పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల గురువారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పెద్దమ్మగడ్డలోని తీగల చిరంజీవి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మమైదాన్‌లో జన్ను సక్కుబాయి ఇంటికి వెళ్తారు. తర్వాత దేశాయిపేటలోని బత్తాపురం కొమురయ్య, కాశిబుగ్గలోని నాగవెల్లి వీరస్వామి, ఉర్సులోని రామ సుదర్శన్ కుటుంబాలను పరామర్శిస్తారు.
అనంతరం పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని మరిపురంలోని బిట్ల రాజ్యలక్ష్మీ ఇంటికి వెళ్తారు. నాలుగో రోజు చివరగా ఇదే మండలం ఊకల్ హవేలిలోని ఓదెల స్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. గురువారం పరామర్శ యాత్ర 68 కిలో మీటర్లు సాగనుంది.
గురువారం ఏడు కుటుంబాలకు పరామర్శ
Published Thu, Aug 27 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement