
వైఎస్‌ఆర్ సీపీలో పలువురి చేరిక
కొడకండ్ల : మండలంలోని టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు షర్మిల రెండో విడత పరామర్శ యాత్రలో భాగంగా సోమవారం వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
మండల కేంద్రానికి చెందిన టీడీపీ ఎస్టీ సెల్ నాయకుడు గుగులోత్ రాంజీనాయక్, కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు కర్ర అశోక్‌రెడ్డి, కొడకండ్లకు చెందిన మిట్ట అశోక్‌రెడ్డి, ముక్కెర సురేష్, వెంకన్న, నరేష్‌ల ఆధ్వర్యంలో 15 మంది వైఎస్సార్ సీపీలో చేరగా వారికి శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా నాయకుడు కాందాటి అచ్చిరెడ్డి, మండల నాయకులు నీలం లక్ష్మయ్య పాల్గొన్నారు.