అందరూ బాగుండాలి | Sharmila on the third day of visitation trip | Sakshi
Sakshi News home page

అందరూ బాగుండాలి

Published Thu, Aug 27 2015 1:59 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

అందరూ బాగుండాలి - Sakshi

అందరూ బాగుండాలి

మూడో రోజు పరామర్శ యాత్రలో షర్మిల
 
వరంగల్ : దివంగత మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత సోదరి షర్మిల పరామర్శ యాత్రకు జిల్లాలో మంచి స్పందన వచ్చింది. మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా షర్మిల బుధవారం ధర్మసాగర్, హన్మకొండ, వర్ధన్నపేట మండలాల్లోని ఏడు కుటుంబాలను పరామర్శించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం జ్యోతినికేతన్ పాఠశాల నుంచి మడికొండ, సింగారం మీదుగా యాత్ర సాగింది. 82.5 కిలో మీటర్ల దూరం సాగిన అనంతరం ఖాజీపేటలోని బాలవికాస ఆవరణలో షర్మిల బస చేశారు. షర్మిల పరామర్శ జరిగిన అన్ని గ్రామాల్లోనూ స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయను చూసేందుకు ఉత్సాహంగా  ఎదురుచూశారు.

దగ్గరికి వచ్చి చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల పరామర్శ యాత్ర సాగింది. షర్మిల అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వృద్ధులు, పిల్లలు కనిపించగానే ఆప్యాయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. జ్యోతి నికేతన్ స్కూల్‌లోని పిల్లలతో మమేకయ్యారు. అందరూ బాగా చదుకోవాలని సూచించారు. సింగారంలో షర్మిలకు బోనాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు. అక్కడి మహిళలు షర్మిల వద్దకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడారు.
 
దాదాపు గంట సేపు.. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల ఒక్కో ఇంట్లో దాదాపు గంట సేపు ఉన్నారు. ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య భార్య రాజమ్మ, కుమారుడు రవీందర్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బీటెక్ చదువుతున్న రవీందర్ కుమారైను ‘ఎంత పర్సంటేజ్ వచ్చింది. బాగా చదువుకో’ అని సూచించారు. రాష్ట్రంలో తరుచు పర్యటించాలని వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని వారు షర్మిలతో చెప్పారు. వైఎస్‌ఆర్ చేసి అభివృద్ధి పనులు ఇప్పటికి కనిపిస్తున్నాయని వారు అన్నారు. అధైర్య పడవద్దని మళ్లీ మంచి రోజులు వస్తాయని షర్మిల వారికి  భరోసా కల్పించారు. ధర్మసాగర్ మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ కుటుంబాన్ని ఇంటికి వెళ్లారు. ‘నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన వెంట నడిచి ఆ మహనాయకుడి తో షేక్‌హ్యండ్ తీసుకున్నాను. జగనన్న వస్తాడని ఎదురుచూసాం. మీరు రావడం మా కుటుంబానికి ఎంతో దైర్యం ఇచ్చింది’ అని మర్రి లక్ష్మీ భర్త ఐల య్య షర్మిలతో అన్నారు. మడికొండలోని మద్దెల గట్టయ్య భార్య వరలక్ష్మి, కూతురు కొమల, కుమారులు కుమారస్వామి, అశోక్‌కుమార్ వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. ‘అన్న ఎంపని చేస్తున్నారు’ అంటూ వివరాలు అడిగారు.

కూలిపని చేసుకుంటున్నట్లు కుమారులు షర్మిలకు తెలిపారు. ‘అవ్వ బాధపడకు. ఆరోగ్యం దెబ్బతింటుంది ఏ క ష్టం వచ్చిన మేమున్నాం’ అని దైర్యం నింపారు. అ నంతరం వస్కుల సుధాకర్ కుటుంబ సభ్యులను ష ర్మిల పరామర్శించారు. ‘పెద్దయ్య మీబిడ్డ దేవుడి ద గ్గర ఉన్నాడు దైర్యంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉందా పెద్దయ్య బాధపడకు. దేవుడు ఉ న్నాడు. గొప్పవాడు’ అని షర్మిల అన్నారు. అనంత రం సింగారంలోని కాకర్ల రాజయ్య ఇంటికి వెళ్లారు. ‘మీ కష్టాలు తెలుసు. మీ జీవితాల్లో వెలుగులు నిం పటానికే మీ దగ్గరికోచ్చా. మీ కష్టాల్లో భాగస్వామిని అవుతా. మనకు మంచిరోజులు వస్తాయమ్మ. మీరు దైర్యంగా ఉండండి. మీకు ఏ కష్టమొచ్చిన నావద్దకు రండి. మీకు ఆండగా ఉంటా’ అని అన్నారు. మా మునూరులోని ఎర్ర భాస్కర్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ‘మీ కుటుంబానికి ఆండగా ఉం టా.’ అని భాస్కర్ భార్య లతకు భరోసా ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement