
భువనమంత అభిమానం
నల్లగొండ జిల్లాలో మలి విడత పరామర్శయాత్రలో భాగంగా షర్మిల తొలిరోజు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ఐదు కుటుంబాలను పరామర్శించారు. ఆమెకు ప్రజలు ‘భువన’మంత అభిమానం చూపారు. ‘మా కుటుంబంపై మీరు చూపుతున్న అభిమానానికి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.’ అని షర్మిల వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు.