ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తోంది: కిషన్‌రెడ్డి | Government is encouraging alcohol: Kishan Reddy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తోంది: కిషన్‌రెడ్డి

Published Wed, Jul 26 2017 3:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తోంది: కిషన్‌రెడ్డి - Sakshi

ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తోంది: కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యాన్ని ప్రోత్సహిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మద్యం షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని విమర్శించారు. జాతీయ రహదారుల పక్కన మద్యం షాపుల ఏర్పాటును సుప్రీం నిషేధిస్తే.. ముంబై, నాగ్‌పూర్, విజయవాడ, బెంగళూరు రహదారులను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తెచ్చి వాటికి ఇరువైపులా మద్యం షాపులను ఏర్పాటు చేసిందని ఆరోపించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెల్టు షాపులను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌.. అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలను పెంచేలా చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. మద్యం అమ్మకాలను పెంచినందుకు ఎక్సైజ్‌ కమిషనర్‌ను పిలిచి మరి సీఎం కేసీఆర్‌ అభినందిస్తున్నారని అన్నారు. డ్రగ్స్‌ విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో.. మద్యం నియంత్రణ విషయంలో కూడా అలాగే వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. డిసెంబర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ పర్యటనను పురస్కరించుకొని ఇప్పటినుంచే ఏర్పాట్లు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement