తొలగించాలనే యోచన సరికాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోవువారం ఆయున మీడియూతో వూట్లాడుతూ అది తెలంగాణ  సీఎం కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణికి నిదర్శనమన్నారు. తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టేందుకు అక్కడ బోలెడంత చోటుందని, అలాంటప్పుడు ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలను తొలగించాలని యోచించటం సరికాదని కేసీఆర్‌కు హితవు పలికారు.

ఆంధ్రావారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తూ ఆ ప్రాంతం వారి విగ్రహాలు ఉండటంలో తప్పేంటని ప్రశ్నిం చారు. ఆంధ్రాలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్న తరుణంలో తెలంగాణ కరెంటు కోతలతో అల్లాడుతోందని,  పరిస్థితిని చక్కదిద్దాలన్న ఆలోచన సీఎంకు లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement