నేటి నుంచి మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహానేత వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మెతుకుసీమలో పరామర్శకు పయనమవుతున్నారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. షర్మిల వెంట వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉంటారు.